Data Breach : 16 బిలియన్ పాస్‌వర్డ్లు లీక్..! మీ ఖాతా కూడా ఉందా.. ఇలా తెలుసుకోండి..!
ఇంటర్నెట్ ప్రపంచాన్ని కుదిపేసే విధంగా ఓ భారీ డేటా లీక్ వెలుగులోకి వచ్చింది. సుమారు 16 బిలియన్ పాస్‌వర్డ్లు.. అంటే పదిలక్షల కోట్లకు పైగా లాగిన్ వివరాలు.. ఆన్‌లైన్‌లో లీక్ అయినట్టు సైబర్ భద్రతా నిపుణులు వెల్లడించారు.
- By Kavya Krishna Published Date - 07:56 PM, Mon - 23 June 25

Data Breach : ఇంటర్నెట్ ప్రపంచాన్ని కుదిపేసే విధంగా ఓ భారీ డేటా లీక్ వెలుగులోకి వచ్చింది. సుమారు 16 బిలియన్ పాస్‌వర్డ్లు.. అంటే పదిలక్షల కోట్లకు పైగా లాగిన్ వివరాలు.. ఆన్‌లైన్‌లో లీక్ అయినట్టు సైబర్ భద్రతా నిపుణులు వెల్లడించారు. ఈ లీక్ వల్ల గూగుల్, ఫేస్‌బుక్, యాపిల్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్, ప్రభుత్వ వెబ్‌సైట్లతో పాటు అనేక ప్రముఖ సేవల యూజర్ల ఖాతాలు ప్రమాదంలో పడ్డాయి.
ఈ లీక్ “Mother of All Breaches” (MOAB) అనే పేరుతో పిలవబడుతోంది. గతంలో చోటు చేసుకున్న పలు డేటా ఉల్లంఘనల నుంచి సేకరించబడిన సమాచారం ఇందులో ఉంది. ముఖ్యంగా యూజర్ల బ్రౌజర్‌ల్లో స్టోర్ అయిన పాస్‌వర్డ్లు, క్లిప్ బోర్డ్స్ లో కాపీ చేసిన సమాచారం, లేదా డివైస్‌లో సేవ్ చేసిన క్రెడెంషియల్స్ ఇలా అన్ని ఒకే చోట సమీకరించబడ్డాయి. ఈ డేటాను దొంగిలించేందుకు ఇన్ఫోస్టీలర్ అనే మాల్వేర్ టూల్స్ ఉపయోగించినట్లు నిపుణులు చెబుతున్నారు.
ఇప్పటికే ఈ లీక్‌లో ఉన్న సమాచారం కొన్ని చౌకభారమైన హ్యాకింగ్ ఫోరమ్‌లలో అమ్మకానికి ఉంచబడినట్టు తెలుస్తోంది. అందువల్ల, ఏ ఖాతాలో అయినా పాత పాస్‌వర్డ్ ఉపయోగిస్తుంటే, అది ఇప్పటికిప్పుడు మార్పు చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా గూగుల్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ వంటి ఖాతాల్లో గతంలో ఉపయోగించిన పాస్‌వర్డ్‌ను ఇప్పటికీ వాడుతున్నట్లయితే, ప్రమాదంలో ఉన్నట్లే అని చెప్పాలి.
Health : విటమిన్ డి సమస్య వేధిస్తుందా? ఇలా చేస్తే మీ ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు!
ఈ నేపథ్యంలో నిపుణులు సూచిస్తున్న కీలక విషయం ఏమిటంటే.. ఒకే పాస్‌వర్డ్‌ను అన్ని ఖాతాల్లో వాడటం మానేయాలి. అదేవిధంగా, మీ ఖాతాల భద్రత కోసం టూ ఫాక్టర్ ఆథెంటికేషన్ (2FA) లేదా మల్టీ ఫాక్టర్ ఆథెంటికేషన్ (MFA) తప్పనిసరిగా సెట్ చేయాలి. అలాగే, పాస్‌వర్డ్ మేనేజర్‌ను వాడటం వల్ల బలమైన, రాండమ్ పాస్‌వర్డ్లు ఉంచుకోవచ్చు.
ఈ లీక్‌లో మీ డేటా ఉందా లేదా అనే విషయాన్ని తెలుసుకోవాలంటే “Have I Been Pwned” అనే వెబ్‌సైట్‌ను ఉపయోగించవచ్చు. మీ ఈమెయిల్ లేదా ఫోన్ నెంబర్‌ను అక్కడ ఎంటర్ చేస్తే, గతంలో అది ఏదైనా లీక్‌లో భాగమైందా అనే సమాచారం తెలుస్తుంది.
ఇక భవిష్యత్తులో ఈ సమస్యలు తలెత్తకుండా ఉండాలంటే, గూగుల్, యాపిల్ వంటి సంస్థలు ప్రచారం చేస్తున్న “Passkeys” అనే కొత్త విధానాన్ని కూడా పరిగణనలోకి తీసుకోవచ్చు. ఇది పాస్‌వర్డ్‌లను పూర్తిగా తొలగించి, బయోమెట్రిక్ లేదా డివైస్ ఆధారిత ఆథెంటికేషన్ ద్వారా లాగిన్ చేసే సురక్షిత మార్గం.
ఈ 16 బిలియన్ పాస్‌వర్డ్ లీక్ ఘటన ఓ పెద్ద హెచ్చరికే. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న “160 బిలియన్ పాస్‌వర్డ్లు లీక్ అయ్యాయి” అనే వార్త కొంతవరకు ఊదరగొట్టడమే అయినా, అసలు లీక్ దాదాపు 16 బిలియన్ల డేటా వరకు ఉండటం మాత్రం నిజం. ఇది సరదా విషయం కాదు. ఎవరి ఖాతాలైనా దొంగల చేతిలో పడే అవకాశం ఉంది. అందుకే, వెంటనే అప్రమత్తమై మీ పాస్‌వర్డ్లు మార్చుకోవడం, భద్రతా చర్యలు తీసుకోవడం అనివార్యమని గుర్తుంచుకోండి.
Bumrah: కపిల్ దేవ్ రికార్డును సమం చేసిన బుమ్రా!