HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >End To End Encryption In Google Messages Too

Google: గూగుల్‌ మెసేజెస్‌ లోనూ ఎండ్-టూ-ఎండ్ ఎన్‌క్రిప్షన్

ప్రస్తుతం గూగుల్ మెసేజెస్‌ (Google Messages)కి కూడా ఎన్‌క్రిప్షన్‌ కల్పించాలని, మెసేజెస్‌ గ్రూప్‌ ఛాట్‌ (Group Chat) ఎక్స్‌పీరియన్స్‌ను అభివృద్ధి

  • Author : Maheswara Rao Nadella Date : 05-12-2022 - 7:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Google Messages App
Google Messages

ఈ డిజిటల్‌ యుంగంలో డేటా (Data) కీలకంగా మారింది. అన్ని రకాల పనులు ప్రస్తుతం ఫోన్‌ ఆధారంగానే జరుగుతున్నాయి. కీలక సమాచారం అంతా స్మార్ట్‌ ఫోన్‌లలోనే ఉంటుంది. వివిధ మార్గాల్లో సైబర్‌ (Cyber) నేరగాళ్లు డేటాను దొంగిలించేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు. బ్యాంకు వివరాలు, పాస్‌వర్డ్‌లు హ్యాకర్ల (Hackers) చేతికి దొరికితే సమస్యలు తప్పవు. అందుకే ఆయా కంపెనీలు యూజర్‌ డేటాకు ప్రైవసీ (Privacy), సెక్యూరిటీ కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నాయి. వాట్సాప్‌ మెసెంజర్‌లో సెండ్‌ చేసే మెసేజ్‌లకు కూడా ఎన్‌క్రిప్షన్‌ ఉంది. ప్రస్తుతం గూగుల్ మెసేజెస్‌ (Google Messages)కి కూడా ఎన్‌క్రిప్షన్‌ కల్పించాలని, మెసేజెస్‌ గ్రూప్‌ ఛాట్‌ ఎక్స్‌పీరియన్స్‌ను అభివృద్ధి చేయాలని గూగుల్‌ (Google) భావిస్తోంది. అందుకే రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ (RCS) ను అభివృద్ధి చేస్తోంది. ఈ అప్‌డేట్‌కు సంబంధించిన వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.

గూగుల్ (Google) ఎండ్-టు-ఎండ్ (End-to-End) ఎన్‌క్రిప్టెడ్ రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ (Rich Communication Services) గ్రూప్ చాట్‌ (Group Chat) లను టెస్ట్‌ చేస్తున్నట్లు ప్రకటించింది. రాబోయే కొన్ని వారాల్లో ఓపెన్ బీటా ప్రోగ్రామ్‌ ద్వారా కొంతమంది వినియోగదారులకు అందుబాటులో వస్తుందని తెలిపింది. ఈ ఫీచర్‌తో గూగుల్‌ మెసేజెస్‌ ఉపయోగించి పంపిన వన్‌- ఆన్‌- వన్‌ టెక్స్ట్‌లు ఎన్‌క్రిప్ట్‌ అవుతాయి. దీంతో ఈ మెసేజ్‌లు ప్రైవేట్‌గా, సెక్యూర్‌గా ఉంటాయని, సెండర్‌, రిసీవర్‌ తప్ప మరొకరు చూడలేరని గూగుల్ ఓ బ్లాగ్‌ పోస్ట్‌లో పేర్కొంది. రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ టెక్స్టింగ్‌ను మరింత సురక్షితంగా చేయడమే కాకుండా, బెస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌ను కూడా అందిస్తుందని తెలిపింది.

రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్‌తో బెస్ట్‌ ఎక్స్‌పీరియన్స్‌:

SMS టెక్స్టింగ్‌లో స్మార్ట్‌ ఫోన్‌లకు ఉన్న సామర్థ్యం ఉపయోగించడం లేదని చెప్పింది. కానీ రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ అంటే హై క్వాలిటీ ఫోటోలు, వీడియోలను సెండ్‌ చేయవచ్చు, రిసీవ్‌ చేసుకోవచ్చని వివరించింది. రియల్‌ టైమ్‌ టైపింగ్ ఇండికేటర్స్‌ను, రీట్‌ రెసీప్ట్స్‌ను చూడవచ్చు, గ్రూప్‌ కన్వర్జేషన్‌లకు నేమ్‌ సెట్‌ చేయవచ్చు, గ్రూప్ చాట్‌లకు కాంటాక్ట్స్‌ను యాడ్‌ చేయవచ్చు, అదే విధంగా తొలగించవచ్చని బ్లాగ్‌పోస్ట్‌లో గూగుల్ స్పష్టం చేసింది. టైపింగ్ ఇండికేటర్స్‌, డెలివరీ, రీడ్ రెసీప్ట్స్‌ వంటి ఫీచర్‌లను కలిగి ఉన్న SMS సూపర్‌ఛార్జ్డ్ వెర్షన్ RCSని ఉపయోగించమని తయారీదారులు. క్యారియర్‌లను గూగుల్ కంపెనీ కోరుతోంది. యాపిల్ తన సొంత సందేశాల యాప్ కోసం ఈ స్టాండర్డ్స్‌ను పాటించేలా ఒప్పించేందుకు ప్రచారాలను కూడా ప్రారంభించింది.

యాపిల్‌ అంగీకరిస్తుందని ఆశిస్తున్నాం:

Messages యాప్ గ్రూప్ ప్రొడక్ట్ మేనేజర్ నీనా బుద్ధిరాజా ఒక బ్లాగ్ పోస్ట్‌లో.. నేడు, అన్ని ప్రధాన మొబైల్ క్యారియర్‌లు, తయారీదారులు రిచ్ కమ్యూనికేషన్ సర్వీసెస్ (RCS)ను స్టాండర్డ్‌గా స్వీకరించినట్లు చెప్పారు. అయితే యాపిల్‌ అంగీకరించలేదన్నారు. RCSని స్వీకరించడానికి యాపిల్‌ ముందుకు రాలేదని, ప్రస్తుతం యాపిల్‌ వినియోగదారులు, ఆండ్రాయిడ్‌ ఫోన్‌లు వినియోగిస్తున్న వారికి మెసేజ్‌ పంపినప్పుడు SMSపై ఆధారపడాలని, అంటే వారి టెక్స్టింగ్ 1990లలో చిక్కుకుపోయిందని అన్నారు. అప్పటి సెక్యూరిటీ ఫీచర్‌లు, ఆప్షన్‌లనే ఆధారంగానే మెసేజ్‌లు పని చేస్తాయని తెలిపారు. యాపిల్‌ కంపెనీ నూతన RCSను స్వీకరిస్తుందని ఆశిస్తున్నామని చెప్పారు.

Also Read:  Mount Semeru: బద్ధలైన ‘మౌంట్‌ సెమేరు’. హెచ్చరికలు జారీ.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • End to end Encryption
  • google
  • Group Chats
  • messaging apps
  • technology

Related News

National Conference Under The Auspices Of The Central Election Commission Tomorrow

27 ఏళ్ల తర్వాత రేపే తొలిసారి .. కేంద్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో జాతీయ సదస్సు

గమనించదగిన విషయం ఏమిటంటే ఇలాంటి జాతీయ స్థాయి సమావేశం 27 సంవత్సరాల తర్వాత రాబోతున్నది. చివరిసారిగా ఈ సమావేశం 1999లో జరిగింది.

  • Google IO 2026

    గూగుల్ ఈవెంట్‌.. ముఖ్య‌మైన తేదీలు ఇవే!

  • Sundar Pichai

    ఏఐ సమ్మిట్‌లో కీలక ప్రసంగం.గూగుల్‌ సీఈఓ సుందర్‌ పిచాయ్‌

  • Youtube

    ఫిర్యాదులు రావడంతో సమస్యను పరిష్కరించామన్న యూట్యూబ్

Latest News

  • తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు

  • వెస్టిండీస్ మ్యాచ్‌ల ముందు జాతీయ గీతం ఎందుకు ప్లే చేయరు? అసలు కారణం ఇదే!

  • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

  • ఓటమిలోనూ చరిత్ర సృష్టించిన వరుణ్ చక్రవర్తి!

  • భారత రక్షణ రంగంలో కొత్త శకం.. ఇజ్రాయెల్ ‘ఐరన్ డోమ్’ సాంకేతికత భారత్ సొంతం కానుందా?

Trending News

    • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

    • టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

    • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

    • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

    • ఆకాశాన్నంటుతున్న బంగారం, వెండి ధరలు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd