Nothing Phone 2 : అమెజాన్ లో భారీగా తగ్గిన నథింగ్ ఫోన్ 2 ధర..కొనేవారికి ఇదే మంచి ఛాన్స్
Nothing Phone 2 : అసలు ధర రూ.44,999 ఉన్న ఈ ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ.30,995కి లభిస్తోంది. అదనంగా రూ.750 డిస్కౌంట్ కూపన్, HDFC బ్యాంక్ ఆఫర్‌లతో రూ.2,000 తగ్గింపుతో మొత్తం ధర రూ.28,200 వరకు తగ్గే అవకాశం ఉంది
- By Sudheer Published Date - 08:41 PM, Thu - 29 May 25

నథింగ్ (Nothing ) కంపెనీ తమ తాజా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్ నథింగ్ ఫోన్ 3 (Nothing Phone 3)ను 2024 జూలైలో భారత మార్కెట్లో విడుదల చేయనున్న నేపథ్యంలో, ఇప్పటికే మార్కెట్లో ఉన్న నథింగ్ ఫోన్ 2 (Nothing Phone 2)ధరను భారీగా తగ్గించింది. అసలు ధర రూ.44,999 ఉన్న ఈ ఫోన్ ప్రస్తుతం అమెజాన్‌లో రూ.30,995కి లభిస్తోంది. అదనంగా రూ.750 డిస్కౌంట్ కూపన్, HDFC బ్యాంక్ ఆఫర్‌లతో రూ.2,000 తగ్గింపుతో మొత్తం ధర రూ.28,200 వరకు తగ్గే అవకాశం ఉంది. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేస్తే రూ.28,900 వరకు అదనపు తగ్గింపు కూడా పొందొచ్చు.
Mahanadu : కడప గడ్డ పై చంద్రబాబు మాస్ వార్నింగ్
నథింగ్ ఫోన్ 2 స్పెసిఫికేషన్లలో చూస్తే.. ఇది 6.7 అంగుళాల OLED డిస్‌ప్లేతో, 120Hz రిఫ్రెష్ రేట్ మరియు 1600 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ సపోర్టుతో వస్తుంది. ఫోన్‌లో కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ ఉంది. దీని హార్డ్‌వేర్ పరంగా, స్నాప్‌డ్రాగన్ 8 ప్లస్ జెన్ 1 చిప్‌సెట్, 12GB ర్యామ్, 256GB స్టోరేజ్, 4,700mAh బ్యాటరీతో పాటు 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది. అలాగే IP54 రేటింగ్ ద్వారా డస్ట్, స్ప్లాష్ రెసిస్టెంట్ ఫీచర్ కూడా ఉంది.
ఫోటోగ్రఫీ కోసం నథింగ్ ఫోన్ 2లో 50MP ప్రైమరీ, 50MP అల్ట్రా వైడ్ కెమెరాలుతో డ్యూయల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీ లవర్స్ కోసం 32MP ఫ్రంట్ కెమెరా ఉంది. ప్రత్యేకమైన డిజైన్, క్లీన్ UIతో పాటు ఈ ఫోన్ ఆధునిక ఫీచర్లను ఇష్టపడే వారికి ఎంతో ఆకర్షణీయంగా నిలుస్తోంది. నూతన మోడల్ రాక ముందు నథింగ్ ఫోన్ 2పై ఇలాంటి భారీ తగ్గింపులు వినియోగదారులకు మంచి అవకాశం కావొచ్చు.