Lava Yuva 4: తక్కువ ధరకే 50 ఎంపీ కెమెరాతో కంటున్నా లావా స్మార్ట్ ఫోన్.. పూర్తి వివరాలు ఇవే!
తాజాగా మార్కెట్లోకి విడుదల అయిన లావా స్మార్ట్ ఫోన్ అది తక్కువ ధరకే అద్భుతమైన కెమెరా ఫీచర్ లతో ఆకట్టుకుంటుంది.
- By Anshu Published Date - 12:00 PM, Sat - 30 November 24

ఇటీవల కాలంలో మార్కెట్లోకి ఎక్కువ శాతం బడ్జెట్ స్మార్ట్ ఫోన్లు విడుదలవుతున్న విషయం తెలిసిందే. వినియోగదారులు కూడా ఎక్కువ శాతం మంది బడ్జెట్ స్మార్ట్ ఫోన్ల పైనే ఆసక్తిని చూపిస్తున్నారు. దీంతో ఈ మధ్యకాలంలో ఇలాంటి స్మార్ట్ ఫోన్లే మార్కెట్లోకి ఎక్కువగా విడుదల అవుతున్నాయి. అందులో భాగంగానే తాజాగా మరో స్మార్ట్ ఫోన్ మార్కెట్లోకి విడుదల అయింది. అందుకు సంబంధించిన వివరాల్లోకి వెళితే..
భారత్‌కు చెందిన ఈ ఎలక్ట్రానిక్ దిగ్గజం తాజాగా ఇండియన్ మార్కెట్లోకి లావా యువ 4 పేరుతో కొత్త ఫోన్‌ను తీసుకొచ్చింది. తక్కువ ధరకే కళ్లు చెదిరే ఫీచర్లతో ఈ ఫోన్ ను తీసుకొచ్చారు. ఈ ఫోన్ లో ఏడాది వారంటీ, ఫ్రీ హోం సర్వీసింగ్ ఇవ్వడం విశేషం. కాగా లావా యువ 4 ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.56 ఇంచెస్ తో కూడిన హెచ్‌డీ+ స్క్రీన్ ను అందించారు. ఆండ్రాయిడ్ 14 ఔటాఫ్ బాక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ తో పనిచేసే ఈ ఫోన్ లో యూనిసోక్ టీ606 ఎస్వోసీ ప్రాసెసర్ ను కూడా ఇచ్చారు. ఇకపోతే ఈ ఫోన్ కెమెరా విషయానికొస్తే.. ఈ స్మార్ట్ ఫోన్ లో 50 మెగా పిక్సెల్స్ తో కూడిన ప్రైమరీ కెమెరాను అందించారు.
అలాగే సెల్పీలు, వీడియో కాల్స్ కోసం ఇందులో 8 మెగా పిక్సెల్స్ ఫ్రంట్ కెమెరాను కూడా ఇచ్చారు. ఇక లావా యువ4 స్మార్ట్ ఫోన్ లో 10 వాట్స్ వైర్డ్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేసే 5000 ఎంఏహెచ్ కెపాసిటీ గల బ్యాటరీని అందించారు. సెక్యూరిటీ కోసం ఇందులో సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ ను కూడా ఇచ్చారు. ఇకపోతే ధర విషయానికొస్తే.. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 6,999 కాగా, 4 జీబీ ర్యామ, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 7,499గా ఉంది. అలాగే ఈ స్మార్ట్ ఫోన్‌ను గ్లాసీ బ్లాక్, గ్లాసీ పర్పుల్, గ్లాసీ వైట్ కలర్ ఆప్షన్లలో అందుబాటులోకి తీసుకువచ్చింది లావా సంస్థ.