Pan Card: కేవలం రెండు గంటల్లోనే డిజిటల్ పాన్ కార్డు.. అదెలా అంటే.?
కేవలం రెండే రెండు గంటల్లో డిజిటల్ పాన్ కార్డును పొందవచ్చని నిపుణులు చెబుతున్నారు.
- By Anshu Published Date - 11:30 AM, Fri - 23 August 24

ప్రస్తుత రోజుల్లో ఆర్థిక కార్యకలాపాలు జరగాలి అంటే పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాల్సిందే. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలన్నా లేదంటే ఏదైనా లోన్ తీసుకోవాలన్న ఇలా ప్రతి ఒక్క దానికి పాన్ కార్డు తప్పనిసరి. అలా ఈ రోజుల్లో పాన్ కార్డు ఒక ముఖ్యమైన డాక్యుమెంట్ గా మారిపోయింది. అయితే మామూలుగా పాన్ కార్డును అప్లై చేసుకుంటే రావడానికి కొన్నిసార్లు వారం లేదా నెలరోజులు కూడా సమయం పడుతూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు ఎమర్జెన్సీగా కావాలి అన్నప్పుడు చాలా ఇబ్బందులు పడాల్సి వస్తూ ఉంటుంది. కానీ ఇప్పుడు మనం తెలుసుకునే డిజిటల్ పాన్ కార్డు మనకు అత్యవసర పరిస్థితులలో పాన్ కార్డు లేకపోయినప్పటికీ ఇది బాగా ఉపయోగపడుతుందని చెబుతున్నారు.
ఈ డిజిటల్ పాన్ కార్డు కోసం పెద్దగా వేచి చూడాల్సిన పని లేదట. కేవలం రెండు గంటల్లోనే డిజిటల్ పాన్ కార్డు పొందవచ్చని చెబుతున్నారు. అది ఎలాగో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అయితే ఇందుకోసం మొదట మొదట ఇ-ఫైలింగ్ పోర్టల్ హోమ్ పేజీకి వెళ్లి ఇన్‌స్టంట్ ఇ-పాన్ ఆప్షన్ కోసం సెర్చ్ చేయాలి. తర్వాత ఇ-పాన్ పేజీలోకి వెళ్లి కొత్త ఇ-పాన్ బటన్‌పై క్లిక్ చేయాలి. ఇప్పుడు కొత్త ఇ-పాన్ పొందేందుకు పేజీలో మీ 12 అంకెల ఆధార్ నంబర్ ను ఎంటర్ చేయాలి. దీని తర్వాత చెక్‌బాక్స్ ను టిక్ చేసి, ఆపై కంటిన్యూ పై క్లిక్ చేయాలి. తర్వాత ఓటీపీ ఆథంటిఫికేషన్ పేజీలో నిబంధనలు షరతులను అంగీకరించి, మీకు కావాల్సిన ఆప్షన్ సెలక్ట్ చేసుకుని, ఆపై కంటిన్యూపై క్లిక్ చేయాలి.
ఓటీపీ ఆథంటిఫికేషన్ పేజీలో మీరు 6 అంకెల ఓటీపీ ని ఎంటర్ చేయాలి. ఈ ఓటీపీ మీ ఆధార్ నంబర్ తో లింక్ అయి ఉన్న మొబైల్ నంబర్‌కు వస్తుంది. ఇప్పుడు UIDAIతో మీ ఆధార్ వివరాలను గుర్తించడానికి చేక్‌బాక్స్ ని సెలక్ట్ చేసుకుని అందులో కంటిన్యూ ఆప్షన్ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ ఆధార్ వివరాలను కన్ఫామ్ చేసుకొని, నిబంధనలు శరతులు అన్నింటికీ ఒకే చెబుతూ చెక్ బాక్స్ పై మరొకసారి టిక్ చేయాలి. ఆ తర్వాత కంటిన్యూ పై క్లిక్ చేయాలి. ఇలా కావాల్సిన వివరాలన్నింటిని ఎంటర్ చేసిన తర్వాత మీరు స్క్రీన్‌పై కన్ఫర్మ్ మెసేజ్ వస్తుంది. ఈ సందేశంలో రసీదు సంఖ్య కూడా ఉంటుంది. ఈ నంబర్‌తో మీరు భవిష్యత్తులో ఇ-పాన్ స్టేటస్ ను చెక్ చేసుకోవచ్చు. ఈ విధంగా రెండే రెండు గంటల్లో డిజిటల్ పాన్ కార్డును సొంతం చేసుకోవచ్చు..