Apple Watch Saves Life: గుండెపోటు నుంచి అలర్ట్ చేసింది.. ప్రాణాలు నిలిపింది.. యాపిల్ స్మార్ట్ వాచా..మజాకా!!
యాపిల్ స్మార్ట్ వాచ్.. అతడిని గుండెపోటు నుంచి కాపాడింది. వాచ్ లోని హార్ట్ సెన్సర్ గుండెల్లో జరుగుతున్న గడబిడను గుర్తించింది.
- By Hashtag U Published Date - 09:34 AM, Sun - 4 September 22
యాపిల్ స్మార్ట్ వాచ్.. అతడిని గుండెపోటు నుంచి కాపాడింది. వాచ్ లోని హార్ట్ సెన్సర్ గుండెల్లో జరుగుతున్న గడబిడను గుర్తించింది. గుండె కొట్టుకునే రేటులో సంభవించిన భారీ హెచ్చుతగ్గులపై వార్నింగ్ అలర్ట్స్ ఇచ్చింది. దీంతో అతడు అప్రమత్తమై సకాలంలో ట్రీట్మెంట్ చేయించుకొని ప్రాణాలను రక్షించుకున్నాడు. ఈ వింత అనుభవం బ్రిటన్ కు చెందిన డేవిడ్ లాస్ట్ (54) కు ఎదురైంది. 48 గంటల్లో దాదాపు 3000 సార్లు కొట్టుకోవాల్సిన గుండె.. కేవలం 2885 సార్లే కొట్టుకుంది. ఈ విషయాన్ని యాపిల్ స్మార్ట్ వాచ్ లోని హార్ట్ సెన్సర్ గుర్తించింది.
ఒక నిమిషానికి గుండె కనిష్టంగా 30 సార్లే కొట్టుకుంటోందని వార్నింగ్ బెల్ మోగించింది. ఈ అలర్ట్ తో మేల్కొన్న డేవిడ్ లాస్ట్ వెంటనే డాక్టర్స్ దగ్గరికి వెళ్లారు. ఈసీజీ, ఎమ్మారై చేయించుకోగా.. పెద్దఎత్తున హార్ట్ బ్లాకేజ్ ఉందని వెల్లడైంది. దీంతో వెంటనే పేస్ మేకర్ ను అమర్చి గుండె కొట్టుకునే రేటును అదుపులోకి తెచ్చారు. ఇలా డేవిడ్ లాస్ట్ మృత్యుంజయుడు అయ్యాడు. అన్నట్టు.. ఈ స్మార్ట్ వాచ్ ని గత ఏప్రిల్ లో బర్త్ డే సందర్భంగా భార్య తనకు గిఫ్ట్ గా ఇచ్చిందని డేవిడ్ లాస్ట్ గుర్తుకు తెచ్చుకున్నాడు.
పల్స్‌లను చెక్ చేస్తుంది..
2018లోనే యాపిల్ వాచ్‌లో ఈసీజీ యాప్‌ను అందించారు. ఎలక్ట్రో కార్డియోగ్రామ్ అనేది గుండె లయ, ఎలక్ట్రికల్ యాక్టివిటీస్ చెక్ చేయడంలో ఉపయోగపడుతుంది. మీ గుండెలోని ఎగువ, దిగువ గదులు లయలో ఉన్నాయో లేదో చూడటానికి ఈసీజీ యాప్ ఈ పల్స్‌లను చెక్ చేస్తుంది. తద్వారా హృదయ స్పందన రేటును తెలియజేస్తుంది. ఒకవేళ గుండె లయ తప్పినట్లు ఈసీజీ యాప్ గుర్తిస్తే.. మీరు వెంటనే డాక్టర్ ను ఆశ్రయించాల్సి ఉంటుంది. యాపిల్ వాచ్ 7 త్వరిత గతిన రిప్లై ఇచ్చేందుకు వీలుగా యాపిల్ వాచ్ 7 ఆన్-స్క్రీన్ కీబోర్డ్‌తో వస్తుంది. ఈ వాచ్ సాయంతో యూజర్లు లేచి ఉన్నప్పుడు, నిద్రించేటప్పుడు కూడా ఆక్సిజన్ స్థాయిలను తెలుసుకోవచ్చు. ఈ యాపిల్ వాచ్‌లో ఈసీజీ సెన్సార్ కూడా ఉంది. దీని ధర రూ.41,900 నుంచి ప్రారంభమవుతుంది.
Related News
Optical Illussion : చిత్రంలో విచిత్రం.. మెదడుకు పదును పెట్టు.. పాము ఎక్కడుందో కనిపెట్టు..!
ప్రస్తుతం సోషల్ మీడియా వినోదానికి, విజ్ఞానానికి వేదికగా మారుతోంది. మీ కంటి చూపు, మెదడుకు పదును పెట్టే ఆప్టికల్ ఇల్యూషన్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.