EMI Offer: ప్రతిరోజు కేవలం రూ.53 చెల్లించి రూ.33 వేల ఫోన్ సొంతం చేసుకోండిలా?
ప్రముఖ ఒప్పో స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి పలు రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇటివలే
- By Nakshatra Published Date - 07:30 PM, Fri - 28 July 23
ప్రముఖ ఒప్పో స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ ఇప్పటికే మార్కెట్లోకి పలు రకాల స్మార్ట్ ఫోన్ లను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే ఇటివలే ఒప్పో రెనో 10 సిరీస్‌లో మూడు స్మార్ట్‌ఫోన్స్ లాంఛ్ అయిన సంగతి తెలిసిందే. వాటిలో ఇప్పటికే ఒప్పో రెనో 10 ప్రో, ఒప్పో రెనో 10 ప్రో ప్లస్ ఫోన్స్ సేల్స్ కూడా ప్రారంభం అయ్యాయి. కాస్త ఆలస్యంగా ఒప్పో రెనో 10 అందుబాటులోకి వచ్చింది. ఇప్పటికే ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో రెనో 10 సేల్ కూడా ప్రారంభమైంది. కాగా ఈ ఒప్పో రెనో 10 మొబైల్లో మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్, 5,000ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యాన్ని కూడా కలిగి ఉండనుంది. 67వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
ఈ మొబైల్ ఒకే వేరియంట్లో లభిస్తుంది. 8జీబీ ర్యామ్ 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.32,999 గా ఉంది. ఈ ఫోన్ మనకు ఐసీ బ్లూ, సిల్వరీ గ్రే ఇలాంటి రెండు కలర్స్ లో లభించునుంది. ఫ్లిప్‌కార్ట్‌లో బ్యాంక్ ఆఫర్స్ అందుబాటులో ఉన్నాయి. బ్యాంకు కార్డులపై రూ.3,000 తగ్గింపు పొందవచ్చు. ఇక రూ.4,999 విలువైన ఒప్పో ఎన్కో ఎయిర్ 3 ప్రో మొబైల్‌ను కేవలం రూ.4,499 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ మొబైల్‌పై నోకాస్ట్ ఈఎంఐ ఆఫర్ కూడా అందుబాటులో ఉంది. నోకాస్ట్ ఈఎంఐ రూ.5,500 నుంచి అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఒప్పో రెనో 10 మొబైల్‌పై స్టాండర్డ్ ఈఎంఐ ఆఫర్ కూడా ఉంది. 24 నెలల ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే మీరు నెలకు చెల్లించాల్సింది రూ.1,585 మాత్రమే.
అంటే రోజుకు రూ.53 చెల్లించి రూ.33 వేల మొబైల్ సొంతం చేసుకోవచ్చు. స్టాండర్డ్ ఈఎంఐ ఆప్షన్ ఎంచుకుంటే వడ్డీ కూడా చెల్లించాల్సి వస్తుంది. ఇకపోతే ఒప్పో రెనో 10 డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్.. ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.67 అంగుళాల అమొలెడ్ డిస్ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 7050 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 13 కలర్ ఓఎస్ 13.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఇందులో 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 67వాట్ సూపర్‌వూక్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. కేవలం 47 నిమిషాల్లో 0 నుంచి 100 శాతం వరకు ఛార్జింగ్ చేయొచ్చు. ఒప్పో రెనో 10 కెమెరా ఫీచర్స్ చూస్తే ఆటోఫోకస్, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్‌తో 64మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా 32మెగాపిక్సెల్ టెలీఫోటో సెన్సార్ 8మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది.
రియర్ కెమెరాలో ఫోటోస్, వీడియోస్, నైట్ ఫోటోస్, పోర్ట్రెయిట్స్, ప్రొఫెషనల్ ఫోటోస్, పనోరమా, సూపర్ టెక్స్ట్, గూగుల్ లెన్స్, బ్యూటీ షాట్స్, డ్యూయల్-వ్యూ వీడియో, అల్ట్రా-క్లియర్ ఇమేజ్ క్వాలిటీ, హై పిక్సెల్ మోడ్, టైమ్-లాప్స్ ఫోటోగ్రఫీ, స్లో మోషన్ లాంటి ఫీచర్స్ కూడా ఇందులో ఉన్నాయి. అలాగే ఒప్పో రెనో 10 మొబైల్లో సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరాలో ఫోటోస్, వీడియోస్, పనోరమా ఫోటోస్, పోర్ట్రెయిట్స్, నైట్ ఫోటోస్, పోర్ట్రెయిట్ రీటచింగ్, స్క్రీన్ ఫిల్ ఫ్లాష్, క్యూట్ షాట్స్, టైమ్-లాప్స్ ఫోటోగ్రఫీ, డ్యూయల్ వ్యూ వీడియోస్ లాంటి ఫీచర్స్ ను అందించారు..
Related News
Smart phone : స్మార్ట్ ఫోన్ యూజర్లకు కేంద్రం హెచ్చరిక
Indian Computer: ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (సీఈఆర్టీ–ఇన్) దేశంలోని స్మార్ట్ ఫోన్ యూజర్లకు హెచ్చరికలు జారీ చేసింది. ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టంలోని లోపాల (ఫ్లాస్) కారణంగా మీ ఫోన్ హ్యాకింగ్ కు గురయ్యే ప్రమాదం ఉందని పేర్కొంది. ఈ లోపాలను ఆధారంగా చేసుకుని హ్యాకర్లు చాలా సులభంగా మీఫోన్ ను తమ కంట్రోల్ లోకి తీసుకోవచ్చని, ఫోన్ లోని మీ వ్యక్తిగత సమాచారాన్ని �