Manage Phone Storage: ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయ్యిందా.. అయితే ఈ చిట్కాలు పాటించండి?
రోజురోజుకీ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ ల వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. చిన్నపిల్లల
- By Nakshatra Published Date - 04:30 PM, Tue - 18 April 23
రోజురోజుకీ దేశవ్యాప్తంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా స్మార్ట్ ఫోన్ ల వినియోగం విపరీతంగా పెరిగిపోతోంది. చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరూ కూడా స్మార్ట్ ఫోన్ ని వినియోగిస్తున్నారు. అంతేకాకుండా గంటల తరబడి స్మార్ట్ ఫోన్లతోనే కాలక్షేపం చేస్తున్నారు. స్మార్ట్ ఫోన్ లోకి వినియోగం పెరిగిపోవడంతో చాలామంది స్మార్ట్ ఫోన్లో రక రకాల యాప్స్ ని ,వందల్ కొద్ది ఫొటోస్ వీడియోస్ ని పెట్టుకోవడం వల్ల స్టోరేజ్ ప్రాబ్లం తో ఇబ్బంది పడుతూ ఉంటారు. కొన్ని ముఖ్యమైన ఫోటోలు వీడియోలు ఉంటే వాటిని డిలీట్ చేయడం కుదరక చాలామంది ఫోన్ స్టోరేజ్ సమస్యలు ఉన్నా కూడా అలాగే మొబైల్ ఫోన్లో యూస్ చేస్తూ ఉంటారు.
ఫోన్ స్టోరేజ్ సమస్య వేదిస్తున్నప్పుడు ఏం చేయాలో చాలామందికి తెలియక తికమక పడుతూ ఉంటారు. మరి ఫోన్ స్టోరేజ్ ఫుల్ అయినప్పుడు ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. గూగుల్ ఫోటోస్ మీరు వినియోగించడానికి మీకు గూగుల్ అకౌంట్ ఉండాలి. ఆ తర్వాత మీరు గూగుల్ ఫోటోస్ యాప్ ని ప్లే స్టోర్ నుంచి మీ ఆండ్రాయిడ్ ఫోన్ లోకి డౌన్ లోడ్ చేసుకోవాలి. అలాగే మీ ఫోన్ లోని ఫోటోలు గూగుల్ ఫోటోస్ లోకి పంపాలంటే మీకు తప్పనిసరిగా మంచి ఇంటర్ నెట్ కనెక్షన్ కూడా ఉండాలి. మొదట మీ ఫోన్ నుంచి గూగుల్ ఫోటోస్ యాప్ ఓపెన్ చేసి సైన్ ఇన్ అవ్వాలి.
తరువాత స్క్రీన్ పై ఎడమచేతి వైపు మూలన మూడు గీతలపై టాప్ చేసి మెను ఓపెన్ చేయాలి. ఆ మెనులో నుంచి సెట్టింగ్స్ ను సెలెక్ట్ చేసుకోవాలి. సెట్టింగ్స్ లిస్ట్ నుంచి బ్యాక్ అప్ & sync ను క్లిక్ చేయాలి.. దానిని బ్యాక్ అప్ & sync ని టర్న్ ఆన్ చేయాలి. అప్పుడు ఫోన్ లోని ఫోటోలు, వీడియోలు క్లౌడ్ లో సేవ్ అవుతాయి. దీనిలో మీరు బ్యాక్ అప్ చేయాలనుకుంటున్న ఫోటోలు, వీడియోల క్వాలిటీని కూడా ఎంపిక చేసుకోవచ్చు. స్పేస్ ఎక్కువ వృథా కాకుండా కంప్రెస్ చేసి సేవ్ చేసుకొనే ఆప్షన్ కూడా ఉంటుంది. అలాగే ఒరిజినల్ క్వాలిటీ తో కూడా గూగుల్ డ్రైవ్ లో స్టోర్ చేస్తుంది. ఒకసారి మీరు ఫోటోలు, వీడియోలు బ్యాక్ అయిన తర్వాత మీరు ఫోన్ స్టోరేజ్ మొత్తాన్ని ఫ్రీ చేసుకోవచ్చు. గూగుల్ ఫోటోస్ యాప్ లో సెట్టింగ్స్ లోకి వెళ్లి ఫ్రీ అప్ డివైజ్ స్టోరేజ్ పై క్లిక్ చేయాలి. అప్పుడు ఆటోమేటిక్ గా బ్యాక్ అప్ అయిన ఫోటోలు వీడియోలో ఫోన్ స్టోరేజీ నుంచి డిలీట్ అవుతాయి. ఈ విధంగా ఫోన్ స్టోరేజీ సమస్యను క్లియర్ చేసుకోవచ్చు.