Highlights
-
#Sports
RCB vs SRH: సన్ రైజర్స్ బ్యాటర్ల విధ్వంసం… బెంగుళూరుపై ఘన విజయం
ఐపీఎల్ 17వ సీజన్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. తన జోరును కొనసాగిస్తూ రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టును వారి సొంత గడ్డపై ఓడించింది. పరుగుల వరద పారిన ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ 25 రన్స్ తేడాతో విజయం సాధించింది.
Date : 15-04-2024 - 11:30 IST -
#Sports
MI vs CSK; రోహిత్ సెంచరీ చేసినా… ముంబైకి తప్పని ఓటమి
హోమ్ గ్రౌండ్ వాంఖడేలో ముంబై ఇండియన్స్ ఓటమి పాలైంది. ఇదే గ్రౌండ్ లో ప్రత్యర్థి జట్లకు వణుకు పుట్టిస్తున్న హార్దిక్ సేన చెన్నై సూపర్ కింగ్స్ కు ముందు తలొగ్గింది. తొలుత బ్యాటింగ్ కు దిగిన చెన్నై సూపర్ కింగ్స్ 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 206 పరుగులు చేసింది.
Date : 15-04-2024 - 12:01 IST -
#Sports
PBKS vs RR: హెట్మెయర్ మెరుపులు.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ గెలుపు
ఐపీఎల్ 27 మ్యాచ్లో భాగంగా పంజాబ్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ మధ్య జరిగిన కీలక పోరులో రాజస్థాన్ రాయల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. చివర్లో షిమ్రాన్ హెట్మెయర్ మెరుపులు మెరిపించడంతో పంజాబ్ బౌలర్లు చేతులెత్తేశారు. ఇన్నింగ్స్ లో షిమ్రాన్ హెట్మెయర్ 10 బంతులు ఎదుర్కొని 1 ఫోర్ , 3 సిక్సర్లతో 27పరుగులతో విధ్వంసం సృష్టించాడు. ఫలితంగా విజయం కోసం పోరాడిన పంజాబ్ కు మరోసారి నిరాశే మిగిలింది.
Date : 13-04-2024 - 11:33 IST -
#Sports
LSG vs DC: లక్నోకు ఢిల్లీ షాక్… రెండో విజయం అందుకున్న క్యాపిటల్స్
ఎట్టకేలకు ఢిల్లీ క్యాపిటల్స్ ఐపీఎల్ 17వ సీజన్ లో రెండో విజయాన్ని నమోదు చేసింది. హ్యాట్రిక్ విజయాలతో జోరు మీదున్న లక్నో సూపర్ జైయింట్స్ కు షాక్ ఇచ్చింది. ఆసక్తికరంగా సాగిన మ్యాచ్ లో ఢిల్లీ 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది.
Date : 12-04-2024 - 11:26 IST -
#Sports
LSG vs GT: గుజరాత్ కు లక్నో షాక్… ఛేజింగ్ లో చేతులెత్తేసిన టైటాన్స్
ఐపీఎల్ 17వ సీజన్ లో హోం టీమ్స్ విజయాల పరంపర కొనసాగుతోంది. తాజాగా లక్నో సూపర్ జెయింట్స్ సొంత గడ్డపై అదరగొట్టింది. గుజరాత్ టైటాన్స్ పై 33 పరుగుల తేడాతో విజయం సాధించింది.
Date : 07-04-2024 - 11:37 IST -
#Sports
RR vs RCB: కోహ్లీ శతకం వృథా…బట్లర్ సెంచరీ… రాజస్థాన్ రాయల్స్ ఘన విజయం
ఐపీఎల్ 17వ సీజన్ లో రాజస్థాన్ రాయల్స్ జైత్రయాత్ర కొనసాగుతోంది. వరుసగా నాలుగో మ్యాచ్ లోనూ విజయం సాధించింది. జైపూర్ వేదికగా జరిగిన మ్యాచ్ లో ఆ జట్టు రాయల్ చాలెంజర్స్ బెంగళూరు పై 6 వికెట్ల తేడాతో విక్టరీ కొట్టింది.
Date : 06-04-2024 - 11:44 IST -
#Sports
SRH vs CSK: హోం గ్రౌండ్ లో సన్ రైజర్స్ జోరు… చెన్నై సూపర్ కింగ్స్ పై విక్టరీ
ఐపీఎల్ 17వ సీజన్ లో హోం టీమ్స్ హవా కొనసాగుతోంది. తాజాగా సన్ రైజర్స్ హైదరాబాద్ సొంత గడ్డపై మరో విజయాన్ని అందుకుంది. చెన్నై సూపర్ కింగ్స్ పై 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. సన్‌రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ భారీ స్కోరు చేయలేక పోయింది.
Date : 05-04-2024 - 11:15 IST -
#Sports
DC vs KKR: సాగర తీరంలో పరుగుల సునామీ… కోల్ కత్తా హ్యాట్రిక్ విక్టరీ
ఐపీఎల్ 17వ సీజన్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ హ్యాట్రిక్ విజయాన్ని అందుకుంది. విశాఖ వేదికగా జరిగిన మ్యాచ్ ఢిల్లీ కాపిటల్స్ పై 106 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన కేకేఆర్‌కు సునీల్ నరైన్ అదిరిపోయే ఆరంభాన్ని అందించాడు.
Date : 03-04-2024 - 11:39 IST -
#Sports
RCB vs LSG: బెంగళూరుకు మరో ఓటమి… లక్నో సూపర్ జెయింట్స్ విక్టరీ
ఐపీఎల్ 17వ సీజన్ లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు సొంత గడ్డపై మరో ఓటమి ఎదురయింది.ఆసక్తికరంగా సాగిన మ్యాచ్ లో లక్నో సూపర్ జెయింట్స్ 28 పరుగుల తేడాతో విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్‌కు ఓపెనర్లు క్వింటన్ డికాక్, కేఎల్ రాహుల్ అదిరిపోయే ఆరంభాన్ని అందించారు.
Date : 02-04-2024 - 11:33 IST -
#Sports
MI vs RR: ముంబై మూడో “సారీ” రాజస్తాన్ చేతిలో చిత్తు
పీఎల్ 17వ సీజన్ లో ముంబై ఇండియన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. వరుసగా మూడో మ్యాచ్ లోనూ చిత్తుగా ఓడింది. బ్యాటర్లు నిరాశపరచడంతో రాజస్థాన్ రాయల్స్ పై 6 వికెట్ల తేడాతో ఘోరపరాజయం చవిచూసింది. మొదట బ్యాటింగ్ కు దిగిన ముంబై ఏ దశలోనూ పోటీ ఇవ్వలేకపోయింది.
Date : 01-04-2024 - 11:27 IST -
#Sports
LSG vs PBKS: లక్నో కు తొలి విజయం… చేజింగ్ లో ఓడిన పంజాబ్ కింగ్స్
ఐపీఎల్ 17వ సీజన్ లో లక్నో సూపర్ జెయింట్స్ తొలి విజయాన్ని అందుకుంది. హోం గ్రౌండ్ లో పంజాబ్ కింగ్స్ పై 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. మొదట బ్యాటింగ్ కు దిగిన లక్నో సూపర్ జెయింట్స్ 200 పరుగుల భారీ స్కోరు చేసింది. లక్నోకు ఈ మ్యాచ్ లో సరైన ఆరంభం దక్కలేదు.
Date : 30-03-2024 - 11:39 IST -
#Sports
RCB vs KKR Highlights: హోం గ్రౌండ్ లో బెంగుళూరుకు షాక్… కోల్ కత్తా నైట్ రైడర్స్ కు రెండో విజయం
ఐపీఎల్ 17వ సీజన్ లో హోం టీమ్స్ విజయాల సెంటిమెంట్ బ్రేక్ అయింది. వరుసగా 9 మ్యాచ్ ల్లోనూ ఆతిథ్య జట్లే గెలవగా...10వ మ్యాచ్ లో మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. బెంగుళూరు వేదికగా జరిగిన మ్యాచ్ లో కోల్ కత్తా నైట్ రైడర్స్ 7 వికెట్ల తేడాతో ఆర్సీబీ పై విజయం సాధించింది.
Date : 29-03-2024 - 11:09 IST -
#Sports
MI vs SRH: హోమ్ గ్రౌండ్ లో దుమ్మురేపిన సన్ రైజర్స్.. ముంబైకి రెండో ఓటమి
ఇది కదా మ్యాచ్ అంటే...ఇది కదా విధ్వంసం అంటే...ఇది కదా పరుగుల సునామీ అంటే...ఐపీఎల్ 17వ సీజన్ కి సన్ రైజర్స్ హైదరాబాద్ మరింత ఊపు తెచ్చింది. ఉప్పల్ స్టేడియం వేదికగా రికార్డుల మోత మోగిస్తూ ముంబై ఇండియన్స్ పై 31 రన్స్ తేడాతో విజయం సాధించింది.
Date : 27-03-2024 - 11:36 IST -
#Sports
IND vs ENG 3rd Test: 434 పరుగుల తేడాతో ఇంగ్లండ్ పై భారత్ చారిత్రాత్మక విజయం
భారత్-ఇంగ్లండ్ జట్ల మధ్య జరుగుతున్న ఐదు టెస్టు మ్యాచ్ ల టీమిండియా హిస్టారికల్ విజయాన్ని సొంతం చేసుకుంది. 5 టెస్టుల సిరీస్ లో భాగంగా మూడో టెస్టులో టీమిండియా 434 పరుగుల తేడాతో ఇంగ్లండ్ పై విజయం సాధించింది. ఈ చారిత్రాత్మక విజయంతో ఈ సిరీస్‌లో టీమిండియా 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
Date : 18-02-2024 - 5:17 IST -
#India
Interim Budget : బడ్జెట్‌లో పలు శాఖలకు.. పథకాలకు కేటాయింపులు చూస్తే..
కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ (Nirmala Sitharaman) గురువారం పార్లమెంట్‌లో మధ్యంతర బడ్జెట్ (Interim Budget) ను ప్రవేశపెట్టారు. ప్రధాని మోడీ (పీఎం Modi) నేతృత్వంలోని ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్ కావడం విశేషం. మొత్తం బడ్జెట్ (Total Budget ) ను రూ.47.66లక్షల కోట్లు కాగా.. వివిధ మార్గాల ద్వారా ఆదాయం రూ.30.80లక్షలకోట్లుగా అంచనా వేశారు. ఇందులో వివిధ శాఖలు, పథకాలకు కేటాయింపులు చూస్తే.. మౌలిక వసతుల రంగానికి రూ.11.11లక్షల కోట్లు గ్రామీణాభివృద్ధి […]
Date : 01-02-2024 - 1:37 IST