Whats App: వాట్సప్ యూజర్లకు షాక్… గ్రూపులు ఇక తాత్కలికమే!
ఇంటి నుంచి ఆఫీసు వరకు ఎక్కడ చూసినా వాట్సప్ గ్రూపులే. నలుగురు కలిస్తే చాలు..
- By Nakshatra Published Date - 09:22 PM, Wed - 8 March 23

Whats App: ఇంటి నుంచి ఆఫీసు వరకు ఎక్కడ చూసినా వాట్సప్ గ్రూపులే. నలుగురు కలిస్తే చాలు.. గ్రూపును క్రియేట్ చేసి రకరకాలుగా అందులో మాట్లాడుకుంటారు. కొందరు ఈ వాట్సప్ గ్రూపులను మంచికి ఉపయోగిస్తే, మరికొందరు మాత్రం చెడుకు కూడా ఉపయోగిస్తున్నారు. కొన్ని సందర్భాల్లో బర్త్డే పార్టీ, కాలేజ్ టూర్ లేదా పండుగ
సంబరాలు వంటి వాటి గురించి స్నేహితులు, సహోద్యోగులు తాత్కాలిక గ్రూప్లను క్రియేట్ చేస్తారు. ఆ పని అయిపోయిన తర్వాత వాటికి డిలీట్ చేయకుండా మరిచిపోతారు. వారి కోసమే వాట్సప్ కొత్త ఫీచర్ ని తెచ్చింది.
డిస్ అప్పియరింగ్ మెసేజెస్, వ్యూ వన్స్ ఫీచర్ల తరహాలో ఎక్స్ పైరిం గ్ గ్రూప్స్ పేరుతో తీసుకొస్తున్న ఈ ఫీచర్ తో యూజర్లు తాత్కాలిక గ్రూప్లను క్రియేట్ చేయొచ్చు. యూజర్ ఎంపిక చేసిన నిర్ణీత కాల వ్యవధి తర్వాత ఆటో మెటిక్ గా డిలీట్ అయిపోతాయి. ప్రస్తుత పరీక్ల దశలో ఉన్న ఈ ఫీచర్ ను త్వరలోనే సాధారణ యూజర్లకు అందుబాటులోకి తీసుకురానున్నారు.
వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసిన తర్వాత గ్రూప్ ఇన్ఫోలోకి వెళ్లాలి. అందులో గ్రూప్ సెట్టింగ్స్ ఆప్షన్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేస్తే ఎక్స్ పైరింగ్ గ్రూప్స్ అనే ఆప్షన్
ఉంటుంది. దానిపై టాప్ చేయగానే రోజు, వారం, కస్టమ్ డేట్, రిమూవ్ ఎక్స్ పైరేషన్ డేట్ అని నాలుగు ఆప్షన్లు కనిపిస్తాయి. కస్టమ్ తేదీ ఆప్షన్ తో ఏ రోజు వరకు గ్రూప్ లైవ్లో ఉండాలనుకుంటున్నారో ఆ తేదీని ఎంపిక చేయాలి. ఒకవేళ గ్రూప్ డిలీట్ అవ్వాల్సిన తేదీ ఎంపిక చేసి, తర్వాత కూడా కొనసాగించాలనుకుంటే.. రిమూవ్ ఎక్స్ పైరేషన్ డేట్పై క్లిక్ చేయాలి.

Related News

Valentine’s Day: వాట్సాప్ లో వాలెంటైన్స్ డే స్పెషల్ ఫీచర్స్.. అవేంటంటే?
ప్రతి ఏడాది ప్రేమికులు ఫిబ్రవరి 14వ తేదీన ప్రేమికుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటారు. ఆరోజున వారు వారి