Honor 200 launch: ఎట్టకేలకు ఇండియాలో లాంచ్ అయిన హానర్ స్మార్ట్ ఫోన్.. పూర్తి వివరాలివే?
స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హానర్ 200, హానర్ 200 ప్రో స్మార్ట్‌ఫోన్స్ ఎట్టకేలకు తాజాగా ఇండియాలో లాంచ్ అయ్యాయి. మరి తాజాగా లాంచ్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ధర ఫీచర్ల వివరాల్లోకి వెళితే..
- By Anshu Published Date - 10:00 AM, Sat - 20 July 24

స్మార్ట్ ఫోన్ వినియోగదారులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న హానర్ 200, హానర్ 200 ప్రో స్మార్ట్‌ఫోన్స్ ఎట్టకేలకు తాజాగా ఇండియాలో లాంచ్ అయ్యాయి. మరి తాజాగా లాంచ్ చేసిన ఈ స్మార్ట్ ఫోన్ లకు సంబంధించిన ధర ఫీచర్ల వివరాల్లోకి వెళితే.. ఇవి స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3, స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3తో పని చేస్తాయి. హానర్ 200లో 6.7 ఇంచ్ ఫుల్ హెచ్డీ+ ఓఎల్ఈడీ కర్వ్డ్ ప్యానెల్, హై ఎండ్ హానర్ 200 ప్రోలో 6.78 ఇంచ్ ఓఎల్ఈడీ కర్వ్డ్ ప్యానెల్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 4000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ వంటివి ఇందులో ఉన్నాయి. కాగా రెండు మోడళ్లు ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తాయి.
అలాగే ఇవి 100 వాట్ ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్ ని అందిస్తాయి. ఇకపోతే ఈ స్మార్ట్ ఫోన్స్ ధరల విషయానికొస్తే.. ఇండియాలో హానర్ 200 రెండు వేరియంట్లలో లభిస్తోంది. అందులో 8 జీబీ+ 256 జీబీ వేరియంట్ ధర రూ .34,999 కాగా, 12 జీబీ + 512 జీబీ ధర రూ .39,999 గా ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ లో మనకు బ్లాక్, మూన్ లైట్ వైట్ వంటి రెండు కలర్ ఆప్షన్స్ లో లభించనున్నాయి. హానర్ 200 ప్రో 12 జీబీ + 512 జీబీ సింగిల్ వేరియంట్లో లభిస్తుంది. దీని ధర రూ. 57,999గా ఉంది. బ్లాక్, ఓషన్ సియాన్ అనే రెండు రంగులలో లభిస్తుంది. కాగా లిమిటెడ్ ఆఫ్లైన్ రిటైల్ స్టోర్లు, అమెజాన్ ఇండియాలో జూలై 20 మధ్యాహ్నం 12 గంటలకు ఈ రెండు మోడళ్లు అందుబాటులో ఉంటాయని హానర్ సంస్థ తెలిపింది.
అదనంగా, కస్టమర్లు ఐసీఐసీఐ, ఎస్బీఐ క్రెడిట్ కార్డులను ఉపయోగించి అనేక ఇన్స్టెంట్ డిస్కౌంట్లను కూడా పొందవచ్చని తెలిపింది. లాంచ్ వ్యవధిలో ఉచిత యాక్ససరీలను పొందవచ్చని కూడా వెల్లడించింది. ఇకపోతే స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే..ఈ రెండు స్మార్ట్ఫోన్లు లేటెస్ట్ క్వాల్కం చిప్సెట్ లతో పనిచేస్తాయి. హానర్ 200 ప్రోలో స్నాప్‌డ్రాగన్ 8ఎస్ జెన్ 3, హానర్ 200 లో స్నాప్ డ్రాగన్ 7 జెన్ 3 ఉంటాయి. హానర్ 200 ప్రో 12 జీబీ ర్యామ్ తో, హానర్ 200 8 జీబీ లేదా 12 జీబీ ర్యామ్ తో అందుబాటులో ఉన్నాయి. హానర్ 200 ప్రోలో 50 మెగా పిక్సెల్ వైడ్ షూటర్, 12 మెగా పిక్సెల్ అల్ట్రా వైడ్ యూనిట్, 50 మెగా పిక్సెల్ టెలిఫోటో యూనిట్ తో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్ కూడా ఉంది. హానర్ 200 లో ప్రైమరీ 50 మెగా పిక్సెల్ సెన్సార్ మినహా అదే సెటప్ ఉంది. 50 మెగా పిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 906కు బదులుగా, 50 మెగా పిక్సెల్ హెచ్ 9000 సెన్సార్ ని ఉపయోగిస్తుంది. సెల్ఫీలు, వీడియోల కోసం ముందువైపు 50 మెగా పిక్సెల్ కెమెరాను కూడా అందించారు. ఈ ఫోన్స్ 5200 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంను కలిగి ఉండనున్నాయి.