Smartphone Offers: అతి తక్కువ ధరకే 5జీ స్మార్ట్ ఫోన్స్.. ధర ఫీచర్స్ ఇవే?
సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్ ఫ్లిప్ కార్ట్ సంస్థలు స్మార్ట్ ఫోన్ లపై భారీగా
- By Anshu Published Date - 07:30 AM, Mon - 16 January 23

సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రముఖ ఈ కామర్స్ సంస్థలైన అమెజాన్ ఫ్లిప్ కార్ట్ సంస్థలు స్మార్ట్ ఫోన్ లపై భారీగా డిస్కౌంట్ లను అందిస్తున్నాయి. ఫ్లిప్ కార్ట్ లో బిగ్ సేవింగ్ డేస్, అలాగే అమెజాన్ లో గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ నడుస్తున్నాయి. ఆఫర్ లలో భాగంగా స్మార్ట్ ఫోన్ లు తగ్గింపు ధరకే లభిస్తున్నాయి. మరి ఆ ఫోన్ వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.. నథింగ్ స్మార్ట్‌ఫోన్ 8 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వేరియంట్ తక్కువ ధరకే లభిస్తోంది. ఈ ఫోన్‌ను మీరు రూ. 5,999కే కొనొచ్చు. అంటే దీని అసలు ధర రూ. 32,999. అయితే దీన్ని ఇప్పుడు రూ. 25,999కు కొనొచ్చు. ఎక్స్చేంజ్ ఆఫర్ రూ. 20 వేలు వరకు ఉంది.
అంటే మీకు రూ. 5,999కే ఈ ఫోన్ లభిస్తుంది. మోటరోలా ఎడ్జ్ 30 ఫ్యూషన్ 128 జీబీ మెమరీ, 8 జీబీ ర్యామ్ ఫోన్ అసలు ధర రూ. 49,999గా ఉంది. అయితే ఈ ఫోన్ ని రూ. 39,999కే సొంతం చేసుకోవచ్చు. ఇంకా ఎక్స్చేంజ్ ఆఫర్ రూ. 20 వేల వరకు ఉంది. అలా మీకు ఈ ఫోన్ రూ. 19,999కే ఈ ఫోన్ లభిస్తుంది. శాంసంగ్ గెలాక్సీ జెడ్ ఫ్లిప్ 3 ఫోన్‌లో 8 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ. 95,999గా ఉంది. అయితే దీన్ని ఇప్పుడు రూ. 49,925కు కొనొచ్చు. అలాగే ఎక్స్చేంజ్ బోనస్ రూ. 27 వేలు దాకా ఉంది. అంటే మీకు రూ. 22,925కే ఈ ఫోన్ లభిస్తుంది.
అమెజాన్‌లో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 2 లైట్ ఫోన్ ధర రూ. 18,999గా ఉంది. దీనిపై ఎక్స్చేంజ్ ఆఫర్ రూ. 17,600 వరకు ఉంది. అంటే ఈ ఫోన్‌ను రూ. 1399కే సొంతం చేసుకోవచ్చు. గూగుల్ పిక్సెల్ 7 8 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వేరియంట్ ధర కూడా రూ. 59,999గా ఉంది. దీన్ని ఇప్పుడు రూ. 56,999కు కొనొచ్చు. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ. 6 వేల వరకు తగ్గింపు వస్తుంది. అలాగే ఎక్స్చేంజ్ ఆఫర్ కింద రూ. 23 వేల వరకు డిస్కౌంట్ ఉంది. అప్పుడు మీకు ఈ ఫోన్ రూ. 27,999కే లభించినట్లు అవుతుంది