WhatsApp: వాట్సాప్ యూజర్స్ కి గుడ్ న్యూస్.. ఈ చిన్న ట్రిక్ తో మెసేజ్ షెడ్యూల్ చాలా ఈజీ!
వాట్సాప్ లో సీక్రెట్ టిప్స్ ని ఉపయోగించి మెసేజ్ ని షెడ్యూల్ ఎలా చేయాలి అన్న విషయాల గురించి తెలిపారు.
- By Anshu Published Date - 02:00 PM, Fri - 18 October 24

ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ ను ప్రస్తుతం మనలో చాలామంది వినియోగిస్తున్నప్పటికీ వాట్సాప్ ని ఎలా వినియోగించాలి అందులో ఉన్న ఫీచర్స్ ఏంటి అన్నది చాలామందికి తెలియదు. వాట్సాప్ లో ఉన్న కొన్ని ఫీచర్స్ మాత్రమే కొంతమందికి తెలుసు. అటువంటి వాటిలో మెసేజ్ షెడ్యూల్ కూడా ఒకటి. చాలామంది ఈ మెసేజ్ షెడ్యూల్ ఎలా చేయాలి అన్న విషయం తెలియక కొన్ని కొన్ని సార్లు ఇబ్బంది పడుతూ ఉంటారు. మనకి ఇష్టమైన వారికి బర్త్డే విషెస్, వెడ్డింగ్ అనివర్సరీ ఇలా చాలా సందర్భాలలో విషెస్ చెప్పాలి అనుకున్నప్పుడు ఈ షెడ్యూల్ మెసేజ్ అన్నది చాలా బాగా ఉపయోగపడుతుంది అన్న విషయం తెలిసిందే.
కొన్ని ఈజీ ట్రిక్స్ ఉపయోగించి మెసేజ్ షెడ్యూల్ చేయవచ్చు అని చెబుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. Hootsuite వంటి థర్డ్ పార్టీ సైట్లు ఇన్‌స్టాగ్రామ్ కోసం పోస్ట్గులను షెడ్యూల్ చేసుకోవచ్చు. వాట్సాప్ లో మెసేజ్‌లను షెడ్యూల్ చేసే వాట్సాప్ నుంచి నేరుగా పోస్ట్‌లను షెడ్యూల్ చేసేందుకు అనుమతించదు. వాట్సాప్‌లో పోస్ట్‌లను సాయపడేందుకు కొన్ని థర్డ్ పార్టీ యాప్‌లు ఉన్నాయి. వాట్సాప్ షెడ్యూలర్, డూ ఇట్ లేటర్, SKEDit, ఇతరులు వంటి థర్డ్ పార్టీ యాప్‌లు వాట్సాప్‌లో టెక్స్ట్, ఫోటోలు, వీడియోల మెసేజ్ షెడ్యూల్ చేసేందుకు యూజర్లకు అనుమతిస్తాయి. మీరు బిజినెస్ కోసం వాట్సాప్ ఉపయోగిస్తుంటే పండుగలు, పుట్టిన రోజుల కోసం శుభాకాంక్షలు పోస్ట్ లను ప్లాన్ చేస్తే మీరు పోస్ట్ లను షెడ్యూల్ చేయవచ్చు. వాట్సాప్ మెసేజ్ షెడ్యూల్ చేయడంలో అనేక యాప్ లు ఉన్నాయి.
గూగుల్ ప్లే స్టోర్, యాప్ స్టోర్ కనుగొనవచ్చు. మీరు SKEDitని ఉపయోగించి వాట్సాప్ ఏదైనా మెసేజ్ ఎలా షెడ్యూల్ చేయవచ్చో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ప్లే స్టోర్ /యాప్ స్టోర్ కి వెళ్లి SKEDit కోసం సెర్చ్ చేసి యాప్‌ను డౌన్‌లోడ్ చేయాలి. తర్వాత ఫేస్‌బుక్ ఉపయోగించి సైన్ అప్ చేయాలి. తర్వాత మీ పేరు, ఈమెయిల్, పాస్ వర్డ్‌ను ఎంటర్ చేయాలి. అకౌంట్ క్రియేట్ పై క్లిక్ చేయాలి. మీ ఈ మెయిల్ లో కోడ్ ను యాడ్ చేసిన ద్వారా మీ ఈ మెయిల్ ఐడీ ని ధృవీకరించాలి. ధృవీకరణ తర్వాత మీరుయాడ్ సర్వీసెస్ పేజీని చూస్తారు. వాట్సాప్ పై క్లిక్ చేయాలి. SKEDit యాక్ససబిలిటీ కోసం ఫోన్ సెట్టింగ్స్‌లో ఫర్మిషన్ ఇవ్వాలి. మీరు మెసేజ్ షెడ్యూల్ చేయాలనుకున్న వాట్సాప్ కాంటాక్టులను సెలెక్ట్ చేసుకోవాలి. అన్ని వివరాలు, తేదీ, సమయం, షెడ్యూల్‌ను యాడ్ చేయాలి. షెడ్యూల్ చేసిన రోజున మీ కాంటాక్టులకు మెసేజ్ పంపుకోవచ్చు. మీరు షెడ్యూల్ చేసిన తేదీలో మెసేజ్ రివ్యూ ఆస్క్ మీ బిఫోర్ సెండింగ్ ని కూడా ప్రారంభించవచ్చట. మెసేజ్ పంపేందుకు అనుమతిని అడగడానికి యాప్ మీకు నోటిఫికేషన్ ను పంపుతుంది. మీరు అవసరమైన విధంగా మెసేజ్‌లను పంపవచ్చు. అలాగే ఎడిట్ చేయవచ్చు లేదా డిలీట్ చేయవచ్చు.