Muddukrishna Reddy
-
#Andhra Pradesh
TDP : వైసీపీకి మరో షాక్.. ఒంటిమిట్టలో టీడీపీ విజయం
ఇక, పులివెందుల, ఒంటిమిట్ల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులు భారీ మెజారిటీతో విజయం సాధించడం ప్రాధాన్యతను సంతరించుకుంది. పులివెందులలో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి, వైసీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిపై 6,050 ఓట్ల తేడాతో ఘనవిజయం సాధించారు. ఈ ఓటమితో వైసీపీ అభ్యర్థి డిపాజిట్ కూడా కోల్పోయారు. ఈ విజయంతో టీడీపీ శ్రేణుల్లో జోష్ నెలకొంది. రాష్ట్రవ్యాప్తంగా పార్టీకి ఇది మరింత ఉత్సాహాన్ని అందించిందని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
Published Date - 01:08 PM, Thu - 14 August 25