HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >Goon Caught With Two Thousand Stolen Fingerprints In Hyderabad

Fingerprints: ఏ మాత్రం జాగ్రత్తగా లేకున్నా…మీ వేలిముద్రలనూ కొట్టేస్తారు…!!

ఈమధ్యకాలంలో సైబర్ నేరాలు ఎక్కువవుతున్నాయి. టెక్నాలజీ పరంగా చాలా అప్ డేట్ అవుతున్నారు. పోలీసులకు పట్టుబడిన నేరస్థులను విచారించినప్పుడు విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి.

  • Author : hashtagu Date : 13-06-2022 - 11:32 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
fingerprints
fingerprints

ఈమధ్యకాలంలో సైబర్ నేరాలు ఎక్కువవుతున్నాయి. టెక్నాలజీ పరంగా చాలా అప్ డేట్ అవుతున్నారు. పోలీసులకు పట్టుబడిన నేరస్థులను విచారించినప్పుడు విస్తుపోయే నిజాలు బయటకు వస్తున్నాయి. నేరగాళ్లు వ్యక్తుల గుర్తింపును కూడా చోరి చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఆ గుర్తింపు ఆధారంగా నకిలీ బ్యాంకు అకౌంట్స్ తెరిచి పెద్ద పెద్ద మోసాలకు పాల్పడుతున్నట్లు బయటపడింది.

హైదరాబాద్ సైబర్ పోలీసులు గత నెలలో ఓ నేరస్థుడిని అదుపులోకి తీసుకున్నారు. విచారణ సమయంలో ఆ నేరస్థుడు చెప్పిన మాటలు విని అవాక్కవడం పోలీసుల వంతైంది. పట్టుబడిన వ్యక్తి దగ్గరి నుంచి సుమారు రెండువేల మంది వ్యక్తుల వేలిముద్రలు ఉన్నట్లు తెలుసుకున్నారు. వీటి ఆధారంగా నకిలీ గుర్తింపులను తయారు చేసి…మోసాలకు పాల్పడుతున్నట్లు బయటపడింది. అంతేకాదు మరిన్ని విస్తుపోయే విషయాలు బయటపడ్డాయి.ఆ ఫింగర్ ప్రింట్స్ ను అతనడు సొంతగా సంపాదించలేదట. మరో నేరగాడి దగ్గరనుంచి తీసుకున్నాడట. ఇలాంటి వారు ఎంతో మంది ఉండొచ్చని పోలీసులు అంటున్నార. కాబట్టి ప్రజలు తమ గుర్తింపు వివరాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని పోలీసులు సూచిస్తున్నారు.

ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నిర్వహించిన సైబర్ భద్రత-జాతీయ భద్రత అనే అంశంపై జరిగిన కార్యక్రమంలో భాగంగా సైబరాబాద్ డీసీపీ కమలేశ్వర్ వివరాలను వెల్లడించారు. చోరి చేసిన వ్యక్తిగత వివరాల ఆధారంగా కొత్త సిమ్ కార్డులు తీసుకుని సోషల్ మీడియాలో అకౌంట్స్ తెరుస్తున్నట్లు చెప్పారు. రెండు వేల ఫింగర్ ప్రింట్స్ తో పట్టుబడిన వ్యక్తి…అప్పటికే వాటి సాయంతో సిమ్ కార్డులు కూడా తీసుకున్నట్లు పోలీసులు గుర్తించి వాటిని స్వాధీనం చేసుకున్నారు. ఈ సిమ్ కార్డులతో అమాయకులను లక్ష్యంగా చేసుకుని కేవైసీ మోసాలకు పాల్పడుతున్నట్లు గుర్తించామన్నారు. పలు బ్యాంకు అకౌంట్స్ ను కూడా సీజ్ చేసినట్లు చెప్పారు. బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్స్ ఎవ్వరితోనూ షేర్ చేసుకోవద్దని సూచించారు. అంతేకాదు ఆధార్ తోపాటు ఇతర కేవైసీ జిరాక్స్ లు కూడా ఎవరి ఇవ్వొద్దని…జిరాక్స్ కేంద్రాల్లోనూ జాగ్రత్తగా ఉండాలని చెప్పారు.

 

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • criminal
  • fingerprints
  • police

Related News

Police deliver an unexpected shock to Uppal Balu.

Uppal Balu: ఉప్పల్ బాలుకు ఊహించని షాక్ ఇచ్చిన పోలీసులు

సామాజిక మాధ్యమాల్లో లైకులు, వ్యూస్ కోసం కొందరు సోషల్ మీడియా తారలు ఎంతటి ప్రమాదకరమైన పనులకైనా తెగిస్తున్నారు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో తన వింత డ్యాన్సులతో ఫేమస్ అయిన ఉప్పల్ బాలు తాజాగా చేసిన పని తీవ్ర వివాదాస్పదంగా మారింది. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం, ప్రముఖ పర్యాటక ప్రాంతమైన వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి ఘాట్ రోడ్డులో ఉప్పల్ బాలు చేసిన వింత చేష్టలు, ప్రమాదకర స్టంట్ల

    Latest News

    • Uric acid: కీళ్ల నొప్పులు బాధిస్తున్నాయి? అయితే శరీరంలో ఇది జరిగి ఉండవచ్చు..!!

    • Lord Shiva: నీలకంఠునికి ఏ ద్రవ్యాలతో అభిషేకం చేస్తే ఫలితం ఉంటుంది?

    • Lemon Water: ఉదయాన్నే లెమన్ వాటర్ తాగితే ఏమవుతుందో తెలుసా..!

    • Rains: తెలంగాణకు భారీ వర్షసూచన

    • Amaravati Farmers: వైకాపా నేతల పర్యటనను అడ్డుకున్న రాజధాని రైతులు

    Trending News

      • Breaking News: అంతుపట్టని మిస్టరీగా చిన్నారి జ్ఞానేశ్వరి మిస్సింగ్ కేసు.. రంగంలోకి క్రైమ్ టీం

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd