Instagram: ఇంస్టా యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఇకపై నచ్చిన విధంగా ఏఐ క్యారెక్టర్లు సృష్టించే అవకాశం?
ఇంస్టాగ్రామ్ యూజర్ల కోసం ఏ ఐ స్టూడియో అనే కొత్త టూల్ ని విడుదల చేసిన ఇంస్టాగ్రామ్ సంస్థ.
- By Anshu Published Date - 11:00 AM, Wed - 31 July 24

ప్రస్తుత రోజుల్లో చాలామంది వినియోగిస్తున్న సోషల్ మీడియా యాప్స్ లో ఇంస్టాగ్రామ్ కూడా ఒకటి. ఇటీవల కాలంలో ఇంస్టాగ్రామ్ వాడకం కూడా విపరీతంగా పెరిగిపోయింది. దాంతో వినియోగదారుల సంఖ్యను మరింత పెంచుకోవడం కోసం ఇంస్టాగ్రామ్ సంస్థ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. అందులో కానీ తాజాగా మరోసారి కొత్త ఫీచర్ ని తీసుకు వచ్చింది. మరి ఆ సరి కొత్త ఫీచర్ ఏంటి? అది ఎలా ఉపయోగపడుతుంది అన్న వివరాల్లోకి వెళితే.. వినియోగదారులు కస్టమైజ్డ్ ఏఐ చాట్ బాట్ లను అభివృద్ధి చేయడానికి, డిజైన్ చేయడానికి వీలుగా ఏఐ స్టూడియో అనే కొత్త టూల్ ను విడుదల చేయనుందట.
ఈ కొత్త ఏఐ టూల్ తో ఇన్ స్టా యూజర్లు, కంటెంట్ క్రియేటర్లు తమకు నచ్చిన ఏఐ క్యారెక్టర్లను సృష్టించుకోవచ్చు. వాటిని ఇంటరాక్టివ్ గా తమ పేజ్ లో ఉపయోగించుకోవచ్చట. ఏఐ క్యారెక్టర్లను ఉపయోగించి మెటా ప్లాట్ ఫామ్స్ లో క్రియేటర్లు చాలా చేయవచ్చట. వారి సొంత కస్టమైజ్డ్ ఏఐ క్యారెక్టర్లను సృష్టించడంతో పాటు, ఆ ఏఐ క్యారెక్టర్లతో ఇంటరాక్టివ్ సెషన్స్ ను నిర్వహించవచ్చట. ఫాలోవర్ల సాధారణ ప్రశ్నలకు జవాబులు ఇవ్వవచ్చట. ఏఐ మెటా స్టూడియో ద్వారా మీ ప్రతినిధిగా ఇన్ స్టాలో ఈ ఏఐ క్యారెక్టర్లను అభివృద్ధి చేయవచ్చని చెబుతున్నారు.
మెటా యాజమాన్యంలోని వివిధ సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ లలో వినియోగదారులు తమ కస్టమైజ్డ్ ఏఐ క్యారెక్టర్లను పంచుకోవచ్చట. అయితే ఈ ఈ టూల్ ను మెటా లామా 3.1 ను ఉపయోగించి అభివృద్ధి చేశారు. ఇది ఎక్కువగా ఉచిత కృత్రిమ మేధస్సు మోడళ్ల ను అందిస్తుంది. గత వారం లాంచ్ అయిన మెటా లామా 3.1 ను వివిధ భాషల్లో యాక్సెస్ చేయవచ్చు. ఇది ఓపెన్ఎఐ వంటి పోటీదారులు విడుదల చేసిన పెయిడ్ మోడళ్లకు గట్టి పోటీ ఇస్తుంది.