UPI Circle : గూగుల్ పే ‘యూపీఐ సర్కిల్’.. ఒకే యూపీఐ ఐడీని ఐదుగురు వాడుకోవచ్చు
'యూపీఐ సర్కిల్' ఫీచర్ ద్వారా ఒక వ్యక్తికి చెందిన 'యూపీఐ అకౌంట్'ను ఐదుగురు వ్యక్తులు కలిసి వాడుకోవచ్చు.
- By Pasha Published Date - 12:20 PM, Sat - 31 August 24

UPI Circle : గూగుల్ పేలో మరో కొత్త ఫీచర్ వచ్చింది. దాని పేరే.. ‘యూపీఐ సర్కిల్’ !! ఇంతకీ ఈ ఫీచర్ ఎలా పనిచేస్తుందో మీకు తెలుసా ? దీన్ని ఎలా వాడుకోవాలో తెలుసా ? ఒకవేళ తెలియకుంటే.. తప్పకుండా ఈ కథనం మొత్తం చదవండి. యూపీఐ సర్కిల్(UPI Circle) ఫీచర్ గురించి మీకు ఐడియా వస్తుంది.
We’re now on WhatsApp. Click to Join
‘యూపీఐ సర్కిల్’ ఫీచర్ ద్వారా ఒక వ్యక్తికి చెందిన ‘యూపీఐ అకౌంట్’ను ఐదుగురు వ్యక్తులు కలిసి వాడుకోవచ్చు. అంటే ఒక గూగుల్ పే యూజర్ .. కుటుంబ సభ్యులు, స్నేహితులకు తన యూపీఐ అకౌంట్‌ను వాడుకునే అవకాశాన్ని కల్పించవచ్చు. అవతలి వ్యక్తులకు బ్యాంకు ఖాతా లేకపోయినా ఈ సదుపాయాన్ని వాడుకోవచ్చు. యూపీఐ సర్కిల్ ఫీచర్ ద్వారా ఒక ప్రైమరీ యూపీఐ యూజర్, తనకు నమ్మకమైన వ్యక్తులకు (సెకెండరీ యూజర్లకు) పేమెంట్స్ చేసే హక్కును కల్పించవచ్చు. అయితే ఈక్రమంలో వారు చేసే ఆర్థిక లావాదేవీలను కంట్రోల్ చేయొచ్చు. ప్రైమరీ యూజర్ ఎంత వరకైతే అమౌంటును నిర్దేశిస్తాడో .. అంత వరకు మాత్రమే సెకెండరీ యూజర్లు గూగుల్ పే యూపీఐ సర్కిల్ ద్వారా పేమెంట్ చేయగలుగుతారు. అయితే ఈ లావాదేవీలు చేసిన ప్రతిసారీ ప్రైమరీ యూజర్ అనుమతి పొందాల్సిన అవసరం ఉండదు. దీన్నే టెక్నికల్ భాషలో ‘ఫుల్ డెలిగేషన్’ అంటారు.
Also Read :Liquor Shops : సెప్టెంబరు 7న ప్రభుత్వ మద్యం షాపులు బంద్.. కారణం ఇదే
ఇందులో మరో ఆప్షన్ కూడా ఉంది. అదేమిటంటే.. గూగుల్ పే యూపీఐ సర్కిల్‌లోని ప్రైమరీ యూజర్ ప్రతీ లావాదేవీకి తన అనుమతి పొందేలా చేయొచ్చు. దీన్ని టెక్నికల్ భాషలో ‘పార్శియల్ డెలిగేషన్’ అని పిలుస్తారు. ఈ ఆప్షన్‌ను ప్రైమరీ యూజర్ ఎంచుకుంటే.. అతడి సర్కిల్‌లో ఉన్నవాళ్లు ప్రతి లావాదేవీకి ప్రైమరీ యూజర్ అథంటికేషన్ పొందాల్సి ఉంటుంది. అంటే ప్రైమరీ యూజర్ - యూపీఐ పిన్ను ఎంటర్ చేస్తేనే.. సెకెండరీ యూజర్లు చేసిన లావాదేవీలు ఎగ్జిక్యూట్ అవుతాయి. కాగా, యూపీఐ సర్కిల్ సేవలను అందించేందుకు ‘ఎన్‌పీసీఐ’తో గూగుల్ పే జట్టు కట్టింది.