I Phone : మనిషి ప్రాణాలు కాపాడిన ఐ ఫోన్.. యాక్సిడెంట్ అయిన వెంటనే టెక్నాలజీ సాయంతో ..
లాస్ ఏంజెల్స్ ( Los Angeles ) సమీపంలో మౌంట్ విల్సన్ ప్రాంతంలోని 400 అడుగుల లోతైన లోయలో కారుతో సహా ఓ వ్యక్తి పడిపోయాడు. అదృష్టవశాత్తూ అతని ఐఫోన్ 14 లోని రెండు ముఖ్యమైన ఫీచర్లు అతని రక్షించాయి.
- By News Desk Published Date - 10:15 PM, Fri - 28 July 23

ఆధునిక సాంకేతికత ఎన్నో పనులను సులభతరం చేసేసింది. ఒక్కోసారి ఇది ప్రాణాలు కూడా నిలబెడుతుంది. తాజాగా ఓ వ్యక్తి ఐ ఫోన్ (iphone)లోని ఓ ఫీచర్ కారణంగా ఘోర ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడ్డాడు. లోయ మీదుగా దూసుకుపోతున్న కారు ప్రమాదవశాత్తూ 400 అడుగుల లోతున్న లోయలో పడింది. అయితే ఆపిల్ ఐఫోన్ 14 కారులో వ్యక్తిని ప్రాణాలతో కాపాడింది.
లాస్ ఏంజెల్స్ ( Los Angeles ) సమీపంలో మౌంట్ విల్సన్ ప్రాంతంలోని 400 అడుగుల లోతైన లోయలో కారుతో సహా ఓ వ్యక్తి పడిపోయాడు. అదృష్టవశాత్తూ అతని ఐఫోన్ 14 లోని రెండు ముఖ్యమైన ఫీచర్లు అతని రక్షించాయి. శాటిలైట్ ద్వారా క్రాష్ డిటెక్షన్(Crash Detection), ఎమర్జెన్సీ SOS (Emergency SOS)ఫీచర్లు యాక్టివేట్ అయి.. ఎలా అతన్ని రక్షించాయో స్థానిక పోలీసులు ట్విట్టర్లో తెలిపారు.
యాక్సిడెంట్ జరిగిన వెంటనే అతని ఐఫోన్ ఆటోమేటిక్‌గా ఘోర ప్రమాదం జరిగిందని గ్రహించింది. యాపిల్ వాచ్, ఐఫోన్‌లలోని SOS ఫీచర్ దాని యజమాని ఆపదలో ఉంటే ఆటోమేటిక్‌గా ఎమర్జెన్సీ విభాగానికి లేదా కంట్రోల్ రూమ్‌కి సమాచారం ఇస్తుంది. ఇక్కడ కూడా అదే జరిగింది. అలాగే ఐఫోన్ శాటిలైట్ కనెక్షన్‌ని ఉపయోగించి అత్యవసర రిలే సెంటర్‌కు కూడా ఓ మెసేజ్ పంపింది. కారు క్రాష్ అయిన ప్రదేశంలో నెట్వర్క్ కవరేజీ లేదు. కానీ, శాటిలైట్ కనెక్షన్ సాయంతో సమాచారం అందించింది. టెక్స్ట్ మెసేజ్ ప్రమాదం జరిగిన కచ్చితమైన లొకేషన్ ను కూడా తెలిపింది. దీని సాయంతో రెస్క్యూ టీం లోయలో ఉన్న వ్యక్తిని అతి త్వరగా గుర్తించారు. పర్వత ప్రాంతాల్లోని రహదారులపై జరిగిన ప్రమాదాల్లో బాధితులను సకాలంలో గుర్తించడం అసాధ్యమని, కానీ, ఈ ఘటనలో ఐఫోన్ అతడ్ని రక్షించిందన్నారు స్థానిక పోలీసులు.
సెప్టెంబర్ 2022లో యాపిల్ శాటిలైట్, క్రాష్ డిటెక్షన్ ఫీచర్‌ను ప్రవేశపెట్టింది. ఈ ఫీచర్ కారణంగా గతంలోనూ పలువురు ప్రమాదాల నుంచి ప్రాణాలతో బయటపడిన సంఘటనలు ఉన్నాయి.
సంవత్సరం క్రితం స్విట్జర్లాండ్‌లోని జెర్మాట్ సమీపంలో ఓ సైనికుడు మంచు కొండపై స్నో బోర్డింగ్ చేస్తూ సుమారు పది వేల అడుగుల కిందకు పడిపోయాడు. అప్పుడు కూడా అతని ఐఫోన్‌లోని ఫీచర్ సాయంతో పోలీసులు అలర్ట్ అయ్యారు. సాంప్రదాయిక కమ్యూనికేషన్ పద్ధతులు అందుబాటులో లేనప్పుడు, క్లిష్టమైన పరిస్థితుల్లో ఇలాంటి ఫీచర్లు జీవితాలను కాపాడగలవు.
RESCUE: At 10:51pm on Fri we were alerted to a car 400’ over a cliff by the driver’s iPhone 14 crash detection. Location was Mt Wilson Rd. After locating him we guided in an @LACoFireAirOps copter. Suffered head trauma. @LASDHQ @CVLASD @KCBSKCALDesk @NBCLA @ABC7 @FOXLA @cnnbrk pic.twitter.com/jXdpuDL7Hk
— Mike Leum (@Resqman) July 22, 2023
Also Read : Amazon Great Freedom Festival Sale : ఆఫర్లు మాములుగా లేవు