New Cars: జూలై నెలలో అందుబాటులోకి రానున్న టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్!
సుజుకితో కలిసి టయోట అర్బన్ రూపొందించిన సరికొత్త మిడ్ సైజ్ SUV వెహికిల్ త్వరలో మార్కెట్లోకి రాబోతుంది.
- By Nakshatra Published Date - 09:30 AM, Thu - 30 June 22
సుజుకితో కలిసి టయోట అర్బన్ రూపొందించిన సరికొత్త మిడ్ సైజ్ SUV వెహికిల్ త్వరలో మార్కెట్లోకి రాబోతుంది. జూలై 1 వ తేదిన అందుబాటులోకి తేనున్నట్లు ఇప్పటికే టయోట సంస్థ ప్రకటించింది. ఇప్పటికే వెహికల్ సంబంధించి విడుదల అయిన టీజర్ చూస్తుంటే.. సరికొత్తగా అత్యాధునిక టెక్నాలజీతో మిడ్ సైజ్ వెహికల్ నూ తయారు చేసినట్లు తెలుస్తోంది.
ఇక మిడ్ సైజ్ వెహికల్ దృడమైన హైబ్రిడ్ పవర్ ట్రెయిన్, ఆల్ వీల్ డ్రైవ్ సెటప్‌తో అందుబాటులోకి తేనున్నట్లు టయోట ప్రకటించింది. ఇక వెహికల్ టీజర్ ని పరిశీలిస్తే. హైరైడర్ స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ సెటప్.. టూ-టోన్ పెయింట్ స్కీమ్.. డ్యూయల్-ఫినిష్ అల్లాయ్‌లతో పాటు తొమ్మిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మరియు కనెక్ట్ చేయబడిన కార్ టెక్ని కలిగి ఉంటుందని అర్థమవుతోంది.
కొత్త హ్యుందాయ్ టక్సన్ – జూలై 13
హ్యుందాయ్ సంస్థ కొత్త తరం టక్సన్‌ను జూలై 13న మార్కెట్లోకి విడుదల చేయనుంది. గత నెలలో టక్సన్ కార్ల తయారీకి సంబంధించిన ఫోటోలను విడుదల చేసినప్పటికి.. ఫ్రీ బుకింగ్ ప్లాట్ ఫాం ఇంకా ప్రారంభం కాలేదని ప్రకటించింది. సరికొత్త టక్సన్ బ్రాండ్.. కొత్త ‘సెన్సుయస్ స్పోర్టినెస్’ డిజైన్ తో పాటు పెద్ద ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ని కలిగి ఉంటుందని తెలిపింది. ఫోర్-స్పోక్ స్టీరింగ్ వీల్ తో పాటు అదనపు ఫీచర్లతో కూడిన క్యాబిన్‌ను కలిగి ఉంటుంది.
Related News
New Maruti Suzuki Swift: లీటర్ పెట్రోల్‌తో 40 కిలోమీటర్లు.. మే 9న మార్కెట్లోకి, బుకింగ్స్ ప్రారంభం
ఈ హ్యాచ్‌బ్యాక్‌ను కంపెనీ అధికారిక వెబ్సైట్లో లేదా అరేనా డీలర్షిప్ నుండి రూ. 11,000 టోకెన్ మొత్తాన్ని చెల్లించి బుక్ చేసుకోవచ్చు.