Instagram: మీరు ఇన్‌స్టా కంటెంట్ క్రియేటరా? అయితే డబ్బులు సంపాదించొచ్చు…!
మీరు ఇన్స్టాగ్రామ్ కోసం కంటెంట్ ను క్రియేట్ చేస్తుంటారా...అయితే మీకో శుభవార్త.
- By Hashtag U Published Date - 04:27 PM, Fri - 28 January 22
మీరు ఇన్స్టాగ్రామ్ కోసం కంటెంట్ ను క్రియేట్ చేస్తుంటారా…అయితే మీకో శుభవార్త. ఇన్స్టాగ్రామ్ లో మీరు ఇక నుంచి డబ్బులు సంపాదించుకునే అవకాశం ఉంటుంది. ఇన్స్టాగ్రామ్ ఇన్ ఫ్ల్యూయెన్సర్లు తమ ఫాలోయర్స్ కోసం ఎక్స్ క్లూజివ్ కంటెంట్ ను రూపొందించవచ్చు. ఫాలోయర్స్ తాము ఫాలో అవుతున్న ఇన్ ఫ్లూయెన్సర్ల నుంచి ప్రత్యేకమైన కంటెంట్ చూసే అవకాశం ఉంటుంది. ఎక్స్ క్లూజీవ్ కంటెంట్ కోసం యూజర్లు సబ్ స్క్రైబ్ చేసుకోవాలి. ఈ ఫీచర్ మొదటిసారిగా అమెరికాలో లాంఛ్ అయ్యింది. దశలవారీగా ఈ ఫీచర్‌ను పరీక్షీస్తోంది ఇన్స్టాగ్రామ్. ఆ తర్వాత ఇతర దేశాల్లోని యూజర్లకు ఈ ఫీచర్ ను అందించే ఆలోచనలో ఉంది. ఈ ఫీచర్ గురించి ఇన్స్టాగ్రామ్ బ్లాగ్ పోస్టులో వివరించింది. ప్రస్తుతం కొందరు క్రియేటర్స్ తో ఈ ఫీచర్ పరీక్షస్తున్నామని..త్వరలోనే ఎక్కువమంది ఇన్ ఫ్లూయెన్సర్లను చేరుస్తామని ఇన్స్టాగ్రామ్ తెలిపింది.
ఇప్పటివరకు కేవలం పదిమంది క్రియేటర్స్ తోనే ఈ ఫీచర్‌ను టెస్ట్ చేస్తోంది. బాస్కెట్ బాల్ ప్లేయర్ సెడోనా ప్రిన్స్, ఒలంపియన్ జొరాన్ చిలీస్, వీరిలో ఉన్నారు. రాబోయే రోజుల్లో ఎక్కువ మంది కంటెంట్ క్రియేటర్స్ కు ఈ ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. కంటెంట్ క్రియేటర్స్, ఇన్ ఫ్లూయెన్సర్లను పాలో అయ్యే యూజర్లు సబ్ స్క్రైబ్ చేసుకుని నెలవారీగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. వారి కోసం క్రియేటర్లు, ఇన్ ఫ్లూయెన్సర్లు ప్రత్యేక కంటెంట్ క్రియేట్ చేస్తుంటారు.
అయితే మనకు నచ్చిన క్రియేటర్స్ నుంచి ఎక్స్ క్లూజివ్ లైవ్స్, స్టోరీలు ప్రత్యేకంగా లభిస్తాయి. సబ్ స్క్రైబర్లకు తమ యూజర్ పేరుతో పర్పుల్ కలర్ బ్యాడ్జ్ లభిస్తుంది. ఈ బ్యాడ్జీ అంటే సదరు క్రియేటర్ కు సబ్ స్క్రైబర్ గా ఉన్నారని అర్థం. సబ్ స్క్రైబ్ చేయడానికి నెలకు 0.99 డాలర్ల నుంచి 99.99 డాలర్ల వరకు చెల్లిస్తారు. భారత కరెన్సీ ప్రకారంగా చూసినట్లయితే రూ. 73 నుంచి 7,400వరకు చెల్లించాలి. ఈ ధరను క్రియేటర్లే నిర్ణయిస్తారు. 2023 వరకు ఈ రెవెన్యూలో ఇన్ స్టాగ్రామ్ వాటా తీసుకోదని ప్రొడక్ట్ కో హెడ్ ఆష్లీ యూకి వెల్లడించారు. క్రియేటర్స్ కోసం మరిన్ని టూల్స్ రూపొందించడానికి ఇంట్రెస్ట్ గా ఉన్నామని ఈ టూల్స్ మరి కొంతమంది క్రియేటర్స్ చేతికి వస్తాయని ఇన్స్టాగ్రామ్ పేరెంట్ కంపెనీ మెటా సీఈఓ మార్క్ జుకర్ బర్గ్ వెల్లడించారు.
Tags
Related News
Instagram Down: మరోసారి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ డౌన్.. ట్విట్టర్లో ఫిర్యాదులు..!
ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ సర్వర్లు డౌన్ (Instagram Down) అయినట్లు సమాచారం వెలుగులోకి వస్తోంది.