PM MODI: ప్రధాని మోదీ చేతిలో యాంటీ డ్రోన్ గన్…శత్రువుల వెన్నులో వణుకే..!!
అక్టోబర్ 19న గుజరాత్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిఫెన్స్ ఎక్స్ పోను ప్రారంభించారు. ఆ తర్వాత ఎగ్జిబిషన్ ఏరియాకు వెళ్లారు. అక్కడో తుపాకీ ప్రధానిని ఆకట్టుకుంది.
- By hashtagu Published Date - 08:06 PM, Thu - 20 October 22

అక్టోబర్ 19న గుజరాత్ ప్రధానమంత్రి నరేంద్రమోదీ డిఫెన్స్ ఎక్స్ పోను ప్రారంభించారు. ఆ తర్వాత ఎగ్జిబిషన్ ఏరియాకు వెళ్లారు. అక్కడో తుపాకీ ప్రధానిని ఆకట్టుకుంది. దాన్ని లెటెస్ట్ టెక్నాలజీతో తయారు చేశారు. సైన్స్ ఫిక్షన్ కూడా. ఈ తొలితుపాకీ సెట్ ను భారత వైమాని దళానికి అందించారు ప్రధాని. అయితే గొట్టం లేకుండా తుపాకీతో ఎలాంటి ఉపయోగం ఉంటుంది. దాని వల్ల ఉపయోగం ఏంటి.. వీటన్నింటి గురించి ప్రధాని ఆరా తీశారు.
ఈ తుపాకీని గురుత్వా సిస్టమ్స్ తయారు చేసింది. ఈ తుపాకీ పేరు ద్రోణం. మానవరహిత విమాన వ్యవస్థలను ఎదుర్కొంటుంది. ఇంకా చెప్పాలంటే దీనిని యాంటీ డ్రోన్ గన్ అని పిలుస్తారు. డ్రోన్ అనేది అత్యాధుని మాడ్యులర్ సిస్టమ్. ఇది దేశంలోకి చొరబడే శత్రు డ్రోన్ లను కాల్చి పడేస్తుంది. అంతేకాదు సిస్టమ్ ఓమ్ని డైరెక్షనల్ కవరేజ్ సౌకర్యాన్ని ఇది కలిగి ఉంది. డిస్మౌంట్ లేదా మౌంటెడ్ ఆపరేషన్ కోసం ఉపయోగిస్తారు. ఈ వ్యవస్థను సైన్స్ ఫిక్షన్ గన్ గా కూడా ఉపయోగించుకోవచ్చు. ఈ వ్యవస్థ శ్రతు డ్రోన్స్ లను GNSSనియంత్రణ, వీడియో, టెలిమెట్రీ సిగ్నల్స్ ను స్తంభింప చేస్తుంది.
#DRONAAM Counter-unmanned aircraft systems (C-UASs) https://t.co/ShuS0hueyy pic.twitter.com/cZidDDsRfr
— Defence Decode® (@DefenceDecode) October 20, 2022