Ola Diwali 2022: కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్..ధర ఫీచర్లు తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?
ప్రముఖ క్యాబ్ సర్వీసుల సంస్థ ఓలా ఇప్పటికే ఎన్నో రకాల ఎలక్ట్రిక్ స్కూటర్ లను మార్కెట్ లోకి విడుదల చేసిన
- Author : Anshu
Date : 11-10-2022 - 4:00 IST
Published By : Hashtagu Telugu Desk
ప్రముఖ క్యాబ్ సర్వీసుల సంస్థ ఓలా ఇప్పటికే ఎన్నో రకాల ఎలక్ట్రిక్ స్కూటర్ లను మార్కెట్ లోకి విడుదల చేసిన విషయం తెలిసిందే. వినియోగదారుల అభిరుచుల మేరకు ఓలా సంస్థ ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో ఎలక్ట్రిక్ స్కూటర్లను మార్కెట్ లోకి విడుదల చేస్తూనే ఉంది. ఇలా ఉంటే దీపావళి పండుగ సందర్భంగా ఓలా వినియోగదారుల కోసం మరొక సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ను మార్కెట్లోకి లాంచ్ చేయబోతోంది.
మార్కెట్ లోకి రోజురోజుకీ ఎలక్ట్రిక్ వాహనాలకు డిమాండ్ పెరిగిపోవడంతో ఈ నేపథ్యంలోనే అతి తక్కువ ధరలో కొత్త వేరియంట్ ను వినియోగదారుల కోసం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తుంది ఓలా సంస్థ. కాగా ఓలా సంస్థ సరికొత్తగా మార్కెట్లోకి తీసుకురానున్న ఆ కొత్త వేరియంట్ స్కూటర్ ధర రూ.80 వేలు అని అని సమాచారం. ఇదే విషయాన్ని కంపెనీ సీఈఓ అయిన భావిష్ అగర్వాల్ అసలు మీడియా వేదికగా ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ఆయన ట్విట్ చేస్తూ ఓలా ఎస్ 1ఎలక్ట్రిక్ స్కూటర్ ను కొత్త వేరియంట్ ను తీసుకొస్తున్నట్లు వెల్లడించారు.
అక్టోబర్ 22 దీపావళి పండుగ జరగబోతోంది. ఈ సందర్భంగా అతిపెద్ద ప్రకటనలలో ఇది కూడా ఒకటి. త్వరలోనే కలుద్దాం అంటూ భావిష్ అగర్వాల్ ట్వీట్ చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోను కూడా విడుదల చేశారు. ఆ వీడియోలో ఆగస్టు 15న ఈవెంట్లో వాగ్దానం చేసిన విధంగానే కంపెనీ MoveOs 3 ని Ola S1 కీ రోల్ అవుట్ గా ప్రకటించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ ఓలా ఎస్ 1 ఎలక్ట్రిక్ స్కూటర్ ప్రస్తుతం భారత మార్కెట్లో రూ.99,999 కీ లభిస్తోంది.