Google Pay: గూగుల్ పేలో సరికొత్త ఫీచర్.. ఇకపై ఆధార్ తో యూపీఐ పేమెంట్?
టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యి ఆన్లైన్ పేమెంట్ యాప్స్ ఉపయోగం పెరిగిపోవడంతో ప్రతి ఒక్కరూ గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి యాప్స్ ని వినియోగిస్తున
- By Nakshatra Published Date - 05:19 PM, Wed - 7 June 23
టెక్నాలజీ బాగా డెవలప్ అయ్యి ఆన్లైన్ పేమెంట్ యాప్స్ ఉపయోగం పెరిగిపోవడంతో ప్రతి ఒక్కరూ గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం లాంటి యాప్స్ ని వినియోగిస్తున్నారు. ఇప్పటికే ఆయా సంస్థలు కూడా కొత్త కొత్త ఫీచర్లను అందుబాటులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. నేపథ్యంలోనే గూగుల్‌పే వినియోగదారుల కోసం మరో సరికొత్త ఫీచర్ ని అందుబాటులోకి తీసుకు వచ్చింది. ఆధార్‌తో యూపీఐ చెల్లింపుల కోసం నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాకు యూజర్లు గూగుల్‌పే యాప్‌లో నమోదు చేసుకోవచ్చు.
కాగా ఇకపై ఆధార్ ఆధారిత యూపీఐ ఆన్‌బోర్డింగ్ విధానం ద్వారా గూగుల్‌పే యూజర్లు డెబిట్ కార్డ్ లేకుండానే తమ యూపీఐ పిన్ని సెట్ చేసుకోవచ్చు. కోట్లాది మంది యూపీఐ చెల్లింపులను వినియోగిస్తున్న నేపథ్యంలో ఇది చాలా మంది వినియోగదారులకు యూపీఐ ఐడీలను సెటప్ చేసుకునేందుకు, డిజిటల్ చెల్లింపులు చేయడానికి ఈ ఫీచర్ వీలు కల్పిస్తుందని భావిస్తున్నారు. ఆధార్‌తో యూపీఐ పేమెంట్ అవకాశం ప్రస్తుతానికి ఎంపిక చేసిన కొన్ని బ్యాంకుల కస్టమర్లకు మాత్రమే ఉంది.
అయితే త్వరలో మరిన్ని బ్యాంకులు ఈ సదుపాయాన్ని తీసుకొచ్చే అవకాశం ఉంది. ఆధార్ ద్వారా యూపీఐ చెల్లింపులను వినియోగించుకోవాలంటే ఆధార్, బ్యాంక్‌లో నమోదు చేసుకున్న ఫోన్ నంబర్ ఒకటే అయి ఉండాలి. అలాగే బ్యాంక్ ఖాతా ఆధార్‌తో లింక్ చేసి ఉండాలి. మరి ఇందుకోసం ఎలా నమోదు చేసుకోవాలి అన్న విషయానికి.. గూగుల్‌పే యాప్‌లో వినియోగదారులు డెబిట్ కార్డ్ లేదా ఆధార్ ఆధారిత యూపీఐ నమోదును ఎంపిక చేసుకోవచ్చు. ఆధార్‌ని ఎంచుకుంటే నమోదు ప్రక్రియను ప్రారంభించడానికి వారి ఆధార్ నంబర్ లోని మొదటి ఆరు అంకెలను ఎంటర్ చేయాలి. ప్రామాణీకరణ దశను పూర్తి చేయడానికి ఆధార్ బ్యాంక్ నుంచి వచ్చిన ఓటీపీలను నమోదు చేయాలి. తర్వాత ప్రక్రియను బ్యాంక్ పూర్తి చేశాక యూపీఐ పిన్ని సెట్ చేసుకోవచ్చు. కస్టమర్లు లావాదేవీలు చేయడానికి లేదా బ్యాలెన్స్‌ని చెక్ చేయడానికి గూగుల్ యాప్‌ని ఉపయోగించవచ్చు. ఆధార్ నంబర్లోని మొదటి ఆరు అంకెలను నమోదు చేసిన తర్వాత, అది ధ్రువీకరణ కోసం NPCI ద్వారా UIDAIకి వెళ్తుంది. ఈ ప్రక్రియ వినియోగదారుల ఆధార్ నంబర్ భద్రతను నిర్ధారిస్తుంది.
Related News
Google Pay Loan: గూగుల్ పే వాడుతున్నారా..? అయితే ఈజీగా రూ. లక్ష వరకు లోన్ పొందండిలా..!
ప్రపంచంలోనే అతిపెద్ద సెర్చ్ ఇంజిన్ కంపెనీ గూగుల్ భారతీయుల కోసం అనేక సౌకర్యాలను ప్రకటించింది. ఇందులో చిరు వ్యాపారులకు కూడా చాలా ప్రయోజనాలు కల్పించే ప్రయత్నం చేశారు.