Independence Day Sale: వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్స్ పై బంపర్ ఆఫర్స్.. ఈ ఆఫర్ అప్పటి వరకు మాత్రమే!
స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా వన్ ప్లస్ సంస్థ కొన్ని స్మార్ట్ ఫోన్లపై భారీగా తగ్గింపు ధరలను ప్రకటించింది.
- By Anshu Published Date - 12:00 PM, Thu - 15 August 24

నేడు స్వాతంత్ర దినోత్సవం కావడంతో ఎక్కడ చూసినా కూడా అందుకు సంబంధించిన ఏర్పాట్లు జరుగుతుండడంతో పాటు ఎక్కడ చూసినా కూడా పండగ వాతావరణం నెలకొంది. కళాశాలలు పాఠశాలలో కార్యకలాపాలు ప్రవేట్ సంస్థల్లో ఎక్కడ చూసినా కూడా జెండాలను ఎగరవేసి పండుగని సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఇలాంటి సమయంలోనే కొన్ని స్మార్ట్ ఫోన్స్ సంస్థలు వినియోగదారులకు శుభవార్తను తెలుపుతూ స్మార్ట్ ఫోన్లపై భారీగా తగ్గింపు ధరలను ప్రకటిస్తున్నాయి. అందులో భాగంగానే పండగ వేళ ప్రజలకు వన్ ప్లస్ శుభవార్త తెలిపింది. వన్ ప్లస్ 12, ఓపెన్, నోర్డ్, మరికొన్నింటిపై తగ్గింపు ధరలను ప్రకటించింది.
జెండా పండగ సందర్బంగా సెల్ ఫోన్ల ను కొనుగోలు చేసుకుని సంతోషాన్ని రెట్టింపు చేసుకునే అవకాశం కల్పించింది. ఇటీవల విడుదల చేసిన వన్ ప్లస్ నోర్డ్ 4కు సంబంధించి బ్యాంకు కార్డులపై రూ.3 వేలు తగ్గింపు ప్రకటించింది. ఆగస్టు 31వ తేదీ వరకూ ఆఫర్ కొనసాగనుంది. కాగా స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా వన్ ప్లస్ కంపెనీ ప్రకటించిన డిస్కౌంట్లు ఆకట్టుకుంటున్నాయి. వాటితో పాటు ఆఫర్లు, నో కాస్ట్ ఈక్వేటెడ్ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ ప్లాన్లు అందుబాటులో ఉన్నాయి. ఎంపిక చేసిన బ్యాంక్ కార్డ్‌లపై దాదాపు రూ. 20 వేల వరకూ తగ్గింపు పొందవచ్చు. వన్ ప్లస్ నోర్డ్ 4, వన్ ప్లస్ ఓపెన్ ఫోల్డబుల్ స్మార్ట్‌ఫోన్, ఫ్లాగ్‌షిప్ వన్ ప్లస్ 12 సిరీస్ ఫోన్లు ఈ జాబితాలో ఉన్నాయి.
కాగా ఈ ఫోన్ పై వన్ ప్లస్ కంపెనీ ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఐసీఐసీఐ బ్యాంకు కార్డు, వన్ కార్డ్ కలిగిన ఖాతాదారులు 256 జీబీ స్టోరేజ్ వేరియంట్‌లపై రూ. 3 వేలు, 128 జీబీ స్టోరేజ్ వేరియంట్‌పై రూ. 2 వేల తగ్గింపును పొందవచ్చు. అలాగే వన్ ప్లస్.ఇన్, వన్ ప్లస్ ఎక్స్ పీరియన్స్ స్టోర్, ఇ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ అమెజాన్, ఎంపిక చేసిన ఆఫ్‌లైన్ స్టోర్‌లలో వన్ ప్లస్ నోర్డ్ 4 స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేసేటప్పుడు కంపెనీ 6 నెలల వరకు నో కాస్ట్ ఈఎంఐ ఎంపికలను అందిస్తోంది. ఈ ఫోన్ కు సంబంధించి 8 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజీ వేరియంట్ రూ.29 వేలు, 8జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ. 32,999 కాగా 12 జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ రూ.35,999 గా ఉంది.అలాగే ఐసీఐసీఐ బ్యాంకు ఖాతాదారులు, వన్ కార్డు వినియోగదారులకు రూ. 20 వేల తగ్గింపు లభిస్తుంది. ఆఫ్‌లైన్ స్టోర్‌ల కూడా ఎంచుకోవచ్చు. అదనంగా కంపెనీ ట్రేడ్ ఇన్ డీల్స్‌పై రూ.8 వేల వరకు ఎక్స్ఛేంజ్ బోనస్‌ను అందిస్తోంది. 12 నెలల వరకు నోకాస్ట్ ఈఎంఐ కోసం ఎంపికలు ఉన్నాయి. మరింత సమాచారం కోసం దగ్గరలో ఉన్న వన్ ప్లస్ షో రూమ్ ని సంప్రదించడం మంచిది.