PKL 11
-
#Speed News
Pro Kabaddi League Season 11 : నేటి నుంచి ప్రో కబడ్డీ లీగ్ సీజన్-11 ప్రారంభం.. తలపడనున్న తెలుగు టైటాన్స్ – బెంగళూరు బుల్స్
Pro Kabaddi League Season 11 : గతంలో 10 సీజన్లు విజయవంతంగా పూర్తి చేసిన ఈ లీగ్ ఇప్పుడు 11వ సీజన్‌లోకి ప్రవేశించనుంది. ఈ సారి ప్రో కబడ్డీ లీగ్ మూడు దశల్లో మూడు వేర్వేరు ప్రాంతాల్లో జరగనుంది. ఇందులో భాగంగా మొదటి మ్యాచ్ ఈరోజు ప్రారంభం కానుంది, దీనికి హైదరాబాద్ నగరం ఆతిథ్యమివ్వనుంది. తొలి మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్, బెంగళూరు బుల్స్ జట్లు పరస్పరం తలపడతాయి. ఈ రోజు రాత్రి 8 గంటలకు హైదరాబాద్‌లోని గచ్చిబౌలి స్టేడియంలో వేదికగా తెలుగు టైటాన్స్ - బెంగళూరు బుల్స్ తలపడనున్నాయి.
Published Date - 10:27 AM, Fri - 18 October 24