Earth Speed : అప్పటికల్లా మనకు రోజుకు 25 గంటలు..!!
భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడి చుట్టూ తిరగడాన్ని భూపరిభ్రమణం అంటారు.
- By Pasha Published Date - 04:53 PM, Sun - 21 July 24

Earth Speed : భూమి తన చుట్టూ తాను తిరగడాన్ని భూభ్రమణం అంటారు. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ, సూర్యుడి చుట్టూ తిరగడాన్ని భూపరిభ్రమణం అంటారు. గత కొంత కాలంగా భూపరిభ్రమణ వేగం తగ్గుతోందని శాస్త్రవేత్తలు అంటున్నారు. దీనివల్ల రోజు పరిమాణం ప్రతి వందేళ్లకు 1.8 సెకన్లు చొప్పున పెరుగుతోందని చెబుతున్నారు. ఇది ఇలాగే కొనసాగితే 2100 సంవత్సరం నాటికి రోజుకు మరో 2.2 మిల్లీసెకన్ల సమయం పెరుగుతుందని సైంటిస్టులు అంచనా వేస్తున్నారు. భూపరిభ్రమణ వేగం తగ్గుతున్నందు వల్ల ఆనాటికి ఒక రోజులో దాదాపు 25గంటల సమయం ఉంటుందని లెక్కలు కడుతున్నారు. 140 కోట్ల సంవత్సరాల క్రితం ఒక రోజులో 19 గంటలు ఉండేవని.. భూపరిభ్రమణ వేగం(Earth Rotation Speed) వల్లే రోజులో గంటల సంఖ్య పెరిగి 24కు చేరిందని విశ్లేషిస్తున్నారు.
We’re now on WhatsApp. Click to Join
భూమి భ్రమణ వేగం తగ్గిపోవడం(Earth Speed) వల్ల ఒకరోజులో ఉండే సమయం కొంతమేర పెరుగుతుంది. దీనివల్ల మనం పెద్దగా తేడాను ఫీల్ కాలేం. కానీ ఇదే పరిస్థితి సుదీర్ఘ కాలం పాటు కొనసాగితే మాత్రం.. మన భావితరాల రోజువారీ గంటలు మారిపోతాయి. వాళ్లకు 25 గంటల గడియారం అవసరమవుతుంది. 2010లో చిలీలో సంభవించిన భారీ భూకంపం వల్ల భూమి భ్రమణ వేగం తగ్గిందని కొందరు సైంటిస్టులు అంటున్నారు. నాటి భూకంపం వల్ల భూమి తిరిగే వేగం రోజుకు సగటున 1.26 మైక్రో సెకన్లు తగ్గిందని చెబుతున్నారు.
Also Read :Olympic Games : ఒలింపిక్స్‌కు లక్షల కోట్ల అప్పులు.. ఆతిథ్య దేశాలకు లాభమా ? నష్టమా?
భూమి తిరిగే వేగం తగ్గడానికి ముఖ్య కారణాలు..
- భూమిపై ఉన్న ధ్రువాల వద్ద మంచు కరగడం.
- భూమికి మూడు పొరలు ఉన్నాయి. పై పొరను క్రస్ట్ అంటారు. దీనిపైనే మనం ఉన్నాం. దీని తర్వాత ఒక పొర ఉంటుంది. మూడో పొరను కోర్ అంటారు. ఇప్పుడు కోర్ పొర భ్రమణం మందగిస్తున్నది.
- భూమి లోపలి కోర్, భూఉపరితలం కంటే చాలా నెమ్మదిగా తిరుగుతోంది.