Meta AI Assistant : వాట్సాప్, ఇన్స్టాలలో ఏఐ అసిస్టెంట్.. ఎలా పనిచేస్తుందో తెలుసా ?
Meta AI Assistant : వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ల పేరెంట్ ఆర్గనైజేషన్ ‘మెటా’ ఈ మూడు యాప్‌లలో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది.
- By Pasha Published Date - 12:47 PM, Sat - 20 April 24
Meta AI Assistant : వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌ల పేరెంట్ ఆర్గనైజేషన్ ‘మెటా’ ఈ మూడు యాప్‌లలో సరికొత్త ఫీచర్‌ను తీసుకొచ్చే దిశగా అడుగులు వేస్తోంది. దానిపై మెటా ‘ఏఐ అసిస్టెంట్’ !! అచ్చం ఛాట్ జీపీటీలాగే ఇది కూడా ఏ ప్రశ్నకైనా చిటికెలో సమాధానం ఇచ్చేస్తుంది. రియల్‌టైమ్ ఇమేజ్‌లను, యానిమేషన్స్ను రూపొందించి ఇస్తుంది. ప్రస్తుతానికి ఈ ఫీచర్ కొంతమంది యూజర్లకే అందుబాటులో ఉంది.
We’re now on WhatsApp. Click to Join
మన దేశంలోనూ కొందరు యూజర్లకు ఈ నయా ఏఐ ఫీచర్ దర్శనమిస్తోంది. త్వరలోనే అందరికీ అందుబాటులోకి వచ్చే ఛాన్స్ ఉంది. వాట్సప్ ఛాట్ మెనూలో వివిధ రంగులతో కూడిన వృత్తాకారంలో మెటా ఏఐ ఐకాన్ కనిపిస్తోంది. దీనిపై క్లిక్ చేస్తే ‘ఆస్క్ మెటా ఏఐ ఎనీథింగ్’ అంటూ ఓ పాప్ అప్ ఓపెన్ అవుతుంది. కంటిన్యూపై క్లిక్ చేస్తే, మెటా ఏఐతో చాట్ మెనూ ఓపెన్ అవుతుంది. ఈ ఛాట్ మెనూలో మీరు అడిగిన ప్రశ్నలు అన్నింటికీ ఏఐ సమాధానం ఇస్తుంది.
Also Read : Chandrababu Birthday : చంద్రబాబు బర్త్‌డే.. విద్యార్థి నేత నుంచి సీఎం దాకా స్ఫూర్తిదాయక ప్రస్థానం
ఏఐ అసిస్టెంట్ ఇలా పనిచేస్తుంది..
- మెటా ఏఐ అసిస్టెంట్(Meta AI Assistant) లాలామా 3 లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఆధారంగా పని చేస్తుంది.
- మనం టెక్ట్స్ రూపంలో కమాండ్ ఇవ్వగానే మెటా ఏఐ ఇమేజ్ జనరేట్ చేస్తుంది.
- ఈ ఇమేజ్‌తో మనం క్వాలిటీ మిస్ కాకుండా ఫొటోలను యానిమేట్ చేసుకోవచ్చు.
- వెబ్‌లో కూడా meta.ai సేవలను మనం వాడుకోవచ్చు.
- మనం ఊహించుకున్న చిత్రాన్ని టెక్ట్స్ రూపంలో ఏఐ అసిస్టెంట్‌కు చెబితే .. దాని ఇమేజ్ను జనరేట్ చేస్తుంది.
- ఫొటోను GIFగా మార్చే ఫీచర్ కూడా ఇందులో ఉంది.
- వాట్సాప్‌లో ‘వాయిస్ నోట్ ట్రాన్స్క్రిప్షన్’ అనే మరో ఫీచర్ కూడా ఇప్పటికే అందుబాటులోకి వచ్చింది. దీనితో వాయిస్ మెసేజ్‌లను టెక్ట్స్ రూపంలోకి మార్చుకోవచ్చు.