HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Iphone Users May Be Able To Type In The Rain Underwater New Apple Patent Suggests

iPhone : ఇకపై వానలోనూ ఐఫోన్ లో ఫాస్ట్ టైపింగ్ చేయొచ్చు !!

ఐఫోన్ వినియోగదారులకు మరో కొత్త సౌకర్యం రాబోతోంది. వర్షంలోనూ నిలబడి ఐఫోన్ లో ఎంచక్కా టైప్ చేయగలిగేలా.. ఫోన్ కీ బోర్డు, స్క్రీన్, సాఫ్ట్ వేర్ లో యాపిల్ మార్పు చేయబోతోంది.

  • Author : Hashtag U Date : 06-07-2022 - 3:56 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
iphone se
iphone se

ఐఫోన్ వినియోగదారులకు మరో కొత్త సౌకర్యం రాబోతోంది. వర్షంలోనూ నిలబడి ఐఫోన్ లో ఎంచక్కా టైప్ చేయగలిగేలా.. ఫోన్ కీ బోర్డు, స్క్రీన్, సాఫ్ట్ వేర్ లో యాపిల్ మార్పు చేయబోతోంది. దీనికి సంబంధించిన పేటెంట్ల కోసం 2021 మార్చిలోనే యాపిల్ కంపెనీ దరఖాస్తు చేసుకుంది. నాటి నుంచే దీనికి సంబంధించిన టెక్నాలజీ అభివృద్ధి ప్రక్రియ మొదలైంది. ఐఫోన్ మోడళ్లన్నీ వాటర్ రెసిస్టెంట్ గా తయారైనవే. అయితే వర్షం పడుతుండగా.. ఐఫోన్ లో టైపింగ్ చేయడం కష్టతరంగా ఉంటుంది. ఈ సమస్యను అధిగమించేలా సాఫ్ట్ వేర్ ను కీబోర్డ్ లో పొందుపర్చే అవకాశం ఉంది. కీబోర్డ్ లోని అక్షరాలపై ఎక్కడైతే ఒత్తిడి ఏర్పడుతుందో అక్కడ మాత్రమే అక్షరం టైప్ అయ్యేలా చేయడమే కొత్త టెక్నాలజీ ప్రత్యేకత. నీళ్ల లోపల, వాన పడుతున్నప్పుడు కూడా ఐఫోన్ లో అదిరిపోయేలా టైపింగ్ చేయగలగడం ఫ్యూచర్ ఫీచర్ స్పెషాలిటీ. ఇందుకోసం యాపిల్ కంపెనీ రిసెర్చర్స్ వింగ్ ముమ్మర పరిశోధనలు చేస్తోంది. త్వరలో మార్కెట్లోకి విడుదల కానున్న ఐఫోన్ 12, 13 మోడల్స్ కు వాటర్ రెసిస్టెన్సీ ఉంది. గత మోడళ్ల కంటే ఇవి వాటర్ రెసిస్టెన్సీ చాలా మెరుగ్గా ఉంటాయని అంటున్నారు.

10 నెలల క్రితం నదిలో పడిపోయిన ఐఫోన్ కూడా..

నీళ్లలో ఫోన్ పడితే అసలు పనికిరాకుండా పోతుంది. కానీ, యాపిల్ ఐఫోన్ మాత్రం అలా కాదు.. దాదాపు 10 నెలల క్రితం నదిలో పడిపోయిన ఐఫోన్ ఇప్పుడు అదే వ్యక్తికి తిరిగి దొరికింది. ఇప్పటికీ గుడ్ కండీషన్‌లో ఉంది. ఈ ఘటన యూకేలో వెలుగు చూసింది. ఇటీవలి ఏళ్లల్లో లాంచ్ అయిన అన్ని ఐఫోన్‌లు దాదాపు IP68 రేట్ తోనే వస్తున్నాయి. ఈ ఐఫోన్లలో 1.5 మీటర్ల నీటిని కూడా 30 నిమిషాల పాటు లోపలికి వెళ్లకుండా కంట్రోల్ చేయగలవు. అయితే ఇలా అన్ని సార్లు జరగదని గుర్తించాలి.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Apple Iphone
  • iPhone

Related News

Good news for Apple users... Here are the brand-new features of the 18 Pro and 18 Pro Max!

iPhone 18 Pro: యాపిల్ యూజర్స్‌కు గుడ్‌న్యూస్..18 ప్రో, 18 ప్రో మ్యాక్స్.. సరికొత్త ఫీచర్లు ఇవే..!

యాపిల్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తున్న సరికొత్త స్మార్ట్‌ఫోన్ సిరీస్ ‘iPhone 18’ మార్కెట్లోకి రావడానికి సమయం ఆసన్నమైంది. మరో రెండు నెలల్లో, అంటే ఈ ఏడాది సెప్టెంబర్ నెలలో యాపిల్ సంస్థ తన అత్యంత ప్రతిష్టాత్మకమైన iPhone 18 Pro మరియు iPhone 18 Pro Max మోడళ్లను ప్రపంచవ్యాప్తంగా అధికారికంగా విడుదల చేయబోతోంది. ఈ సారి లాంచ్‌లో అత్యంత ప్రత్యేకమైన ఆకర్షణ ఏమిటంటే.. యాపిల్ చరిత్రలోనే మొట్టమొదటిసారిగ

    Latest News

    • Anurag Dhankar: పోలీసు ప్రధాన కార్యాలయంలో త్రిపుర డీజీపీ అనురాగ్ ధంకర్ మృతి

    • Rohit Sharma: రిటైర్మెంట్ పై మౌనం వీడిన రోహిత్ శర్మ: ‘నేను వెళ్ళిపోవడం లేదు…

    • Poonam Pandey: నిరసనలో పాల్గొనేందుకు జంతర్ మంతర్ చేరుకున్న పూనమ్ పాండే

    • Guntur woman case: గుంటూరులో మహిళను వివస్త్ర కేసులో 9 మంది అరెస్ట్

    • Char Dham Yatra: ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలు ముంచెత్తడంతో చార్ ధామ్ యాత్ర తాత్కాలికంగా నిలిపివేత

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd