OnePlus 12 Discount: వన్ ప్లస్ స్మార్ట్ ఫోన్ పై అదిరిపోయే డిస్కౌంట్.. పూర్తి వివరాలివే?
ఈ కామర్స్ ఫ్లాట్ ఫార్మ్స్ ప్రస్తుతం వన్ ప్లస్ 12 స్మార్ట్ ఫోన్ పై భారీగా డిస్కౌంట్ ను అందిస్తున్నాయి. ఈ ఆఫర్ తో వేల రూపాయల డిస్కౌంట్ తో అతి తక్కువ ధరకే ఈ స్మార్ట్ ఫోన్ ని సొంతం చేసుకోవచ్చు.
- By Anshu Published Date - 11:00 AM, Mon - 15 July 24

ఈ కామర్స్ ఫ్లాట్ ఫార్మ్స్ ప్రస్తుతం వన్ ప్లస్ 12 స్మార్ట్ ఫోన్ పై భారీగా డిస్కౌంట్ ను అందిస్తున్నాయి. ఈ ఆఫర్ తో వేల రూపాయల డిస్కౌంట్ తో అతి తక్కువ ధరకే ఈ స్మార్ట్ ఫోన్ ని సొంతం చేసుకోవచ్చు. మరి ఆ వివరాల్లోకి వెళితే.. మీకు ఐసీఐసీఐ బ్యాంకు కార్డు ఉందా? అయితే మీరు ఈ స్మార్ట్ ఫోన్ ని తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.7,000 వరకు డిస్కౌంట్ లభిస్తోంది. ఈ సమయంలో వన్ ప్లస్ 12, 12 జీబీ ర్యామ్ వేరియంట్ అమెజాన్ లో అసలు ధర రూ .64,999 కు విక్రయిస్తున్నారు.
కానీ ఐసీఐసీఐ బ్యాంక్ ఆఫర్లతో వన్ ప్లస్ ఫోన్‌ను రూ .57,999 ప్రారంభ ధరకు కొనుగోలు చేయవచ్చట. అయితే ఆఫర్ ఇక్కడితో ముగిసి పోలేదండోయ్. ఎక్స్చేంజ్ ఆఫర్ కింద పాత ఫోన్ ఉంటే ఆ పాత ఫోన్ ద్వారా మీ ధరను మరింత తగ్గించుకోవచ్చు. అమెజాన్ ఈ ఫోన్‌పై రూ.53,950 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్ అందిస్తోంది. కానీ ఎక్స్ఛేంజ్ బోనస్ విలువ మీ పాత ఫోన్ కండిషన్, మోడల్, బ్రాండ్‌పై ఆధారపడి ఉంటుందన్న విషయం గుర్తుంచుకోవాలి.
ఇకపోతే ఈ వన్ ప్లస్ 12 స్మార్ట్ ఫోన్ ఫీచర్ల విషయానికొస్తే.. ఇందులో 6.82 అంగుళాల క్యూహెచ్డీ+ 2కే ఓఎల్ఈడీ ఎల్టీపీఓ డిస్ప్లే, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్, 1 హెర్ట్జ్ నుంచి 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ సపోర్ట్ ఉంది. ఇది స్క్రీన్ మీద ఉన్న కంటెంట్ ఆధారంగా ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అవుతుంది. స్క్రీన్ 4500 నిట్స్ పీక్ బ్రైట్ నెస్ సపోర్ట్ చేస్తుంది. ఈ డిస్ప్లే గొరిల్లా గ్లాస్ విక్టస్ 2 ప్రొటెక్షన్ తో వస్తుంది. అలాగే డాల్బీ విజన్, 10బిట్ కలర్ డెప్త్, ప్రోఎక్స్డీఆర్, 2160 హెర్ట్జ్ పీడబ్ల్యూఎం డిమ్మింగ్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది. కంపెనీ వివిధ రంగుల్లో కొత్త ఫోన్ ను లాంచ్ చేసింది.
ఈ ఫోన్ మనకు ఫ్లో ఎమరాల్డ్, గ్లేసియల్ వైట్, సిల్కీ బ్లాక్ వంటి రంగుల్లో కూడా లభిస్తుంది. వన్ ప్లస్ 12 స్మార్ట్ ఫోన్‌లో క్వాల్కమ్ కొత్త స్నాప్డ్రాగన్ 8 జెన్ 3 చిప్సెట్ ఉంది. LPDDR5X ర్యామ్, యూఎఫ్ఎస్ 4.0 స్టోరేజ్ ఇందులో అందించారు. తమ కొత్త వన్ ప్లస్ 12 స్మార్ట్ ఫోన్ డ్యూయల్ క్రయో-వెలాసిటీ కూలింగ్ సిస్టమ్ ఉందని, ఇది మెరుగైన గేమింగ్ అనుభవం కోసం ఉంటుందని కంపెనీ తెలిపింది. ఆండ్రాయిడ్ 14 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 14.0 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతో పాటు 64 మెగా పిక్సెల్ ఓవీ64బీ సెన్సార్, 3ఎక్స్ పెరిస్కోప్ టెలిఫోటో లెన్స్, 48 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ కూడా ఉన్నాయి. కెమెరా సెటప్ వన్ ప్లస్ ఓపెన్ స్మార్ట్ ఫోన్ పోలి ఉంటుంది. సెల్ఫీల కోసం ఈ ఫోన్‌లో 32 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 615 కెమెరా సెన్సార్ ఉంది. 100వాట్ సూపర్ వూక్ వైర్డ్, 50వాట్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5400 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్ధ్యమును కలిగి ఉండనుంది.