Whatsapp Update: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఆ ఫీచర్ తో ఇప్పుడు మరింత సులభం!
ప్రముఖ మెసెజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న సోషల్ మీడియా యాప్స్ లో వాట్సాప్ కూడా ఒకటి.
- By Anshu Published Date - 12:00 PM, Fri - 19 July 24

ప్రముఖ మెసెజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఎక్కువ మంది ఉపయోగిస్తున్న సోషల్ మీడియా యాప్స్ లో వాట్సాప్ కూడా ఒకటి. ఈ వాట్సాప్ సంస్థ ఇప్పటికే వినియోగదారుల కోసం ఎన్నో రకాల ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువస్తూనే ఉంది. ఈ మధ్య కాలంలో మరింత జోరుగా వాట్సాప్ వరుసగా ఒకదాని తరువాత ఒకటి అప్డేట్ లను విడుదల చేస్తూనే ఉంది.
అందులో భాగంగానే తాజాగా వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని తీసుకువచ్చింది వాట్సాప్. కాగా తాజాగా వాట్సాప్ అత్యంత ముఖ్యమైన వ్యక్తులతో సన్నిహితంగా ఉండడాన్ని సులభతరం చేసేలా కొత్త ఫీచర్ రిలీజ్ చేస్తుందని పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. తరచూ చాట్ చేసే వారికి ప్రాధాన్యత ఇచ్చే ఫేవరేట్స్ ఫీచర్‌ను లాంచ్ చేస్తోంది. మరి ఫేవరెట్ ఫీచర్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది అన్న విషయానికి వస్తే.. ఫేవరేట్స్ ఫీచర్ వాట్సాప్ లో తరచుగా సంప్రదించే వ్యక్తులు, సమూహాల వ్యక్తిగతీకరించిన జాబితాను రూపొందించడానికి వినియోగదారులను అనుమతిస్తుంది. ఈ జాబితా కాల్ ల ట్యాబ్ ఎగువన సులభంగా యాక్సెస్ చేయవచ్చు.
మీకు ఇష్టమైన కాంటాక్ట్స్ తో కాల్స్ ను ప్రారంభించడం సులభం అవుతుంది. అదనంగా ఫేవరేట్స్ ఫీచర్ మీ చాట్ జాబితా కోసం ఫిల్టర్‌గా ఉపయోగించవచ్చు. మీరు ఎక్కువగా చాట్ చేసే వ్యక్తుల చాట్ లను త్వరగా వెతకడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది. ఫేవరేట్స్ ఫీచర్ కాల్స్, చాట్‌లు రెండింటిలో కూడా సజావుగా ఏకీకృతం చేశారు. కాగా మీ చాట్ లిస్ట్‌లోని ఫేవరేట్స్ ఫిల్టర్ కు నావిగేట్ చేయవచ్చు. అనంతరం కావాల్సిన కాంటాక్ట్స్ లేదా గ్రూప్స్‌ను ఎంచుకోవాలి. కాల్స్ ట్యాబ్ నుంచి యాడ్ ఫేవరేట్స్ అనే ఎంపికను ఎంచుకోవచ్చు. అనంతరం మీరు కాల్ ల కోసం సులభంగా యాక్సెస్ చేయాలనుకుంటున్న కాంటాక్ట్స్ లేదా గ్రూప్స్ ను ఎంచుకోవాలి. ఫేవరేట్స్ ఆప్షన్ ను సెట్టింగ్‌ల ద్వారా ఎంచుకోవాలంటే సెట్టింగ్స్ లోకి వెళ్లి అక్కడ ఫేవరేట్స్ అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. అనంతరం కాంటాక్ట్స్, గ్రూప్స్ ను యాడ్ చేయడమే కాకుండా తరచుగా కనెక్ట్ అయ్యే వ్యక్తులకు ప్రాధాన్యత ఇవ్వడానికి మీ ఇష్టమైన జాబితాను కూడా మార్చవచ్చు.