Flipkart: బంపర్ ఆఫర్ ప్రకటించిన ఫ్లిప్‌కార్ట్.. రూ.75 వేల ఫోన్ 35 వేలకే!
ఫ్లిప్‌కార్ట్ సంస్థ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో భాగంగా గూగుల్ పిక్సెల్ 8 పై అద్భుతమైన ఆఫర్ ను అందిస్తోంది.
- By Anshu Published Date - 10:30 AM, Tue - 24 September 24

ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్ లో బిగ్ బిలియన్ డేస్ సేల్ 2024 నడుస్తున్న విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇప్పుడు స్మార్ట్ ఫోన్లతో పాటు ఫ్లిప్కార్ట్ లో కొనుగోలు చేసే చాలా రకాల వాటిపై అద్భుతమైన ఆఫర్లను అందిస్తోంది. అతి తక్కువ ధరకే మంచి మంచి ప్రోడక్ట్లు కొనుగోలు చేసే అవకాశాన్ని కల్పిస్తోంది. అందులో భాగంగానే గూగుల్ స్మార్ట్ ఫోన్ పై ఏకంగా 40 వేల రూపాయల డిస్కౌంట్ ని అందిస్తోంది ఫ్లిప్కార్ట్ సంస్థ. వినడానికి షాకింగ్ గా ఉన్న ఇది నిజం. ఇంతకీ ఆ ఆఫర్ ఏంటి? ఈ స్మార్ట్ ఫోన్ అసలు ధర ఎంత?ప్రస్తుతం ఎంతకు లభిస్తుంది అన్న వివరాల్లోకి వెళితే..
ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డేస్ సేల్‌లో గూగుల్ పిక్సెల్ 8 ధర రూ.32,000 కంటే తక్కువకు తగ్గుతుంది. ఈ సేల్ ఫ్లిప్‌కార్ట్ లో అతిపెద్ద సేల్‌గా పరిగణిస్తారు. ఈ సంవత్సరం గూగుల్ పిక్సెల్ 9ని ప్రారంభించింది. గత జనరేషన్ ఫోన్ కాబట్టి ఈ ధరను తగ్గించనున్నట్లు తెలుస్తోంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ సేల్‌లో గూగుల్ పిక్సెల్ ధర రూ.31,999 గా ఉంది. అయితే ఈ ధరలో బ్యాంక్ ఆఫర్ లు, క్యాష్‌బ్యాక్, ఎక్స్చేంజ్, ఈఎంఐ ఆప్షన్లు ఉన్నాయి. అయితే ఈ కారణాల వల్ల ఈ ఫోన్ ధర మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది. మీరు ఈ ఫోన్ ని ఈఎంఐలో కొనుగోలు చేయాలనుకుంటే, నెలకు రూ. 5,554 ఈఎంఐలో కొనుగోలు చేయవచ్చట. ఇకపోతే ఈ గూగుల్ పిక్సెల్ 8 స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే..
ఈ ఫోన్ 6.2 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఓఎల్‌ఈడీ డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్ తో వస్తుంది. ఇది కాకుండా, గొరిల్లా గ్లాస్ లో వస్తుంది. స్మార్ట్ ఫోన్ గరిష్ట బ్రైట్ నెస్ 2,000 నిట్ ల వరకు ఉంటుంది. ఇది 8జీబీ ర్యామ్+256 జీబీ ఇంటర్నల్ స్టోరేజీతో ఉంటుంది. పనితీరు కోసం టెన్సర్ G3 చిప్‌సెట్, టైటాన్ ఎం2 కోప్రాసెసర్ మద్దతు అందించింది. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 OSలో నడుస్తుంది. సాఫ్ట్‌వేర్ అప్‌డేట్‌లు 7 సంవత్సరాల పాటు అందుబాటులో ఉంటాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 27W ఫాస్ట్ ఛార్జింగ్‌తో 4,575mAh బ్యాటరీకి మద్దతు ఇస్తుంది. పిక్సెల్ 8లో 50ఎంపీ ప్రధాన కెమెరా ఉంటుంది. ఇది OISతో వస్తుంది. ఇది కాకుండా, 12ఎంపీ అల్ట్రావైడ్ కెమెరా కూడా ఉంది. వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 10.5ఎంపీ ఫ్రంట్ కెమెరా అందించింది కంపెనీ.