Amazon Layoffs: అమెజాన్ లో ఉద్యోగుల తొలగింపు షురూ..10వేలమందిని తొలగించినట్లు సీఈవో వెల్లడి..!!
- By hashtagu Published Date - 09:07 AM, Fri - 18 November 22
ప్రముఖ గ్లోబల్ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలికే పనులను స్పీడప్ చేశాయి. ఈ కామర్స్ కంపెనీ అమెజాన్ కూడా ఉద్యోగులను తగ్గించే ప్రయత్నంలో ఉంది. భారీగా లేఆఫ్స్ ప్రకటిస్తూ ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది. తమ రిటైల్, డివైజెస్, హ్యుమన్ రిపోర్స్ విభాగాల్లో పనిచేస్తున్న కొంతమంది ఉద్యోగులను తొలగిస్తున్నట్లు ఆ కంపెనీ సీఈవో ప్రకటించారు.
ఈప్రక్రియలో బాగంగా పలు విభాగాల్లో సుమారు 10వేల మందిని ఉద్యోగులకను తొలగిస్తున్నట్లు కంపెనీ ప్రకటించింది. ఇప్పటికే ట్విట్టర్, మెటాతోపాటు కొన్ని సంస్థలు ఉద్యోగులను తొలగించింది. ఇప్పుడు అదే బాటలో అమెజాన్ కూడా పయనిస్తోంది. అనిశ్చితితో కూడిన ఆర్థిక పరిస్థితుల వల్లే ఉద్యోగులను తొలగించడం తప్పలేదంటూ అమెజాన్ పేర్కొంది. తొలగించాలనుకున్న ఉద్యోగులకు ఈమెయిల్ ద్వారా సందేశం పంపించినట్లు వెల్లడించింది.
వార్షిక ప్రణాళిక ప్రక్రియ కొత్త ఏడాది వరకు విస్తరించింది. అంటే రానున్న ఏడాది 2023 వరకు ఉద్యోగుల తొలగింపు ప్రక్రియ సాగుతుందని కంపెనీ సీఈవో ఆండి జాస్సీ తెలిపారు. ఈ కామర్స్, క్లౌడ్ కంప్యూటింగ్, ఆన్ లైన్ అడ్వర్టయిజింగ్ ,డిజిటల్ స్ట్రీమింగ్ విభాగాల్లో ఉద్యోగుల కోత విధిస్తున్నట్లు ప్రకటించింది అమెజాన్.
Related News
Akhil Akkineni : అయ్యగారు వచ్చి ఏడాది.. ఇంకా ఓటీటీలోకి రాని ఏజెంట్
తెలుగు చిత్ర పరిశ్రమలో విశిష్టమైన అక్కినేని కుటుంబానికి చెందిన వారసుడు అఖిల్ అక్కినేని ఎంతగానో ఎదురుచూసిన ' ఏజెంట్ ' చిత్రంలో నటించడంతో ఎన్నో ఆశలతో ప్రయాణం ప్రారంభించాడు .