HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Technology
  • >China Tests Magnet Powered Floating Car

Magnet Car: అయస్కాంత శక్తితో నడిచే కారు.. గంటకు 230కి.మీ వేగంతో?

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న విషయం తెలిసిందే. ఇతర దేశాలతో పోల్చుకుంటే చైనా

  • Author : Anshu Date : 12-12-2022 - 7:30 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Magnet Car
Magnet Car

ప్రపంచవ్యాప్తంగా టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతున్న విషయం తెలిసిందే. ఇతర దేశాలతో పోల్చుకుంటే చైనా టెక్నాలజీతో అటు ప్రపంచాన్ని అలాగే ప్రజలను పరుగులు పెట్టిస్తోంది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్రయోగాలను చేస్తూ వాటిలో సక్సెస్ను సాధిస్తూ టెక్నాలజీ విషయంలో ముందడుగుగా దూసుకుపోతోంది చైనా. ఈ నేపథ్యంలోనే తాజాగా మరొక వండర్ను కూడా క్రియేట్ చేయడానికి సిద్ధమయ్యింది. అయితే ఇప్పటికే మార్కెట్లోకి ఇంజన్ తో నడిచే కార్లు అలాగే ఎలక్ట్రిక్ కార్లు విడుదలైన విషయం తెలిసిందే. వీటితో పాటుగా తాజాగా మరొక కొత్త కార్ ను కూడా మార్కెట్ లోకి విడుదల చేసింది చైనా సంస్థ.

అయితే ఈసారి ఏకంగా మ్యాగ్నెటిక్ కారుని తయారు చేసింది. తాజాగా ఈ మ్యాగ్నెటిక్ కారు టెస్ట్‌ డ్రైవ్‌ ను కూడా ఇప్పటికే పూర్తి చేసింది. దానికి అధునాతన టెక్నాలజీ జోడించి ఆ కారు ని మార్కెట్లోకి విడుదల చేయనుంది. అయితే చైనా గత ఏడాది విద్యుత్‌ అయస్కాంత శక్తితో నడిచే రైలును కనుగొన్న విషయం తెలిసిందే. ఈ టెక్నాలజీని మాగ్లెవ్‌ అని పిలుస్తారు. గంటకు 600 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే మాగ్లెవ్‌ ట్రైన్‌ భూమ్మీద ప్రయణించే అత్యంత వేగవంతమైన రైలు గా నిలిచింది. మాగ్నెటిక్ ట్రైన్ బుల్లెట్ రైలు కంటే మరింత వేగంగా దూసుకెళ్లగలదు. కాగా ప్రస్తుతం చైనా అదే టెక్నాలజీతో చైనా కారును సిద్ధం చేసింది. 2.8 టన్నుల బరువున్న ఈ కారు టెస్ట్‌ డ్రైవ్‌లో గంటకు 230 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లింది.

జియాంగ్‌ ప్రావిన్స్‌ హైవే పై ఈ డ్రైవ్‌ టెస్ట్ ను నిర్వహించారు. దాదాపు 8 కిలోమీటర్ల మేర ఈ కారును టెస్ట్‌ చేశారు. అయితే ఈ కారు గ్రౌండ్‌ను టచ్‌ చేయకుండా ప్రయాణిస్తాయి. ఎందుకంటే ఇవి విద్యుత్‌ అయస్కాంత శక్తి ఆధారంగా నడుస్తాయి. ఇటీవల పరీక్షించిన మాగ్లెవ్ కారు కూడా గ్రౌండ్‌కు 35 మిల్లిమీటర్ల గ్యాప్‌తో ప్రయాణిస్తుంది. అయితే ఈ టెక్నాలజీతో తయారు చేసిన వాహనాలకు సాధారణ రోడ్లపై ప్రయాణించలేవు. ప్రత్యేకంగా నిర్మించిన విద్యుత్‌ అయస్కాంత ట్రాక్లపై మాత్రమే నడుస్తాయి. ఇప్పుడు మాగ్లెవ్‌ కారుకి కూడా ఈ ఫార్ములానే అనుసరించాలి. లేదంటే ఈ కార్ల నిర్వహణ అంత తేలికైన పని కాదు. భారీ మొత్తంలో నిధులు అవసరమవుతుంటాయి. రోడ్లను పూర్తిగా మార్చాల్సి ఉంటుంది. అయితే ట్రాఫిక్‌ ఎక్కువ ఉన్న ప్రాంతాలలో వీటిని తీసుకురావడానికి చైనా ఆలోచన చేస్తోందట.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • china
  • Magnet Car
  • magnet powered floating car

Related News

Taiwan says 26 Chinese military aircraft and several naval

China vs Taiwan : తైవాన్ సమీపంలో భారీగా యుద్ధ విమానాలను మోహరిస్తోన్న చైనా

China vs Taiwan  తైవాన్ జలసంధిలో గత రెండు వారాలకు పైగా కొనసాగిన అసాధారణ నిశ్శబ్దానికి తెరపడింది. చైనా తన సైనిక విమానాలు, నౌకలతో మరోసారి కవ్వింపు చర్యలకు దిగింది. గడిచిన 24 గంటల్లో తమ ద్వీపం చుట్టూ 26 చైనా సైనిక విమానాలు, 7 నౌకలు సంచరించినట్లు తైవాన్ రక్షణ మంత్రిత్వ శాఖ ఆదివారం ఉదయం వెల్లడించింది. వీటిలో 16 విమానాలు తమ వాయు రక్షణ గుర్తింపు జోన్ (ADIZ)లోని ఉత్తర, మధ్య, నైరుతి ప్రాంతాల్లోకి [&he

    Latest News

    • Uttam : రబీ ధాన్యం సేకరణపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష

    • Physics Wala : ఆంధ్రప్రదేశ్‌లో తొలి టెక్-ఎనేబుల్డ్ విద్యాపీఠ్ ప్రారంభం

    • Yezdi : యెజ్డీ రోడ్ స్టర్‌కు ‘బైక్ డిజైన్ ఆఫ్ ద ఇయర్’ పురస్కారం

    • CIL : అరుదైన గౌరవం దక్కించుకున్న కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్

    • ప్ర‌తిరోజూ హాయిగా నిద్ర‌పోవాలంటే?!

    Trending News

      • పంజాబ్ కింగ్స్‌కు ఆందోళ‌న‌గా మారిన స్టార్ ప్లేయ‌ర్స్‌?!

      • ఐపీఎల్‌కు ముందు సూర్య‌వంశీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న‌!

      • ఉగాది పండుగ ఎప్పుడు? ఆ రోజు ఏం చేయాలి?!

      • మళ్ళీ లేఆఫ్స్ కలకలం.. 16,000 మంది ఉద్యోగులపై వేటు?!

      • వినియోగ‌దారుల‌కు అల‌ర్ట్‌.. బ్యాంకుల‌కు వ‌రుస‌గా సెల‌వులు!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd