Telugu News
News
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Special
  • Off Beat
News
News
CloseIcon
  • Telangana
  • Andhra Pradesh
  • India
  • South
  • Cinema
  • Trending
  • Photo Gallery
  • Speed News
  • Health
  • Life Style
  • Devotional
  • Off Beat

  • Telugu News
  • ⁄Technology News
  • ⁄Enjoy The Moon South Korea To Launch Danuri Its Maiden Lunar Mission On Aug 4

Enjoy The Moon: 14 లక్షల కోట్లతో దక్షిణ కొరియా మానవ రహిత లూనార్ మిషన్.. ఆగస్టు 4న ప్రయోగం!!

దక్షిణ కొరియా తొలిసారిగా ఆగస్టు 4న మానవ రహిత చంద్రయాత్రను నిర్వహించనుంది.

  • By Hashtag U Updated On - 01:51 PM, Sat - 6 August 22
Enjoy The Moon: 14 లక్షల కోట్లతో దక్షిణ కొరియా మానవ రహిత లూనార్ మిషన్.. ఆగస్టు 4న ప్రయోగం!!

దక్షిణ కొరియా తొలిసారిగా ఆగస్టు 4న మానవ రహిత చంద్రయాత్రను నిర్వహించనుంది. పూర్తి స్వదేశీ పరిజ్ఞానం తో అభివృద్ధి చేసిన కొరియా పాత్ ఫైండర్ లూనార్ ఆర్బిటర్ (కే పీ ఎల్ ఓ) ను ప్రయోగించనుంది. ఈ మిషన్ కు “దనురి” అని పేరు పెట్టారు. దనురి అంటే.. కొరియా భాషలో “చంద్రుడిని ఆనందించు” అని అర్ధం.ఈ మిషన్ ను లాంచ్ చేస్తే ప్రపంచంలో మానవ రహిత చంద్రయాత్ర నిర్వహించిన 7వ దేశంగా దక్షిణ కొరియా నిలువనుంది.

ఏమిటీ “మిషన్” ?

కే పీ ఎల్ ఓ మూన్
ఆర్బిటర్ ను కొరియా ఏరో స్పేస్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ అభివృద్ధి చేసింది. చంద్రుడి ఉపరితలంపై 100 కిలోమీటర్ల ఎత్తున ఎగురుతూ ..చంద్రుడిపై చోటుచేసుకునే మార్పులను నమోదు చేయడమే ఈ మిషన్ లక్ష్యం. ఈ ప్రయోగానికి అవసరమైన పే లోడ్స్, డీప్ స్పేస్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, న్యావిగేషన్ టెక్నాలజీని అమెరికా కు చెందిన నాసా నుంచి తీసుకున్నారు. ఆగస్టు 4న అమెరికాలోని కేప్ కెనవరల్ స్పేస్ ఫోర్స్ స్టేషన్ నుంచి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఈ ఆర్బిటర్ ను ప్రయోగిస్తారు. సూర్యుడు, భూమికి చెందిన గురుత్వాకర్షణ బలాన్ని వినియోగించుకొని ఈ ఆర్బిటర్ డిసెంబరు 2వ వారం కల్లా చంద్రుడి పై నిర్ణీత కక్ష్యలోకి చేరుతుంది. ఈ ప్రాజెక్ట్ మొత్తం వ్యయం రూ.14 లక్షల కోట్లు.

ఎందుకు ఈ “మిషన్” ?

చంద్రుడి ఉపరితలంపై 100
కిలోమీటర్ల ఎత్తున ఎగురుతూ ఉండేలా తయారు చేసిన ఈ ఆర్బిటర్ బరువు 678 కిలోగ్రాములు. దీని జీవిత కాలం ఒక ఏడాది. చంద్రుడి ఉపరితలంపై అయస్కాంత క్షేత్రం ప్రభావం ఎంత ? అనేది గుర్తించేందుకు శక్తివంతమైన కెమెరాలను ఈ ఆర్బిటర్ కు అమర్చారు. చంద్రుడి ఉపరితలం పై ఉండే పదార్థాల ఫోటోలను సైతం ఈ కెమెరాలు అద్భుత క్లారిటీ తో తీయగలవు. దక్షిణ కొరియాకు చెందిన ఎలక్ట్రానిక్ అండ్ టెలి కమ్యూనికేషన్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ అభివృద్ధి చేసిన
స్పేస్ ఇంటర్నెట్ టెస్ట్ ఎక్విప్మెంట్ ను కూడా ఈ ఆర్బిటర్ తో పాటు పంపిస్తున్నారు. చంద్రుడి పై ఇంటర్నెట్ సేవలు విస్తృతంగా వాడొచ్చ? ఈక్రమంలో ఎదురయ్యే అవాంతరాలు ఏమిటి? అనేది తెలుసుకునేందుకు స్పేస్ ఇంటర్నెట్ టెస్ట్ ఎక్విప్మెంట్ ను వాడనున్నారు.

ఉత్తర కొరియా వార్నింగ్..

ఇక తమతో పెట్టుకుంటే అణ్వస్త్రాలు వేస్తామని ఉత్తర కొరియా నియంత కిమ్ మళ్ళీ హెచ్చరించాడు. ఈనేపథ్యంలో ఈ వారంలో దక్షిణ కొరియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా, కెనడా కలిసి సంయుక్త సైనిక విన్యాసాలు చేయనున్నాయి.

Tags  

  • August 4 launch
  • Danuri
  • first moon mission
  • south korea
  • world

Related News

China Temperature: చైనాలో ఉష్ణోగ్రతల ఉగ్రరూపం!!

China Temperature: చైనాలో ఉష్ణోగ్రతల ఉగ్రరూపం!!

చైనాలో వాతావరణం ఒక్కసారిగా మారుతోంది. ఉష్ణోగ్రతలు రికార్డు స్థాయిలో మారుతున్నాయి. గతంలో ఎన్నడూ లేనంత వేడి చుట్టుముడుతోంది. సముద్ర నీటిమట్టాలు పెరుగుతున్నాయి. వివరాల్లోకి వెళితే.. గత 70 ఏళ్లలో ప్రపంచంలోని ఇతర దేశాలతో పోలిస్తే చైనాలో ఉష్ణోగ్రతలు ఎక్కువగా పెరిగాయి. 1951 సంవత్సరం తర్వాత.. ప్రతి పదేళ్లకు ఒకసారి 0.26 డిగ్రీల సెల్సీయస్ ఉష్ణోగ్రత చైనాలో పెరిగింది. ఇదే వ్యవధిలో మొత

  • Canada : కెన‌డాని భ‌య‌పెడుతున్న మంకీపాక్స్ .. 957 కేసులు న‌మోదు

    Canada : కెన‌డాని భ‌య‌పెడుతున్న మంకీపాక్స్ .. 957 కేసులు న‌మోదు

  • China War: తైవాన్‌ – చైనా మధ్య యుద్ధ మేఘాలు.. ఎందుకు ? ఏమిటి?

    China War: తైవాన్‌ – చైనా మధ్య యుద్ధ మేఘాలు.. ఎందుకు ? ఏమిటి?

  • Candy: అక్కడ చాక్లెట్ తినడమే పని.. సంవత్సరానికి రూ.61.2 లక్షల జీతం.. ఎక్కడంటే?

    Candy: అక్కడ చాక్లెట్ తినడమే పని.. సంవత్సరానికి రూ.61.2 లక్షల జీతం.. ఎక్కడంటే?

  • China Missile Strikes: చైనా యుద్ధ విన్యాసాలు

    China Missile Strikes: చైనా యుద్ధ విన్యాసాలు

Latest News

  • టీ ట్వంటీ వరల్డ్ కప్ బెర్త్ వయా ఆసియా కప్

  • Coconut Husk : కొబ్బరి పీచే కదా అని విసిరేయకండి, దాని ఆరోగ్య ప్రయోజనాలను తెలుస్తే షాక్ అవుతారు..!!

  • Janhvi Emotion: హ్యాపీ బర్త్‌డే అమ్మా.. జాన్వీ ఎమోషన్ పోస్ట్!

  • Revanth Sorry To Komatireddy: ఐ యామ్ సారీ వెంకన్న!

  • Vastu-Tips: ఫెంగ్ షుయ్ మొక్కలను మీ ఇంట్లో ఈ దిక్కున పెడితే…అదృష్ట దేవత మీ తలుపుతడుతుంది..!!

Trending

    • Rakhi: రాఖీ కట్టిన తర్వాత ఎప్పుడు తీసేయాలో తెలుసా?

    • Horse Collapsed: అయ్యో… ఎంత కష్టం వచ్చింది.. నడిరోడ్డుపై అలా పడిపోయిన గుర్రం!

    • Urvashi vs Rishabh: పంత్‌కు ఊర్వశీ రౌతాలా ఘాటు రిప్లై

    • ఈ విమానం ల్యాండింగ్ చూస్తే షాక్ అవ్వకుండా ఉండలేరు.. వైరల్ వీడియో!

    • Pakistani Loves Indian: హైదరాబాద్ అబ్బాయిని ప్రేమించిన పాకిస్తాన్ అమ్మాయి.. ఇక్కడికి వస్తు దొరికిపోయిన యువతి!

  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
  • Copyright © 2022 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam
  • Follow us on: