iQoo Z9s: మార్కెట్లోకి రాబోతున్న మరో సరికొత్త స్మార్ట్ ఫోన్.. విడుదల తేదీ ఫిక్స్!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఐక్యూ నుంచి త్వరలోనే మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదల కాబోతోందట.
- By Anshu Published Date - 11:00 AM, Sun - 4 August 24

ఈ మధ్యకాలంలో మార్కెట్లోకి సూపర్ ఫీచర్లతో రకరకాల బ్రాండ్ల స్మార్ట్ ఫోన్లు విడుదల అవుతున్న విషయం తెలిసిందే. అద్భుతమైన లుక్స్ తో ఆకట్టుకోవడంతో పాటు సరసమైన ధరలకే మార్కెట్లోకి విడుదల అవుతున్నాయి. అయితే ఇప్పటికే చాలా రకాల స్మార్ట్ ఫోన్ లు మార్కెట్లోకి విడుదలైన విషయం తెలిసిందే. త్వరలోనే మరో సరికొత్త స్మార్ట్ ఫోన్ కూడా మార్కెట్లోకి విడుదల కానుంది. ఆ స్మార్ట్ ఫోన్ మరేదో కాదు ఐక్యూ. ప్రముఖ కంపెనీ ఐక్యూ నుంచి నయా స్మార్ట్ ఫోన్ లాంచ్ చేయనుందని పలు నివేదికలు చెబుతున్నాయి.
ఐక్యూ జెడ్9ఎస్ సిరీస్‌ను లాంచ్ చేసేందుకు ఆ కంపెనీ సన్నాహాలు పూర్తి చేసిందట. కొత్త సిరీస్ ను ఆగస్టు 21న విడుదల చేస్తున్నట్టు కంపెనీ సీఈవో నిపున్ మారియా ప్రకటించారు. విడుదల కాబోతున్న ఆ స్మార్ట్ ఫోన్ కి సంబంధించి ప్రత్యేకతలు ఫీచర్ల విషయానికొస్తే.. ఐక్యూ జెడ్9ఎస్, ఐక్యూ జెడ్9ఎస్ ప్రో మోడళ్లు విడుదల అవుతాయని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. కాబట్టి భారత్ లో త్వరలో లాంచ్ చేసేది కచ్చితంగా ఐక్యూ జెడ్9 కు కొత్త ఐక్యూ జెడ్9ఎస్ రీబ్రాండెడ్ వెర్షన్ అని భావిస్తున్నారు. ఐక్యూజెడ్9ఎస్ విడుదల తేదీని ఆ కంపెనీ సీఈవో నిపుణ్ మారియా అధికారంగా నిర్ధారించారు. ఈ మేరకు ఎక్స్ లో ఒక పోస్ట్ కూడా చేశారు.
ఈ సందర్భంగా విడుదల తేదీతో పాటు ఫోన్ ఇమేజ్ ను కూడా అప్ లోడ్ చేశారు. గోల్డెన్ కలర్‌లో నయా స్టార్ట్ ఫోన్ ఆకట్టుకుంటోంది. అలాగే సెగ్మెంట్ లో వేగవంతమైన కర్వ్డ్ స్క్రీన్ ఫోన్ అనే ట్యాగ్‌లైన్‌తో ఎక్స్‌లో పోస్ట్ చేశారు. అలాగే ఇటీవల ఐక్యూ జెడ్9ఎస్ సిరీస్ హ్యాండ్‌సెట్ లలో ఒకదాని డిజైన్ ను పరిచయం చేశారు. వైట్ కలర్ లో వైట్ మార్బుల్ డిజైన్ తో ఆకట్టుకుంటుంది. స్మార్ట్‌ఫోన్ పై భాగంగా ఎడమ వైపు కెమెరా మాడ్యూల్ తో వస్తుంది. అలాగే కుడి వైపు అంచున వాల్యూమ్ రాకర్, పవర్ బటన్ ఏర్పాటు చేశారు. కాగా ఈ ఐక్యూజెడ్9ఎస్ హ్యాండ్‌సెట్‌లలో ఒకటి గీక్ బెంచ్ లో కనిపించింది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 7 జెన్ 3 చిప్‌సెట్ ఆధారంగా పని చేస్తున్నారు.