OnePlus 10 స్మార్ట్ ఫోన్ ఫీచర్స్ లీక్…32MP సెల్ఫీ కెమెరా సహా స్పెషల్ ఫీచర్స్ మీకోసం…
OnePlus నుంచి వచ్చిన కొత్త స్మార్ట్‌ఫోన్ త్వరలోనే మార్కెట్లోకి వస్తోంది. ఈ ఫోన్ Ovaltine కోడ్‌తో గుర్తించారు. నివేదికల ప్రకారం, ఈ ఫోన్ OnePlus 10గా మార్కెట్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ స్మా
- By hashtagu Published Date - 11:30 AM, Sun - 12 June 22
OnePlus నుంచి వచ్చిన కొత్త స్మార్ట్‌ఫోన్ త్వరలోనే మార్కెట్లోకి వస్తోంది. ఈ ఫోన్ Ovaltine కోడ్‌తో గుర్తించారు. నివేదికల ప్రకారం, ఈ ఫోన్ OnePlus 10గా మార్కెట్లోకి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ తేదీ గురించి అధికారిక సమాచారం లేదు. అయితే, దాని స్పెసిఫికేషన్లు టెక్ మార్కెట్లో లీక్ అయ్యాయి.
ఈ సరికొత్త OnePlus 10లో Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్‌ని పొందవచ్చు. ఇందులో 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. ముందు భాగంలో, కంపెనీ 32MP సెల్ఫీ కెమెరా ఇందులో ప్రత్యేకత అనే చెప్పాలి. తద్వారా మీరు అందమైన సెల్ఫీలను తీసుకునే వీలుంది.
డిజైన్
ప్రముఖ టెక్ నిపుణుడు యోగేష్ బ్రార్ ఈ స్మార్ట్‌ఫోన్ వివరాలను తెలిపారు. లీకైన సమాచారం ప్రకారం, ఈ ఫోన్ OnePlus 10 లేదా OnePlus 10T గా మార్కెట్లోకి రావచ్చు. లీకైన రెండర్ ఫోన్ బ్లాక్ వేరియంట్‌గా వస్తోంది. వెనుకవైపు OnePlus బ్రాండింగ్ ఉంది.
ఫోన్ పంచ్ హోల్ డిస్ప్లే డిజైన్‌తో వస్తుంది. ఇది OnePlus 10 Pro లాగా కనిపించే ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌ను కలిగి ఉంది. డిజైన్ పరంగా, ఈ ఫోన్ OnePlus 10 Proని పోలి ఉంటుంది.
ఫీచర్స్ ఇవే..
స్మార్ట్‌ఫోన్ ఫీచర్ల గురించి మాట్లాడుకుంటే, ఇది 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్‌తో 6.7-అంగుళాల ఫుల్ HD + AMOLED డిస్ప్లేతో వస్తుంది. హ్యాండ్సెట్ ఆక్సిజన్ OS 12 పై రన్ అవుతుంది. ఇది Qualcomm Snapdragon 8+ Gen 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.
ఆప్టిక్స్ గురించి మాట్లాడుకుంటే, ఫోన్ 50MP ప్రధాన లెన్స్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ దీని సొంతం. వెనుక కెమెరా OIS మద్దతుతో వస్తుంది. హ్యాండ్‌సెట్‌లో 32MP సెల్ఫీ కెమెరాను అందించవచ్చు. ఈ పోన్ కు శక్తినివ్వడానికి 4800mAh బ్యాటరీ దీని సొంతం.
మార్చిలో ప్రారంభించిన OnePlus 10 Proకి సక్సెసర్‌గా కంపెనీ ఈ ఫోన్‌ను లాంచ్ చేయవచ్చు. మార్చిలో విడుదల చేసిన ఈ ఫోన్ ధర రూ.66,999గా ఉంది. మరి ఈ OnePlus 10 లేదా OnePlus 10T ధర ఎంత నిర్ణయిస్తారో ముందు ముందు తెలియాల్సి ఉంది.
Related News
OnePlus Phones: ‘వన్ ప్లస్’ ఫోన్స్.. వచ్చే నెల నుంచి ఈ రాష్ట్రాల్లో దొరకవు.. ఎందుకు..?
సౌత్ ఇండియా ఆర్గనైజ్డ్ రిటైలర్స్ అసోసియేషన్ (ORA) బుధవారం ఒక ప్రధాన నిర్ణయం తీసుకుంది. వన్ ప్లస్ (OnePlus Phones) ఉత్పత్తుల ఆఫ్‌లైన్ అమ్మకాలను నిలిపివేయాలని పేర్కొంది.