Whatsapp: వాట్సాప్లో ఇంట్రెస్టింగ్ ఫీచర్.. ప్రైవసీకి మరింత పెద్ద పీట వేస్తూ..
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం కోట్లాదిమంది ఉపయోగిస్తున్న మెసే
- By Anshu Published Date - 04:30 PM, Tue - 13 February 24

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం కోట్లాదిమంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్స్ లో వాట్సాప్ ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక వాట్సాప్ వినియోగదారుల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉండడంతో వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం వాట్సాప్ సంస్థ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. కాగా ఇప్పటికే పదుల సంఖ్యలో కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేసిన వాట్సాప్ సంస్థ ఇప్పుడు వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని తీసుకొచ్చింది.
వాట్సాప్‌లో కొత్త ఈ కొత్త ఫీచర్ సహాయంతో మీరు లాక్ స్క్రీన్ నుంచి నేరుగా స్పామ్ మెసేజ్‌లను బ్లాక్ చేసకోవచ్చు. మీకు వచ్చే స్పామ్ సందేశాలను నేరుగా బ్లాక్ చేసుకోవచ్చు. దీంతో యూజర్ల సమయం వృథా కాదు. స్మార్ట్ ఫోన్ స్క్రీన్ లాక్‌లో ఉన్న సమయంలోనే నేరుగా స్పామ్ మెసేజ్‌ను బ్లాక్ చేయవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేయాల్సి పనిలేదు. అయితే వాట్సాప్‌లో ఇప్పటికే బ్లాక్ అండ్ రిపోర్ట్ ఆప్షన్ ఉంది. కాగా ఇప్పటి వరకు వాట్సాప్ నోటిఫికేషన్ లలో గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే స్పామ్ మెసేజ్ లపై వార్నింగ్ మాత్రమే కనిపించేది. అయితే, ఈ కాంటాక్ట్‌లను బ్లాక్ చేయాలంటే తప్పనిసరిగా చాట్‌ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది.
అంతేకాదు.. కొన్నిసార్లు యూజర్లు తరచుగా స్పామ్ మెసేజ్ లను అన్‌బ్లాక్ చేసి వదిలివేస్తారు. ఈ కొత్త ఫీచర్ సహాయంతో మెసేజ్ ఓపెన్ చేయకుండానే బ్లాక్ చేసుకోవచ్చు. వాట్సాప్‌లో కొత్త ఈ కొత్త ఫీచర్ సహాయంతో మీరు లాక్ స్క్రీన్ నుంచి నేరుగా స్పామ్ మెసేజ్‌లను బ్లాక్ చేసకోవచ్చు. మీకు వచ్చే స్పామ్ సందేశాలను నేరుగా బ్లాక్ చేసుకోవచ్చు. దీంతో యూజర్ల సమయం వృథా కాదు. స్మార్ట్ ఫోన్ స్క్రీన్ లాక్‌లో ఉన్న సమయంలోనే నేరుగా స్పామ్ మెసేజ్‌ను బ్లాక్ చేయవచ్చు. ఇందుకోసం ప్రత్యేకంగా వాట్సాప్ యాప్‌ను ఓపెన్ చేయాల్సి పనిలేదు. అయితే వాట్సాప్‌లో ఇప్పటికే బ్లాక్ అండ్ రిపోర్ట్ ఆప్షన్ ఉంది. ఇప్పటివరకు వాట్సాప్ నోటిఫికేషన్లలో గుర్తుతెలియని నంబర్ల నుంచి వచ్చే స్పామ్ మెసేజ్‌లపై వార్నింగ్ మాత్రమే కనిపించేది. అయితే, ఈ కాంటాక్ట్‌లను బ్లాక్ చేయాలంటే తప్పనిసరిగా చాట్‌ని ఓపెన్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు.. కొన్నిసార్లు యూజర్లు తరచుగా స్పామ్ మెసేజ్‌లను అన్‌బ్లాక్ చేసి వదిలివేస్తారు. ఈ కొత్త ఫీచర్ సహాయంతో మెసేజ్ ఓపెన్ చేయకుండానే బ్లాక్ చేసుకోవచ్చు.