Origin Pro: ఎక్కువ రేంజ్ కలిగిన సరికొత్త ఎలక్ట్రిక్ స్కూటర్.. ఫీచర్స్ మాములుగా లేవుగా?
ప్రస్తుత కాలంలో రోజురోజుకీ ఎలక్ట్రిక్ వాహనానికి ఉన్న క్రేజ్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే కొత్త
- By Nakshatra Published Date - 07:30 AM, Sun - 5 March 23

ప్రస్తుత కాలంలో రోజురోజుకీ ఎలక్ట్రిక్ వాహనానికి ఉన్న క్రేజ్ డిమాండ్ విపరీతంగా పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలోనే కొత్త కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్లు బైక్లు మార్కెట్లోకి విడుదల అవుతూనే ఉన్నాయి. ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనుగోలు చేయాలి అనుకుంటున్నా వారికి ఒక చక్కటి శుభవార్త. ఎందుకంటే ఇప్పటివరకు ఏ ఎలక్ట్రిక్ స్కూటర్ ఇవ్వని మైలేజ్ ని త్వరలోనే మార్కెట్లోకి రాబోతున్న కొత్త ఎలక్ట్రిక్ స్కూటర్ ఇవ్వనుంది. ఆ వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన ఈ బ్రిస్క్ ఈవీ అనేది ఎలక్ట్రిక్ స్కూటర్ మార్కెట్ లో సరికొత్త విప్లవాన్ని క్రియేట్ చేయడానికి రెడీ అవుతోంది.
ప్రస్తుతం ఈ కంపెనీ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను తయారు చేస్తోంది. ఆరిజిన్, ఆరిజిన్ ప్రో అనే రెండు ఎలక్ట్రిక్ స్కూటర్. హైదరాబాద్ ఇ మోటార్ షో కార్యక్రమంలో ఈ రెండు ఎలక్ట్రిక్ స్కూటర్లను వర్చువల్ రియాలిటీ ద్వారా ప్రదర్శించారు. బ్రిక్స్ ఎలక్ట్రిక్ స్కూటర్‌ను ఒక్కసారి చార్జ్ చేస్తే దాదాపుగా 330 కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు. కాగా దేశంలో ఎక్కువ రేంజ్ కలిగిన ఎలక్ట్రిక్ స్కూటర్ కూడా ఇదే కావడం గమనార్హం. ఓలా, ఏథర్, టీవీఎస్ వంటి ప్రముఖ కంపెనీలు కూడా బ్రిస్క్ ఈవీ అందిస్తున్న రేంజ్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లన అందించలేక పోయాయి. ఇకపోతే ఆరిజిన్ ప్రో ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే..
ఇది కేవలం 3.3 సెకన్లలోనే 0 నుంచి 40 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. టాప్ స్పీడ్ గంటకు 85 కిలోమీటర్లు. కంపెనీ ఇందులో 4.8 కేడబ్ల్యూహెచ్ ఫిక్స్‌డ్ బ్యాటరీ, 2.1 కేడబ్ల్యూహెచ్ స్వాపబుల్ బ్యాటరీని అమర్చింది. ఈ స్కూటర్‌లోని మోటార్ కెపాసిటీ 5.5 కేడబ్ల్యూగా ఉంది. ఇంకా ఇందులో ఓటీఏ బ్లూటూత్, మొబైల్ యాప్ కనెక్టివిటీ కూడా ఉంటుంది. ఇకపోతే ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర అందుబాటులో ఉండొచ్చని తెలుస్తోంది. దీని రేటు రూ. 1.2 లక్షల నుంచి రూ. 1.4 లక్షల ఉంటుందని అంచనా. ఆరిజిన్ ఎలక్ట్రిక్ స్కూటర్ విషయానికి వస్తే దీని రేంజ్ 175 కి.మి. అంటే ఒక్కసారి ఫుల్‌గా చార్జింగ్ పెడితే ఇది 175 కిలోమీటర్లు వెళ్లనుంది. ఇది కేవలం 5 సెకన్లలోనే 0 నుంచి 40 కి.మి వేగాన్ని అందుకుంటుంది. ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ధర దాదాపు రూ. 80 వేల దాకా ఉండొచ్చని తెలుస్తోంది. దీని టాప్ స్పీడ్ గంటకు 65 కిలోమీటర్లు.

Related News

Ukraine Rebuild Cost..?: ఉక్రెయిన్ ను మళ్ళీ నిర్మించాలంటే ఎంత అవుతుందో తెలుసా!
రష్యా దాడులతో ఉక్రెయిన్ 15 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయినట్టు మారిపోయింది .. 15 ఏళ్లుగా ఉక్రెయిన్ సాధించిన ఆర్థిక ప్రగతి పూర్తిగా దెబ్బతింది.