Aadhar Card: ఇకపై వాట్సాప్ ద్వారా ఆధార్ పాన్ కార్డులు డౌన్లోడ్ చేసుకోవచ్చట.. అదెలా అంటే?
ముఖ్యమైన డాక్యుమెంట్స్ ను ఈజీగా మన స్మార్ట్ ఫోన్ లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చని చెబుతున్నారు.
- By Anshu Published Date - 12:00 PM, Sun - 11 August 24

ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డు, పాన్ కార్డుల వినియోగం ఎలా ఉందో మనందరికీ తెలిసిందే. ప్రభుత్వ ప్రైవేటు పనులు అలాగే చాలా రకాల పనులకు ఈ రోజుల్లో ఆధార్ కార్డు అలాగే పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. ఇంకా చెప్పాలంటే ఈ రెండు ప్రస్తుత రోజుల్లో ముఖ్యమైన డాక్యుమెంట్లుగా మారిపోయాయి. అలాంటి ఆధార్ కార్డు పాన్ కార్డులో మన దగ్గర లేకపోయినా, పోగొట్టుకుపోయిన వెంటనే ఇంటర్నెట్ సెంటర్లకు పరుగులు తీస్తూ ఉంటారు. ఇక చేసేదేమీ లేక అక్కడ వారు ఎంత అడిగితే అంత డబ్బులు ఇచ్చి ఆధార్ కార్డు పాన్ కార్డులను డౌన్లోడ్ చేసుకుంటూ ఉంటారు. కానీ ఇక మీదట ఆ అవసరం లేదు అంటున్నారు నిపుణులు.
ఎందుకంటే ఇకపై ఇలాంటి ముఖ్యమైన డాక్యుమెంట్స్ ను ఈజీగా మన స్మార్ట్ ఫోన్ లోనే డౌన్లోడ్ చేసుకోవచ్చని చెబుతున్నారు. మరి అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. సాధారణంగా ఆధార్, పాన్ కార్డులను మనతోనే ఉంచుకుంటాం. ఒక్కోసారి మార్చిపోతే వెంటనే నెట్ సెంటర్లకు వెళ్లి డౌన్ లోడ్ చేయించుకుంటాం. ఈ పద్ధతి అందరికీ తెలిసిందే. కానీ మన వాట్సాప్ నుంచి ఈ రెండు పత్రాలను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. అది కూడా ప్రభుత్వం నిబంధనల ప్రకారం చాలా సులువుగా ఈ పని పూర్తి చేయవచ్చు. కాగా ఈ సేవలను పొందటానికి ముందుగా మీ మొబైల్‌లో మై గవర్నమెంట్ వాట్సాప్ హెల్ప్‌లైన్ నంబర్‌ను సేవ్ చేయాలి. దాని కోసం ఫోన్ డయలర్ అప్లికేషన్‌కి వెళ్లి 9013151515 నంబర్‌ను మై గవర్నమెంట్ లేదా డిజిలాకర్ గా నమోదు చేయాలి.
ఆ తర్వాత మీ వాట్యాప్ లో ఆ నంబర్ కనిపిస్తుంది. సేవ్ చేసిన నంబర్ కు హాయ్ అని టైప్ చేసి సెండ్ చేయాలి. నమస్తే అంటూ మీకు ఆటోమేటిక్ సందేశం వస్తుంది. దాని చివరిలో రెండు రకాల సేవల పేర్లు కనిపిస్తాయి. అవి కోవిన్ సేవలు, డిజిలాకర్ సేవలు అని ఉంటాయి. వాటిలో డిజిలాకర్ సేవలను ఎంచుకోవాలి. అనంతరం మీకు డిజిలాకర్ ఖాతా ఉందా? అనే ప్రశ్న వస్తుంది. ఉంటే అవును, లేకపోతే కాదు అనే ఆప్షన్ ను ఎంచుకోవాలి. మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఓటీపీ పంపిస్తారు. ముందుగా మీ 12 అంకెల ఆధార్ నంబర్‌ను దానిలో నమోదు చేయాలి. మీకు డిజిలాకర్ ఖాతా ఉన్నప్పటికీ మీరు ఈ దశలను అనుసరించాలి.
మీ మొబైల్ నంబర్‌కు వచ్చిన ఓటీపీని దానిలో ఎంటర్ చేయాలి. ఆ తర్వాత డిజిలాకర్ లో సేవ్ చేసిన డాక్యుమెంట్లను చాలా సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, మార్క్ షీట్, లైసెన్స్ మొదలైన అన్ని పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డిజిలాకర్ అనేది అధికారిక ప్రభుత్వ వాట్సాప్ చాట్ యాప్. కాబట్టి దాని భద్రత గురించి ఆందోళన చెందనవసరం లేదు. డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ భారతీయ పౌరులకు ఇటువంటి ఫీచర్లను అందిస్తున్నారు. కాబట్టి పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేసే వెబ్‌సైట్ లకు వెళ్లి లాగిన్ చేసి డౌన్‌లోడ్ చేసుకునే బదులు నాలుగైదు క్లిక్ లతో సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చట.