Listen To This Page : ఇక గూగుల్ క్రోమ్‌లో చదవొద్దు.. వినేయండి..
మీరు గూగుల్ క్రోమ్ వాడుతుంటారా ? అందులో న్యూస్ ఆర్టికల్స్, ఇతరత్రా సమాచారం చదువుతుంటారా ?
- By Pasha Published Date - 08:05 AM, Tue - 18 June 24
![Listen To This Page : ఇక గూగుల్ క్రోమ్‌లో చదవొద్దు.. వినేయండి..](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2024/06/Google-Chrome.jpg)
Listen To This Page : మీరు గూగుల్ క్రోమ్ వాడుతుంటారా ? అందులో న్యూస్ ఆర్టికల్స్, ఇతరత్రా సమాచారం చదువుతుంటారా ? అయితే మీకు మరింత కంఫర్ట్ ఇచ్చే సరికొత్త ఫీచర్ వచ్చేసింది. దాని పేరే ‘లిజన్ టు దిస్ పేజ్’. తొలుత ఆండ్రాయిడ్ యూజర్ల కోసం ఇది అందుబాటులోకి వచ్చింది. ఈ ఫీచర్‌ను వాడుకొని మనం వెబ్ పేజీలోని టెక్ట్స్‌ను ఆడియోలాగా చదివేయొచ్చు. అంటే ఇకపై మనం టెక్ట్స్‌ను కష్టపడి చదవకుండా.. ఈజీగా వినేయొచ్చు. అయితే ప్రస్తుతానికి ఈ అద్భుత ఫీచర్ కొందరికే అందుబాటులోకి వచ్చింది. విడతలవారీగా గూగుల్ క్రోమ్ వాడే ఆండ్రాయిడ్ యూజర్లు అందరికీ ఇది అందుబాటులోకి వచ్చేస్తుంది.
We’re now on WhatsApp. Click to Join
- ‘లిజన్ టు దిస్ పేజ్’(Listen To This Page) ఫీచర్‌ను వాడాలంటే వెబ్ పేజీని ఓపెన్ చేసి, పైన కుడివైపు ఉండే త్రీడాట్స్ మెనూ ఓపెన్ చేయాలి. అక్కడ కనిపించే ‘లిజన్ టు దిస్ పేజ్’ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి.
- పాడ్కాస్ట్లాగా వాయిస్ ప్రారంభం అవుతుంది. మ్యూజిక్ ప్లేయర్ తరహాలో దీన్ని మీరు పాజ్, రివైండ్, ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు.
- వేగంగా వినాలనుకుంటే, ప్లే బ్యాక్ స్పీడ్‌ను కూడా మార్చుకోవచ్చు.
- ఈ ఫీచర్లో రూబీ, రివర్, ఫీల్డ్, మోస్ అనే నాలుగు రకాల వాయిస్ టైప్స్ ఉన్నాయి. ఇందులో మనకు నచ్చిన దాన్ని ఎంచుకొని హాయిగా ఆడియో ఫార్మాట్లో వినొచ్చు.
Also Read :YSRCP : ‘మండలి’లో వైఎస్సార్ సీపీకి ఫుల్ మెజారిటీ.. ప్రభావం చూపగలరా ?
- ‘లిజన్ టు దిస్ పేజ్’ అనే ఈ ఫీచర్ ప్రస్తుతం 12 భాషలకు సపోర్ట్ చేస్తోంది.
- ఈ లిస్టులో మన దేశానికి చెందిన హిందీ, బెంగాలీ భాషలతో పాటు ఇంగ్లిష్, అరబిక్, చైనీస్, ఫ్రెంచ్, జర్మన్, ఇండోనేసియన్, జపనీస్, పోర్చ్‌గీస్, రష్యన్, స్పానిష్ భాషలు ఉన్నాయి.
- అంటే ఈ భాషల్లోని టెక్ట్సులకు ఆడియోను మనం వినేయొచ్చు.
- మన ఆండ్రాయడ్ డివైజ్‌కు స్క్రీన్ లాక్ చేసి ఉన్నా.. ఈ ఫీచర్ ద్వారా టెక్ట్సు యొక్క ఆడియోను మనం వినొచ్చు.
- ఒక వెబ్ పేజీలో ఆడియోను వింటూనే.. మరో వెబ్ పేజీని మనం యాక్సెస్ చేయొచ్చు.
- పెద్ద పెద్ద వ్యాసాలు చదివే వారికి ఈ ఫీచర్ ఒక వరం లాంటిది.
- ప్రస్తుతానికి ఈ ఫీచర్ అన్ని వెబ్ పేజీలకు సపోర్ట్ చేయడం లేదు.
Also Read :Kavach Safety System: రైల్వేలో కవాచ్ రక్షణ వ్యవస్థ అంటే ఏమిటి? ఇది ఎలా పని చేస్తుంది..?
![https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2023/09/Drreddy.jpg)
Related News
![Google Chrome Users: క్రోమ్‌లో బ్రౌజ్ చేయడం సురక్షితమేనా.. ప్రభుత్వం రిస్క్ అలర్ట్ ఎందుకు జారీ చేస్తోంది?](https://d1x8bgrwj9curj.cloudfront.net/wp-content/uploads/2022/10/google-chrome.jpg)
Google Chrome Users: క్రోమ్‌లో బ్రౌజ్ చేయడం సురక్షితమేనా.. ప్రభుత్వం రిస్క్ అలర్ట్ ఎందుకు జారీ చేస్తోంది?
మీరు కంప్యూటర్లో లేదా మీ మొబైల్ ఫోన్లో ఇంటర్నెట్‌ని ఉపయోగిస్తున్నా బ్రౌజర్ (Google Chrome Users) అవసరం. దీని కోసం చాలా మంది గూగుల్ క్రోమ్ బ్రౌజర్‌ని ఉపయోగిస్తున్నారు.