Smart Phone Hacks : ఫోన్లో స్టోరేజ్ ఎక్కువైందా…? సింపుల్…ఇలా క్లియర్ చేయండి..!
ఒకప్పుడు స్మార్ట్ ఫోన్ లో 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఉంటే చాలనుకునేవాళ్లం. ఇప్పుడు 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ తో స్మార్ట్ ఫోన్లు చాలామంది కొంటున్నారు.
- By Hashtag U Published Date - 11:00 AM, Sun - 23 January 22
ఒకప్పుడు స్మార్ట్ ఫోన్ లో 3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఉంటే చాలనుకునేవాళ్లం. ఇప్పుడు 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ తో స్మార్ట్ ఫోన్లు చాలామంది కొంటున్నారు. అంతేకాదు కొన్ని స్మార్ట్ ఫోన్ కంపెనీలు అయితే 12జీబీ, 512 జీబీ స్టోరేజ్ తో స్మార్ట్ ఫోన్లను ప్రవేశపెడుతున్నాయి. ఇంత భారీ మొబైల్స్ కాకుండా కనీసం 6జీబీ, 128జీబీ స్మార్ట్ ఫోన్ ప్రస్తుతం ఉన్న అవసరాలకు అనుగుణంగా వాడుకోవచ్చు. అయితే మెమెురీ కార్డుతో స్టోరేజీ ఎక్స్ పాండ్ చేసుకునే అవకాశం ఉంటుంది. అయితే స్మార్ట్ ఫోన్ అప్ గ్రేడ్ చేసినా స్టోరేజీ సరిపోవట్లేదని యూజర్లు ఫిర్యాదు చేస్తుంటారు. దీనికి కారణం స్మార్ట్ ఫోన్లో అవసరంలేని ఫైల్స్ అన్నీ కూడా నిండిపోవడమే.
ఇక స్మార్ట్ ఫోన్ స్టోరేజీ నిండిపోవడం స్మార్ట్ ఫోన్ యూజర్ కు పెద్ద సమస్యే. ఈ మధ్య కాలంలో ఎక్కువగా యాప్స్ ఉపయోగిస్తున్నారు. ఎక్కువ యాప్స్ ఉన్నట్లయితే స్టోరేజ్ కూడా ఫుల్ అవుతుంది. ఈ యాప్స్ డిలీట్ చేసినా కొన్ని ఫైల్స్ అలాగే ఉండిపోతాయి. అవసరం లేని యూప్స్ కూడా ఫోన్లో ఉంటాయి. ఫోటోలు, వీడియోలతోపాటుగా స్టోరేజ్ కూడా నిండిపోతుంది. ఆ సమయంలో స్టోరేజ్ క్లియర్ చేయడం అవసరం. మరి స్టోరేజీని ఎలా క్లియర్ చేయాలో చూద్దాం.
1. ముందుగా మీ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ కు వెళ్లండి.
2. తర్వాత ప్రొఫైల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.
3. మెనూలో మెనేజ్ యాప్స్ అండ్ డివైస్ అనే ఆప్షన్ పై నొక్కండి
4. ఆ తర్వాత మెసేజ్ పై క్లిక్ చేయండి.
5. ఇప్పుడు మీ స్మార్ట్ ఫోన్లో ఇన్ స్టాల్ చేసిన యాప్స్ కనిపిస్తాయి.
6. వాటిలో మీకు అవసరంలేని యాప్స్ ను సెలక్ట్ చేసుకోండి.
7. అన్ ఇన్ స్టాల్ చేయండి.
ఇలా చేస్తే మీకు అవసరం లేని యాప్స్ అన్నీ కూడా ఒకేసారి డిలీట్ అవుతాయి. స్టోరేజీ కూడా చాలా వరకు క్లియర్ అవుతుంది. అయినా కూడా స్టోరేజ్ సరిపోనట్లయితే…మీ స్మార్ట్ ఫోన్ లో ఉన్న ఫోటోలు, వీడియోలు గూగుల్ ఫోటోస్ లోకి, ముఖ్యమైన ఫైల్స్ గూగుల్ డ్రైవ్ లోకి అప్ లోడ్ చేయండి. అయితే గూగులు అకౌంట్ 15జీబీ స్టోరేజీ మాత్రమే ఇస్తుందన్న సంగతి తెలుసుకోవాలి. గూగుల్ ఫోటోలు, గూగుల్ డ్రైవ్ లోకి ఫోటోలు, వీడియోలు, ఫైల్స్ అప్ లోడ్ చేసిన తర్వాత మీ స్మార్ట్ ఫోన్ నుంచి వాటిని డిలీట్ చేసినట్లయితే స్టోరేజీ దాదాపుగా క్లియర్ అవుతుంది.
ఇంత చేసిన కూడా స్టోరేజీ సరిపోకపోతే…వాట్సాప్ లో అవసరం లేని వీడియోలు, ఫోటోలతోపాటుగా ఇతర ఫైల్స్ ఏమైనా ఉంటే వాటిని డిలీట్ చేండి. అయితే ముఖ్యమైన ఫైల్స్ అన్నీ కూడా బ్యాకప్ పెట్టి ఫోన్‌ను రీసెట్ చేయాలి. ఫోన్ రీసెట్ చేసేముందుకు ఫైల్స్ బ్యాకప్ పెట్టిన సంగతి మర్చిపోవద్దు.
Tags
Related News
Vivo V29e: ఈ రోజు లాంచ్ కానున్న వివో V29e
ఇండియా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌పై ఆధిపత్యాన్ని కొనసాగించేందుకు మరో కొత్త మోడల్‌ను సిద్ధం చేసింది వివో సంస్థ. ఈ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో