Schedule SMS: మీరు పంపాల్సిన ఎస్ఎంఎస్ ను షెడ్యూల్ చేయొచ్చు.. ఎలా అంటే?
గూగుల్ డిఫాల్ట్ మెసేజ్ యాప్ లలో కొత్త కొత్త ఫీచర్స్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో
- By Nakshatra Published Date - 07:30 AM, Wed - 21 December 22
గూగుల్ డిఫాల్ట్ మెసేజ్ యాప్ లలో కొత్త కొత్త ఫీచర్స్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ లో గూగుల్ మెసేజెస్ యాప్ డిఫాల్ట్ మెసేజ్ యాప్ గా మనకు లభిస్తోంది. అయితే కొందరు వినియోగదారులు ఈ యాప్ ని ఉపయోగించకుండా థర్డ్ పార్టీ మెసేజింగ్ యాప్ ను ఉపయోగిస్తున్నారు. ఇది ఇలా ఉంటే గూగుల్ మెసేజెస్ యాప్‌లో ఎస్ఎంఎస్ ను షెడ్యూల్ చేసే ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. అనగా మీరు ఎవరికైనా ముందుగానే మెసేజ్ చేయాలి అనుకుంటే ఆ మెసేజ్ టైప్ చేసి టైం సెట్ చేసి పెట్టుకోవచ్చు.
ఆ విధంగా చేయడం వల్ల కరెక్ట్ గా ఆ సమయానికి ఎస్ఎంఎస్ డెలివరీ అవుతుంది. ఈ ఫీచర్ బర్త్‌డే విషయంలో బాగా ఉపయోగపడుతుంది అని చెప్పవచ్చు. కాగా ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లు మెసేజెస్ షెడ్యూల్ చేసేందుకు ఇన్నాళ్లూ థర్డ్ పార్టీ యాప్ ఉపయోగించేవారు. కానీ ప్రస్తుతం థర్డ్ పార్టీ యాప్ వాడాల్సిన అసరం లేకుండా స్మార్ట్‌ఫోన్ లో డిఫాల్ట్‌గా లభించే గూగుల్ మెసేజెస్ యాప్‌లో మెసేజ్ షెడ్యూల్ చేయవచ్చు. మరి మీ ఫోన్లో గూగుల్ మెసేజెస్‌లో ఎస్ఎంఎస్ ఎలా షెడ్యూల్ చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. ఇందుకోసం మనం ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ మెసేజెస్ యాప్ ఓపెన్ చేసి మీరు ఎవరికి మెసెజ్ పంపాలనుకుంటున్నారో వారి పేరు సెలెక్ట్ చేసి మెసేజ్ టైప్ చేయండి.
ఆ తర్వాత సెండ్ బటన్ క్లిక్ చేయకుండా, సెండ్ బటన్ పైన లాంగ్ ప్రెస్ చేయాలి. షెడ్యూల్ సెండ్ ఆప్షన్ పై సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత సెలక్ట్ డేట్ అండ్ టైమ్ పైన క్లిక్ చేయాలి. క్యాలెండర్లో డేట్ సెలెక్ట్ చేసి ఆ తర్వాత టైమ్ సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత సేవ్ పైన క్లిక్ చేస్తే చాలు. మెసేజ్ షెడ్యూల్ అవుతుంది. మీరు ఒకసారి షెడ్యూల్ చేసిన మెసేజ్‌ను మాడిఫై చేయొచ్చు లేదా డిలిట్ చేయొచ్చు. షెడ్యూల్ చేసినా వెంటనే పంపాలనుకుంటే మెసేజ్ పంపొచ్చు. వేర్వేరు దేశాల్లో నివసించేవారికి మెసేజెస్ పంపడానికి, బిజీగా ఉండేవారికి ఎస్ఎంఎస్ చేయడానికి ఈ ఫీచర్ బాగా ఉపయోగపడుతుంది.
Related News
Google Messages App: గూగుల్ మెసేజింగ్ యాప్‌లో కొత్త ఫీచర్.. ఇది ఎలా పని చేస్తుందంటే..?
ఆండ్రాయిడ్ కోసం గూగుల్ మెసేజింగ్ యాప్ (Google Messages App) స్మార్ట్ఫోన్లలో భద్రతను మెరుగుపరచడానికి, స్పామ్‌ను తగ్గించడానికి కొత్త ఫీచర్‌ను ఆవిష్కరించడానికి సిద్ధంగా ఉంది.