Free Data Offers: బంపర్ ఆఫర్.. ఉచితంగా 75GB డేటా పొందండి.. ఎలాగంటే?
భారతదేశంలోనే మూడవ అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన వోడాఫోన్ ఐడియా ఫ్రీ పెయిడ్ కస్టమర్ల కోసం 75 జిబి
- By Anshu Published Date - 08:15 PM, Sat - 20 August 22

భారతదేశంలోనే మూడవ అతిపెద్ద టెలికాం కంపెనీ అయిన వోడాఫోన్ఐడియా (VI) ఫ్రీ పెయిడ్ కస్టమర్ల కోసం 75GB అదనపు డేటాను అందిస్తోంది. వోడాఫోన్ కంపెనీ ఈ ఆఫర్ ద్వారా కస్టమర్లను ఆకర్షించాలి అనుకుంటోందట. కాగా వోడాఫోన్ ఈ ఆఫర్ రెండు ప్రీ పెయిడ్ ప్లాన్లతో అందుబాటులో ఉంది. ఈ ప్లాన్‌తో ప్రతిరోజూ 1.5GB డేటా ను ఉపయోగించుకోవచ్చు. వోడాఫోన్ఐడియా ఈ రెండు ప్లాన్ లతో 75GB వరకు అదనపు డేటా అందుబాటులో ఉంటుంది. అయితే వోడాఫోన్ఐడియా కొత్త ప్లాన్‌లను ప్రారంభించలేదు.
కానీ రెండు పాత ప్లాన్‌లతో 75GB డేటా ఇవ్వనున్నట్లు ప్రకటించింది. రూ. 1,449, రూ. 2,889 గా ఉన్నాయి. అయితే రూ. 1,449 ప్లాన్‌తో 180 రోజుల చెల్లుబాటు లభిస్తుంది. అంతేకాకుండా ఈ ప్లాన్‌తో అన్ని నెట్‌వర్క్‌లకు ఆన్ లిమిటెడ్ కాలింగ్‌తో ప్రతిరోజూ 1.5GB డేటా అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్‌తో ప్రతి రోజు 100 SMS లు కూడా చేసుకోవచ్చు. ఈ ప్లాన్‌తో 50GB అదనపు డేటా ఇవ్వడమే కాకుండా ఇది పూర్తిగా ఉచితం.
ఇక రెండవ రూ. 2,889 ప్రీ పెయిడ్ ప్లాన్ వల్ల రోజుకు 100 SMS లు, ఆన్ లిమిటెడ్ కాలింగ్, రోజుకు 1.5GB డేటా అందుబాటులో ఉంటుంది. ఈ ప్లాన్ 365 రోజుల వ్యాలిడిటీ ఇస్తుంది. దీనితో 75GB అదనపు డేటా లభిస్తుంది. 2022 స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వోడాఫోన్ఐడియా ఈ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది.