AC Error Code : మీ ఏసీ డిస్‌ప్లేలో ఈ కోడ్స్ వస్తున్నాయా..?
AC Error Code : కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన ఏసీలు అధునాతన టెక్నాలజీతో వస్తున్నాయి. అవి స్మార్ట్‌గా పనిచేస్తూ ఏదైనా లోపం వచ్చినప్పుడు టెంపరేచర్ స్థానంలో ఎర్రర్ కోడ్ ద్వారా సూచిస్తున్నాయి
- By Sudheer Published Date - 01:34 PM, Sat - 26 April 25

వేసవి తీవ్రత నుండి కాపాడుకునేందుకు ప్రజలు ఎక్కువగా ఏసీ (AC) లపై ఆధారపడుతున్నారు. ఇంట్లో వాతావరణాన్ని చల్లగా ఉంచేందుకు ఏసీల వాడకం బాగా పెరిగిపోయింది. కొత్తగా మార్కెట్‌లోకి వచ్చిన ఏసీలు అధునాతన టెక్నాలజీతో వస్తున్నాయి. అవి స్మార్ట్‌గా పనిచేస్తూ ఏదైనా లోపం వచ్చినప్పుడు టెంపరేచర్ స్థానంలో ఎర్రర్ కోడ్ ద్వారా సూచిస్తున్నాయి. ప్రతి సమస్యకు ప్రత్యేకమైన ఎర్రర్ కోడ్ ఉంటుంది. కాబట్టి, ఏసీ వినియోగదారులు ఎర్రర్ కోడ్‌ల అర్థం తెలుసుకోవడం చాలా అవసరం.
Mango Price : వామ్మో కేజీ మామిడి ధర అక్షరాలా రూ.లక్ష..ఏంటో అంత ప్రత్యేకం !!
Samsung కంపెనీ ఏసీలలో కనిపించే ముఖ్యమైన ఎర్రర్ కోడ్‌లను పరిశీలిద్దాం. E1 లేదా 21 కోడ్ కనిపిస్తే, అది రూమ్ టెంపరేచర్ సెన్సార్ లో సమస్య ఉన్నట్లు సూచిస్తుంది. అదే E1 లేదా 22 కోడ్ వస్తే, హీట్ ఎక్స్ఛేంజర్ టెంపరేచర్ సెన్సార్ లో లోపం ఉందని అర్థం. ఇక E1 లేదా 54 కోడ్ కనిపిస్తే, ఫ్యాన్ మోటర్ లేదా కెపాసిటర్ లో సమస్య వచ్చినట్లు తెలుస్తుంది. ఇవి కాకుండా మరికొన్ని ఎర్రర్ కోడ్‌లు కూడా ఉంటాయి, వాటిని సర్వీస్ మేన్యువల్ ద్వారా గుర్తించి సమస్యను పరిష్కరించుకోవాలి.
Sovereign Gold Bonds : బంగారు పంట పండించిన సావరిన్ గోల్డ్ బాండ్ పథకం
LG కంపెనీ ఏసీల విషయానికి వస్తే, E2 లేదా CH01 కోడ్ ఇండోర్ పైప్ సెన్సార్ లో ఓపెన్ సర్క్యూట్ లేదా షార్ట్ సర్క్యూట్ సమస్యను తెలియజేస్తుంది. E3 లేదా CH03 కోడ్ గ్యాస్ లీకేజ్ వల్ల గ్యాస్ లేనప్పుడు కనిపిస్తుంది. ఇక E4 కోడ్ వస్తే అది నిజమైన లోపం కాదు. ఇది ఎవాపరేటర్ పై మంచు పేరుకున్నపుడు డీఫ్రాస్ట్ మోడ్ లోకి వెళ్లినట్లు సూచిస్తుంది. డీఫ్రాస్ట్ పూర్తయిన తర్వాత ఏసీ మళ్లీ సాధారణంగా పనిచేస్తుంది. కాబట్టి, ఈ కోడ్‌లు గురించి ముందుగానే అవగాహన కలిగి ఉంటే చిన్న సమస్యలను కూడా సులభంగా గుర్తించి, పెద్ద మిగులు ఖర్చులను నివారించుకోవచ్చు. సో మీరు LG కానీ Samsung ఏసీలు వాడితే ఈ కోడ్ ల ద్వారా ప్రాబ్లెమ్ తెలుసుకోవచ్చు.