రియల్ మీ 10 ప్రో ఫీచర్ లు ఇవే.. మొదటిసారి అలాంటి డిస్ ప్లే తో వచ్చిన ఫోన్?
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ ప్రస్తుతం మంచి దూకుడు మీద ఉంది. మార్కెట్ లోకి వరుసగా స్మార్ట్ ఫోన్
- By Nakshatra Published Date - 04:00 PM, Thu - 10 November 22
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ రియల్ మీ ప్రస్తుతం మంచి దూకుడు మీద ఉంది. మార్కెట్ లోకి వరుసగా స్మార్ట్ ఫోన్ లను విడుదల చేస్తూనే ఉంది. మరి ముఖ్యంగా వినియోగదారులకు అనుగుణంగా అది తక్కువ బడ్జెట్ లోనే మంచి మంచి వేరియంట్లతో కూడిన మొబైల్ ఫోన్లను లాంచ్ చేస్తుంది రియల్ మీ సంస్థ. క్రమంలోని తాజాగా మార్కెట్లోకి రియల్ మీ 10 సిరీస్ లో తీసుకొచ్చేందుకు సిద్ధమయ్యింది. ఈ రియల్ మీ 10 సిరీస్ లో భాగంగానే రియల్ మీ 10 ప్రో రియల్ మీ 10 ప్రో ప్లస్ పేరుతో ఫోన్లను కూడా తీసుకురానుంది.
ఈ స్మార్ట్ ఫోన్ల కోసం కర్వ్డ్ డిస్ప్లేను టీజ్ చేస్తోంది. కాగా రియల్ మీ మొదటి సారి తన నంబర్డ్ స్మార్ట్‌ఫోన్ సిరీస్‌కి కర్వ్డ్ డిస్ప్లేను జోడిస్తోంది. చైనా టెలికాం అప్లోడ్ చేసిన రియల్ మీ 10 Pro 5జీ వివరాలు ఫ్లాట్ డిస్ప్లేను చూపుతాయి. 8 జీబీ 128జీబీ, 8 జీబీ 256జీబీ అలాగే 12 జీబీ 256జీబీ అనే మూడు మెమరీ కాన్ఫిగరేషన్లతో Geekbench నుండి మనం చూసిన వాటి ఆధారంగా ఇది స్నాప్‌డ్రాగన్ 695 ద్వారా అందించబడుతుంది.
ఈ స్మార్ట్ ఫోన్ 5,000mAh బ్యాటరీనీ కలిగి ఉంది.
వెనుకవైపు 16+2+2ఎంపీ, ముందువైపు 16ఎంపీ గా ఫిక్స్ చేయబడ్డాయి. అయినప్పటికీ వెనుకవైపు ఉన్న ప్రధాన మాడ్యూల్ 64ఎంపీ సెన్సార్‌ను కలిగి ఉంటుంది. పిక్సెల్ బిన్నింగ్ తర్వాత 16ఎంపీ డిఫాల్ట్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుంది. ఇకపోతే రియల్ మీ 10 Pro ధర టాప్ 12జీబీ 256జీబీ యూనిట్ కోసం CNY 1,900 మన ఇండియన్ కరెన్సీ ప్రకారం రూ.21,461గా కోట్ చేయబడింది. ఇది $260 గా అంటే రూ.21,297 కి మారే అవకాశం ఉంది. కాగా ఇందుకు సంబందించిన పూర్తి వివరాలు నవంబర్ 17న ప్రారంభం రోజున తెలుస్తాయి.
Related News
Super Fast Display : సూపర్ ఫాస్ట్ డిస్ప్లేతో ప్రపంచంలోనే తొలి ఫోన్
Super Fast Display : సూపర్ ఫాస్ట్ డిస్ప్లే ఆప్షన్లతో ‘రియల్మీ జీటీ నియో 6 ఎస్ఈ’ మోడల్ స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది.