Deleted WhatsApp Chats: డిలీట్ చేసిన వాట్సాప్ చాట్ మళ్లీ వెనక్కు రావాలంటే ఇలా చేయాల్సిందే?
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం కోట్లాదిమంది ఉపయోగిస్తున్న మెసే
- By Nakshatra Published Date - 06:00 PM, Sat - 16 March 24
ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గురించి మనందరికీ తెలిసిందే. దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా నిత్యం కోట్లాదిమంది ఉపయోగిస్తున్న మెసేజింగ్ యాప్స్ లో వాట్సాప్ ముందు వరుసలో ఉంటుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఇక వాట్సాప్ వినియోగదారుల సంఖ్య రోజుకి పెరుగుతూనే ఉండడంతో వినియోగదారులను మరింత ఆకర్షించడం కోసం వాట్సాప్ సంస్థ కూడా ఎప్పటికప్పుడు కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకు వస్తూనే ఉంది. కాగా ఇప్పటికే పదుల సంఖ్యలో కొత్త కొత్త ఫీచర్లను పరిచయం చేసింది వాట్సాప్ సంస్థ.
కాగా కొన్నిసార్లు మనం కొన్ని ముఖ్యమైన వాట్సాప్ చాట్ లను పొరపాటున డిలీట్ చేసి ఆ తర్వాత పశ్చాత్తాప పడుతూ ఉంటాము. మీరు కూడా వాట్సాప్ చాట్ నుండి కొన్ని ముఖ్యమైన సందేశాలను డిలీట్ చేసి, వాటిని తిరిగి పొందడం ఎలా అని ఆలోచిస్తున్నారా? అయితే, డిలీట్ చేసిన వాట్సప్ చాట్ లను కొన్ని సింపుల్ అండ్ ఈజీ ట్రిక్స్ ద్వారా రికవరీ చేసుకోవచ్చు. మరి అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఈ చాట్లను డిలీట్ చేయడానికి ముందు వాట్సాప్ బ్యాకప్ ను ఎనేబుల్ చేయాల్సి ఉంటుంది. వాట్సాప్ బ్యాకప్ ను ముందే ఎనేబుల్ చేసి ఉంటే, డిలీట్ చేసిన వాట్సాప్ సందేశాలను రికవరీ చేయడం సులభం అవుతుంది.
బ్యాకప్ చేసిన వాట్సాప్ డేటాను వాట్సాప్ యాప్ నకు ఇంపోర్ట్ చేస్తే చాలు, డిలీట్ చేసిన వాట్సాప్ మెసేజ్ లు రికవరీ అవుతాయి. దీంతో పాటు గూగుల్ డ్రైవ్ నుంచి వాట్సాప్ మెసేజ్ లను రికవరీ చేసుకోవచ్చు. వాట్సాప్ డేటాతో సహా అన్ని ఫైళ్లను ఏ డివైజ్ నుంచైనా బ్యాకప్ చేయడానికి, యాక్సెస్ చేయడానికి ఇది సురక్షితమైన విధానం. గూగుల్ డ్రైవ్ తో వాట్సాప్ సందేశాలను బ్యాకప్ చేయడానికి ఈ స్టెప్స్ ఫాలో కావాలి. గూగుల్ డ్రైవ్ లో వాట్సాప్ మెసేజ్ లను బ్యాకప్ ఎలా చేయాలి అన్న విషయానికి వస్తే.. ఇందుకోసం మీ వాట్సాప్ యాప్ ను ఓపెన్ చేసి మోర్ ఆప్షన్స్ పై క్లిక్ చేయాలి. సెట్టింగ్స్ లోకి వెళ్లి చాట్స్ ఎంచుకోవాలి. తర్వాత చాట్ బ్యాకప్ ఎంచుకోవాలి. ఆపై బ్యాకప్ టు గూగుల్ డ్రైవ్ క్లిక్ చేయాలి.
మీరు మీ ఫోన్ కోసం బ్యాకప్ ఫ్రీక్వెన్సీని సెటప్ చేయాల్సిన కొత్త పేజీకి రీ డైరెక్ట్ అవుతారు.ఫ్రీక్వెన్సీని సెట్ చేసి, మీ బ్యాకప్ చాట్ హిస్టరీని స్టోర్ చేయాలనుకుంటున్న గూగుల్ ఖాతాను ఎంచుకోవాలి. మీ డివైజ్ కు కనెక్ట్ చేసి ఉన్న గూగుల్ ఖాతా లేనట్లయితే, Add account ఆప్షన్ ను ఎంచుకోవాలి. తర్వాత మీ లాగిన్ వివరాలను నమోదు చేయాలి. ఇప్పుడు బ్యాకప్ ఓవర్ ఎంచుకోవాలి. మీ బ్యాకప్ ల కోసం మీరు ఉపయోగించాలనుకుంటున్న నెట్వర్క్ ఎంచుకోవాలి. వాట్సాప్ చాట్ బ్యాకప్ ప్రారంభమవుతుంది.
Related News
Sonu Sood WhatsApp: యాక్టీవ్ మోడ్ లో సోనూసూద్ వాట్సాప్ అకౌంట్
బాలీవుడ్ నటుడు సోనూసూద్ గత రెండు రోజులుగా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. వాస్తవానికి అతని వాట్సాప్ ఖాతా బ్లాక్ అయింది. దీని కారణంగా సోనూ సమస్యలను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే 61 గంటల తర్వాత అతని వాట్సాప్ ఖాతా మళ్లీ యాక్టివ్గా మారింది.