HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Technology
  • >Irish Regulators Fine Instagram 405 Million Euros For Data Breach

Instagram : ఇన్‌స్టాగ్రామ్‌ పై ఐర్లాండ్‌ కొరడా.. రూ.3200 కోట్ల భారీ జరిమానా!!

ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్‌ కు భారీ షాక్ తగిలింది. ఆ సంస్థపై ఐర్లాండ్‌ కొరడా ఝుళిపించింది.

  • By Hashtag U Published Date - 07:45 AM, Wed - 7 September 22
  • daily-hunt
Most Popular App
Instagram

ప్రముఖ సోషల్‌ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్‌ కు భారీ షాక్ తగిలింది. ఆ సంస్థపై ఐర్లాండ్‌ కొరడా ఝుళిపించింది. ఇన్‌ స్టాగ్రామ్‌ పై ఏకంగా రూ.3200 కోట్ల భారీ జరిమానా విధించింది. ప్రధానంగా పిల్లల డేటా నిర్వహణలో అవకతవకలపై విచారణ జరిపిన తర్వాత ఐర్లాండ్‌ దేశ రెగ్యులేటరీ ఈమేరకు చర్యలు చేపట్టింది. గత శుక్రవారం రెగ్యులేటరీ ఈ నిర్ణయం తీసుకుందని ఐర్లాండ్‌ డేటా ప్రొటెక్షన్‌ కమిషనర్‌ ప్రతినిధి వెల్లడించారు. ఈ నిర్ణయానికి సంబంధించిన పూర్తి వివరాలు వచ్చే వారంలో వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. అయితే, భారీ జరిమానా విధింపుపై ఇన్‌స్టాగ్రామ్‌ అప్పీల్‌ చేయాలని యోచిస్తోంది. ఇన్‌స్టాగ్రామ్ ఏడాది క్రితం తన సెట్టింగ్స్‌ను అప్‌డేట్ చేసిందని, టీనేజర్లను సురక్షితంగా వారి సమాచారాన్ని ప్రైవేట్‌గా ఉంచడానికి కొత్త ఫీచర్‌లను విడుదల చేసిందని మెటా ప్రతినిధి తెలిపారు. ఇన్‌స్టాగ్రామ్‌ ప్రస్తుతం మెటా ఆధ్వర్యంలో కొనసాగుతున్న విషయం తెలిసిందే.

యూజర్ల డేటా ట్రాక్ చేస్తోందా ?

ఫొటో/వీడియో షేరింగ్‌ కోసం ఎక్కువ మంది ఇన్‌స్టాగ్రామ్‌ యాప్‌ను ఉపయోగిస్తుంటారు. ఐఓఎస్‌లో ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌ యూజర్ల డేటాను మెటా సంస్థ ట్రాక్ చేస్తున్నట్లు ఫెలిక్స్‌ క్రాస్‌ అనే సైబర్‌ సెక్యూరిటీ నిపుణుడు ఇటీవల వెల్లడించాడు. ఇన్‌స్టాగ్రామ్‌ లేదా ఫేస్‌బుక్‌ యాప్‌ నుంచి ఏదైనా యూఆర్‌ఎల్‌ లింక్‌ ఓపెన్‌ చేసినప్పుడు మెటా సంస్థ యూజర్‌ డేటాను ట్రాక్‌ చేస్తున్నట్లు గుర్తించామని ఫెలిక్స్‌ తన బ్లాగ్‌తో పేర్కొన్నారు. పాస్‌వర్డ్‌‌, క్రెడిట్‌ కార్డ్ వంటి వాటికి సంబంధించిన ముఖ్యమైన సమాచారాన్ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా సేకరిస్తున్నారని తెలిపారు.  ఐఓఎస్‌ యూజర్లలో ఎక్కువ మంది డీఫాల్ట్‌ బ్రౌజర్‌గా సఫారీని ఉపయోగిస్తుంటారు. ఏదైనా యూఆర్‌ఎల్‌ లింక్‌పై క్లిక్ చేస్తే అది సఫారీ బ్రౌజర్‌లో ఓపెన్ అవుతుంది. ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లు మాత్రం సఫారీ కాకుండా తమ సొంత బ్రౌజర్‌ను ఉపయోగిస్తున్నట్లు సైబర్‌ సెక్యూరిటీ సంస్థలు తెలిపాయి. ఇందులో మెటా పిక్సెల్‌ అనే కోడ్‌ సాయంతో ఇన్‌స్టాగ్రామ్‌, ఫేస్‌బుక్‌లో యూజర్ల ప్రతి కదలికను మెటా సంస్థ ట్రాక్‌ చేస్తోందని ఆరోపిస్తున్నాయి.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • instagram
  • Instagram update

Related News

Nepal government backs down, lifts ban on social media

Nepal: వెనక్కి తగ్గిన నేపాల్‌ ప్రభుత్వం .. సోషల్ మీడియాపై నిషేధం ఎత్తివేత

నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలీ అధ్యక్షతన సోమవారం రాత్రి అత్యవసర క్యాబినెట్ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం సమాచార, ప్రసారశాఖ మంత్రి పృథ్వీ సుబా గురుంగ్ మీడియాతో మాట్లాడుతూ..ప్రజల్లో అసంతృప్తిని గమనించి, పరిస్థితిని సమీక్షించిన తర్వాత సామాజిక మాధ్యమాలపై విధించిన నిషేధాన్ని ప్రభుత్వం అధికారికంగా ఎత్తివేస్తోంది. ఇకపై అన్ని ప్లాట్‌ఫామ్లు సాధారణంగా పనిచేస్తాయి అని తెల

    Latest News

    • Cash Withdrawals: గుడ్ న్యూస్‌.. యూపీఐ ద్వారా డ‌బ్బు విత్‌డ్రా..!

    • Panchmukhi Hanuman Ji: మంగ‌ళ‌వారం రోజు పంచముఖ ఆంజనేయ స్వామి పూజ చేయండిలా!

    • Peter Navarro: భారత్-అమెరికా వాణిజ్య వివాదంపై ట్రంప్ సలహాదారు సంచలన వ్యాఖ్యలు!

    • AP Liquor Case: ఏపీ లిక్కర్ కేసులో సిట్ మెమో.. ఏసీబీ కోర్టులో విచారణకు రంగం సిద్ధం

    • Trump Tariff Impact: అమెరికా టారిఫ్‌లతో ఆంధ్రప్రదేశ్ రొయ్యల ఎగుమతులపై భారీ దెబ్బ!

    Trending News

      • Little Hearts Box Office: సూపర్ హిట్ మూవీగా లిటిల్ హార్ట్స్.. 8 రోజుల్లో భారీగా వసూళ్లు!

      • Fine For Late: ఈరోజే లాస్ట్ డేట్‌.. మిస్ అయితే రూ. 5 వేలు ఫైన్‌!

      • Maoist Sujatha: ఆమె లొంగుబాటుతో మావోయిస్టులకు భారీ ఎదురుదెబ్బ త‌గ‌ల‌నుందా??

      • 8th Pay Commission: దీపావళికి ముందే భారీ శుభ‌వార్త‌.. ఏంటంటే?

      • Vahanamitra: వాహనమిత్రకు ఎవరు అర్హులు? ఎవ‌రు అన‌ర్హులు??

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd