HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Learn How To Download Youtube Videos To Smart Phone In Telugu

Youtube Hacks : యూట్యూబ్ నుంచి వీడియో ఎలా డౌన్ లోడ్ చేయాలో తెలుసా…?

వీడియోలు చూడాలనుకుంటే ఠక్కున యూట్యూబ్ ఓపెన్ చేస్తాం. అందులో మనకు నచ్చిన వీడియోను సెలక్ట్ చేసుకుని చూస్తుంటాం.

  • Author : Hashtag U Date : 23-01-2022 - 6:00 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Youtube
Youtube

వీడియోలు చూడాలనుకుంటే ఠక్కున యూట్యూబ్ ఓపెన్ చేస్తాం. అందులో మనకు నచ్చిన వీడియోను సెలక్ట్ చేసుకుని చూస్తుంటాం. అయితే నచ్చిన వీడియోను డౌన్ లోడ్ చేసుకోవడం అనేది అంత ఈజీ కాదు.  యూట్యూబ్ డౌన్ ఆప్షన్ ఇవ్వలేదు. కాబట్టి స్మార్ట్ ఫోన్ యూజర్లు థర్డ్ పార్టీ ఫ్లాట్ ఫాంను ఉపయోగించి యూట్యూబ్ లో నుంచి వీడియోలను డౌన్ లోడ్ చేస్తుంటారు. అయితే స్మార్ట్ ఫోన్లో యూట్యూబ్ వీడియో డౌన్ లోడ్ చేయాలంటే థర్డ్ పార్టీ యాప్స్ ఉండాల్సిందే. యూట్యూబ్ లో కనిపించే డౌన్ లోడ్ ఆప్షన్ తో వీడియోను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. కానీ స్మార్ట్ ఫోన్లలో ఆఫ్ లైన్లో వీడియోను చూసేందుకు మాత్రమే ఈ ఫీచర్ ఉపయోగపడుతుంది. ఆ ఫైల్ ఎక్కడ ఉంటుందో కూడా మనకు తెలియదు. కానీ mp4లాంటి ఫార్మాట్ లో వీడియోను డౌన్ లోడ్ చేసుకోవాలంటే థర్డ్ పార్టీ ఫ్లాట్ ఫాం లేదా థర్డ్ పార్టీ యాప్ ఉండాల్సిందే. అయితే ఆన్ లైన్లో ఇలాంటి యాప్స్ , వెబ్ సైట్స్ బోలెడన్ని ఉన్నాయి. యూట్యూబ్ డౌన్ లోడ్ ప్లగిన్స్ కూడా ఉన్నాయి. వీటితో మీకు నచ్చిన వీడియోను డౌన్ లోడ్ చేసుకుని చూడవచ్చు.

కాగా యూట్యూబ్ కండిషన్స్ ప్రకారం యూట్యూబ్ సొంతంగా డౌన్ లోడ్ లింక్ అందిస్తేనే వీడియోలు డౌన్ లోడ్ చేయకూడదు. అంతేకాదు కాపీ రైట్ చేసిన వీడియోలను డౌన్ లోడ్ చేయడానికి డూప్లికేట్ చేయడానికి యూజర్లకు ఎలాంటి అధికారం ఉండదు. యూట్యూబ్ లో వీడియోలు డౌన్ లోడ్ చేసేటప్పుడు ఇలాంటి విషయాలను పరిగణలోనికి తీసుకోవాలి. మరి ఆండ్రాయిడ్ యూజర్లు యూట్యూబ్ వీడియోను ఎలా డౌన్ లోడ్ చేసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం.

ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్లో యూట్యూబ్ వీడియోలును డౌన్ లోడ్ చేయడానికి , ముందుగా గూగుల్ ప్లేస్టోర్ నుంచి tubemate యాప్ ఇన్ స్టాల్ చేసుకోవాలి. తర్వాత ట్యూబ్ మేట్ యాప్ ఉపయోగించడానికి మీ ప్రైవసీ కంట్రోల్స్ లో సెట్టింగ్స్ ను మార్చుకోవాలి. ఆ తర్వాత ట్యూబ్ మేట్ యాప్ ను ఓపెన్ చేసి…మీకు కావాల్సిన వీడియోను సెర్చ్ చేయాలి. తర్వాత డౌన్ లోడ్ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. రెజల్యూషన్, ఫార్మాట్ మీకు కావాల్సినట్లుగా సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. తర్వాత డౌన్ లోడ్ పై క్లిక్ చేయాలి. ఇప్పుడు మీ స్మార్ట్ ఫోన్లోకి వీడియో డౌన్ లోడ్ అవుతుంది. ఇప్పుడు డౌన్ లోడ్ లిస్ట్ క్లిక్ చేసిన వీడియోను లొకేట్ చేసుకోవచ్చు.

ఇక ఐఫోన్ లేదా ఐప్యాడ్ లో అయితే  Readdle Documentsయాప్ ద్వారా ఇన్ స్టాల్ చేయాలి. ఆ తర్వాత బ్రౌజర్ ఒపెన్ చేసి…www.videosolo.com/online-video-downloader/ లింక్ కు వెళ్లాలి. యూట్యూబ్ వీడియోను urlకాపీ చేసి పేస్ట్ చేయాలి. ఇప్పుడు డౌన్ లోడ్ పై క్లిక్ చేయాలి. వీడియో వేరువేరు ఫార్మాట్స్ లో అందుబాటులో ఉంటుంది. తర్వాత రీడెబుల్ డాక్యుమెంట్స్  యాప్స్ లో మీరు డౌన్ లోడ్ చేసిన యూట్యూబ్ వీడియోలు కనిపిస్తుంటాయి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • technology
  • youtube

Related News

National Conference Under The Auspices Of The Central Election Commission Tomorrow

27 ఏళ్ల తర్వాత రేపే తొలిసారి .. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జాతీయ సదస్సు

గమనించదగిన విషయం ఏమిటంటే ఇలాంటి జాతీయ స్థాయి సమావేశం 27 సంవత్సరాల తర్వాత రాబోతున్నది. చివరిసారిగా ఈ సమావేశం 1999లో జరిగింది.

  • Google IO 2026

    గూగుల్ ఈవెంట్‌.. ముఖ్య‌మైన తేదీలు ఇవే!

  • Youtube

    ఫిర్యాదులు రావడంతో సమస్యను పరిష్కరించామన్న యూట్యూబ్

  • Youtube Down

    Youtube డౌన్..షాక్ లో యూజర్స్

Latest News

  • ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి!

  • భారత రక్షణ రంగంలో కొత్త శకం.. ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ సాంకేతికత భారత్ సొంతం కానుందా?

  • వైభవంగా విరోష్‌ వివాహం.. ఉదయపూర్‌లో అడుగుపెట్టిన విజయ్ దేవరకొండ – రష్మిక!

  • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

  • టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

Trending News

    • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

    • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు!

    • సౌతాఫ్రికాతో మ్యాచ్‌.. బుమ్రా స‌రికొత్త రికార్డు!

    • టీ20 వరల్డ్ కప్ 2026.. సెమీఫైనల్, ఫైనల్ వేదికలపై ఇంకా వీడని సందిగ్ధత!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd