Hard Comments
-
#Cinema
Anjali: బెడ్ రూమ్ సన్నివేశాల్లో నటించాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది: హీరోయిన్ అంజలి
Anjali: హీరోయిన్ అంజలి అనగానే ఫ్యామిలీ కథలు మాత్రమేకాదు.. మసాలా లాంటి ఐటమ్ సాంగ్స్ గుర్తుకువస్తాయి. ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు వెబ్ తెర మీద దూసుకుపోతోంది ఈ బ్యూటీ. తాజగా ఈ సుందరి బోల్డ్ కామెంట్స్ చేసి వార్తల్లోకి ఎక్కింది. సినిమాల్లో ముద్దు సన్నివేశాలు, పడకగది సన్నివేశాలు సహజంగా తీస్తారని.. కథకు అవసరమైనప్పుడు కచ్చితంగా అందులో నటించాల్సి వుంటుందని.. కాదనలేమని చెప్పుకొచ్చింది. కానీ హీరోలతో ఆ తరహా సన్నివేశాలు నటించేటప్పుడు ఎలాంటి వారికైనా కాస్త ఇబ్బందులు తప్పవు. […]
Published Date - 05:39 PM, Wed - 17 January 24 -
#Speed News
Minister Ponnam: కేసీఆర్, బండి సంజయ్ కరీంనగర్ కు ఏం చెశారో చెబుతారా: మంత్రి పొన్నం
Minister Ponnam: మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రతిపక్ష పార్టీలపై విరుచుకుపడ్డారు. క రీంనగర్‌లో ఆయన విలేకరులతో మాట్లాడు తూ బీఆర్ఎస్, బీజేపీ పార్టీలను ఎండగట్టారు. దేశ భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలో కాంగ్రెస్ పార్టీని గెలిపించండి అని కోరారు. కెసిఆర్, వినోద్‌కుమార్ కరీంనగర్ ఎంపిలుగా ఏం అభివృద్ధి చేశారో, తాను ఎంపిగా ఏంచేశానో చర్చకు వస్తారా అని సవాల్ చేశారు. కెటిఆర్ అధికారం కోల్పోయిన అసహనంతో ఉన్నారని ఎద్దేవా చేశారు. సిఎం పదవి కన్నా కెసిఆర్ పవర్‌ఫుల్ అనేది భ్రమ, […]
Published Date - 01:16 PM, Mon - 15 January 24 -
#Telangana
KTR: తెలంగాణలో కాంగ్రెస్ హత్య రాజకీయాలు చెల్లవు – కేటీఆర్
KTR: తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా రాజకీయ కక్షలు, హత్య రాజకీయాలు ప్రారంభమైనయని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. తమ పార్టీ కార్యకర్తల పైన దాడులు చేస్తే ఊరుకునేదే లేదని హెచ్చరించిన కేటీఆర్, ప్రతి ఒక్క కార్యకర్తకు పార్టీ మొత్తం అండగా ఉంటుందని తెలిపారు. ఈరోజు నాగర్ కర్నూలు జిల్లా పెద్దకొత్తపల్లి మండలం గంట్రావుపల్లి గ్రామంలో డిసెంబర్ 29న, కాంగ్రెస్ నాయకుల చేతుల్లో దారుణ హత్యకు గురైన బిఆర్ఎస్ కార్యకర్త రిటైర్డ్ […]
Published Date - 05:26 PM, Sun - 14 January 24 -
#Telangana
BRS Party: బీఆర్ఎస్ ను TRS గా మార్చాల్సిందే, గులాబీ పార్టీకి కొత్త చిక్కులు!
BRS Party: ఇటీవలి రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలలో నిర్ణయాత్మక ఓటమి తరువాత భారత రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) నాయకులు, క్యాడర్ బీఆర్ఎస్ పార్టీని ‘టిఆర్ఎస్) గా మార్చడాన్ని పరిశీలించాలని హైకమాండ్‌ను ఎక్కువగా కోరుతున్నారు. బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు కుమారుడు కేటీ రామారావుకు పలువురు పార్టీ కార్యకర్తలు ఈ సూచన చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. వారి అభిప్రాయం ప్రకారం పార్టీ పేరు నుండి ‘తెలంగాణ’ను తొలగించడం వల్ల రాష్ట్రంతో సంబంధాలు తెగిపోయినట్లుగా భావిస్తున్నారు. […]
Published Date - 05:51 PM, Sat - 13 January 24 -
#Andhra Pradesh
Minister Roja: ఎమ్మెల్యేల టిక్కెట్లను వైసీపీ డబ్బులకు అమ్ముకోదు: మంత్రి రోజా
Minister Roja: పర్యాటక శాఖ మంత్రి ఆర్.కె. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల టిక్కెట్లను డబ్బుకు అమ్ముకోదని “చంద్రబాబు నాయుడికి ఇలా చేయడం అలవాటే” అని తెలుగుదేశంపై రోజా మండిపడ్డారు. నాయుడు ఉదయం జనసేన, మధ్యాహ్నం కాంగ్రెస్, రాత్రి బీజేపీతో కలిసి వచ్చే ఎన్నికల్లో విజయం సాధించేందుకు కుట్రలు పన్నుతున్నారని ఆమె అన్నారు. టీడీపీ నేత నారా లోకేష్‌ను మండలగిరి మొద్దు అని ఆమె అభివర్ణించారు.‘‘ఆయన మంగళగిరిని సరిగ్గా పలకలేరు. ఏపీ రాష్ట్రాన్ని చంద్రబాబు అప్పుల్లోకి నెట్టారని ఆమె […]
Published Date - 02:31 PM, Sat - 13 January 24 -
#Telangana
Harish Rao: ఆటో డ్రైవర్ల సమస్యలపై అసెంబ్లీలో ప్రభుత్వాన్ని నిలదీస్తాం!
Harish Rao: సిద్దపేట్ పట్టణంలో ‘సిద్దిపేట జిల్లా ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ’ ఆధ్వరంలో ఆటల పొటీ కార్యక్రమాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘సిద్దిపేట జిల్లా ఆటో క్రెడిట్ కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో అటల పోటీలు నిర్వహించడం రాష్ట్రానికి ఆదర్శం. 1480 మంది ఆటో డ్రైవర్లు ఈ సొసైటీలో సభ్యులుగా ఉన్నారు. ఆటో డ్రైవర్లు సిద్దిపేటకు బ్రాండ్అంబాసిడర్లు. పట్టణానికి వచ్చే అతిథులను గౌరవమర్యాదలతో గమ్యాలకు చేరుస్తున్నారు’’ అని హరీశ్ రావు అన్నారు. […]
Published Date - 01:52 PM, Sat - 13 January 24 -
#Speed News
Jeevan Reddy: బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రచారం తప్ప పనులు చేయలేదు
Jeevan Reddy: కాంగ్రెస్ ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నేతలపై విరుచుకుపడుతున్నారు. తరచుగా మీడియా ముందుకొచ్చి నేతలపై ఘాటు విమర్శలు చేస్తున్నారు. గాంధీభవన్ లో ఆయన మీడియాతో మాట్లాడారు. బిఆర్‌ఎస్‌కు ఇంకా జ్ఞానోదయం కలగలేదని మండిపడ్డారు. మిషన్ భగీరథ పెద్ద కుంభకోణం అని మండిపడ్డారు. లోక్ సభ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు డిపాజిట్లు కూడా రావని ఎద్దేవా చేశారు. బిఆర్‌ఎస్ ప్రచారం చేసుకోవడం తప్ప ఎక్కడా అభివృద్ధి చేయలేదని ధ్వజమెత్తారు. బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆత్మస్తుతి, పరనింద […]
Published Date - 07:47 PM, Fri - 12 January 24 -
#Telangana
KTR: పనుల కంటే ప్రచారం మీద ఫోకస్ చేసి ఉంటే మేమే గెలిచేవాళ్ళం: కేటీఆర్
KTR: పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రసిడెంట్ కేటీఆర్ వేగంగా ముందుకు సాగుతున్నారు. పలు స్థానాలపై ఇప్పటికే ఆయన కార్యాచరణ రూపొందిస్తున్నారు. కీలక నేతలతో భేటీ అవుతున్నారు. ఈ నేపథ్యంలో మహబూబాద్ పార్లమెంట్ నియోజకర్గ సన్నాహక సమావేశంలో కెటీఆర్ పాల్గొని మాట్లాడారు. ‘‘ప్రజలు మనకు పదేళ్లు అవకాశం ఇచ్చారు. అధికారంలోకి వస్తాం అని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అనుకోలేదు. నోటికి ఏది వస్తే అది హామి అని చెప్పారు. ఆరు గ్యారెంటీలు అన్నారు. కానీ 420 హమీలిచ్చింది […]
Published Date - 12:54 PM, Thu - 11 January 24 -
#Andhra Pradesh
Chandrababu: పేదలు సంక్రాంతి పండగను కూడా చేసుకోలేని పరిస్థితి: చంద్రబాబు నాయుడు
Chandrababu: వైకాపా ప్రభుత్వ పాలనలో పేదలు సంక్రాంతి పండగను కూడా చేసుకోలేని పరిస్థితి తలెత్తిందని మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. విజయనగరం జిల్లా బొబ్బిలిలో నిర్వహించిన ‘రా.. కదలి రా’ బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో అన్ని రంగాలను సీఎం జగన్ రివర్స్ గేర్‌లో పెట్టారని.. ఆయన మాత్రం దేశంలోనే అత్యంత ధనవంతుడిగా ఎదిగారని అన్నారు. ఉన్నప్పుడు పండగ సమయంలో ఉచితంగా సరకులిచ్చామని గుర్తుచేశారు. తమ హయాంలో పేదల కోసం అన్న […]
Published Date - 06:21 PM, Wed - 10 January 24 -
#Telangana
Seethakka: కేసీఆర్ ఇంట్లో ఐదు ఉద్యోగాలు గల్లంతు అయ్యాయి, అందుకే వాళ్లకు ఫ్రస్టేషన్!
Seethakka: కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కేసీఆర్ ఇంట్లో ఐదు ఉద్యోగాలు గల్లంతు అయ్యాయని, అందుకే తమ ఆదేశాలు సరిగా వినిపించడం లేదని మంత్రి సీతక్క బుధవారం ఆరోపించారు. ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించిన పార్లమెంట్ ఎన్నికలపై నిర్మల్ జిల్లా కేంద్రంలోని రాజరాజేశ్వర గార్డెన్స్‌లో మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆదిలాబాద్ అక్షర క్రమంలో ముందున్నప్పటికీ అభివృద్ధిలో మాత్రం వెనుకబడి ఉందన్నారు. సరస్వతీదేవి కొలువుదీరిన ప్రాంతం, మహానుభావులు పుట్టిన ప్రాంతం అభివృద్ధి విషయంలో విస్మరించారన్నారు. […]
Published Date - 06:07 PM, Wed - 10 January 24 -
#Speed News
Bandi Sanjay: కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలి: బండి సంజయ్
Bandi Sanjay: మార్చి లేదా ఏప్రిల్‌లో జరగనున్న పార్లమెంట్ ఎన్నికలకు రాష్ట్రంలో ఎన్నికల కోడ్ విధింపుపై రాష్ట్ర ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉన్నప్పటికీ, అభయహస్తం దరఖాస్తుల పరిశీలన, డిజిటలైజేషన్ పేరుతో కాలయాపన చేస్తోందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ ఆరోపించారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ వెంకట్‌పల్లిలో విక్షిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో భాగంగా బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పర్యటించారు. స్థానికులతో […]
Published Date - 12:33 PM, Wed - 10 January 24 -
#Telangana
Kalvakuntla Kavitha: రాయలసీమ ప్రాజెక్టు పనులను సీఎం రేవంత్ రెడ్డి ఆపేయించాలి: కల్వకుంట్ల కవిత
Kalvakuntla Kavitha: పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టు పనుల టెండర్ల రద్దు చేయాలన్న ఆలోచనను కట్టిపెట్టి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేయడంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సూచించారు. ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించిన పనులను రద్దు చేసి మళ్లీ టెండర్లను ఆహ్వానిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయని ప్రస్తావించారు. టెండర్లను రద్దు చేసి మళ్లీ టెండర్లను ఎందుకు పిలవాలనుకుంటున్నారో ప్రజలకు […]
Published Date - 04:42 PM, Tue - 9 January 24 -
#Telangana
KTR: సంక్షేమ కార్యక్రమాలను ఆపితే, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతాం: కేటీఆర్
KTR: పేద ప్రజల కోసం గత ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ కార్యక్రమాలను కాంగ్రెస్ పార్టీ రద్దు చేస్తే ప్రధాన ప్రతిపక్షంగా తమ బాధ్యత నిర్వహిస్తామని, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎండగడతామన్నారు భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే. తారకరామారావు తెలిపారు. 50 సంవత్సరాల పాటు అధికారం వెలగబెట్టిన కాంగ్రెస్ పార్టీ గతంలో ఎన్నడూ కూడా పేద ప్రజల కోసం విప్లవాత్మకమైన, వినూత్నమైన కార్యక్రమాలను అమలు చేసేందుకు కూడా ఆలోచన చేసే సహాసం చేయలేదన్న కేటీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రారంభించిన […]
Published Date - 05:57 PM, Mon - 8 January 24 -
#Telangana
Harish Rao: దుబ్బాక గులాబీ పార్టీ అడ్డా, తెలంగాణ ఉద్యమానికి పుట్టినిల్లు: హరీశ్ రావు
Harish Rao: దుబ్బాకలో ఎన్ని సమస్యలు ఉన్నా ఏకతాటిపై వచ్చి కొత్త ప్రభాకర్ రెడ్డి గెలుపు కోసం కృషి చేసిన అందరికి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. కష్టపడిన ప్రత కార్యకర్తకు శిరస్సు వంచి నమస్కరిస్తున్నా అని బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ‘‘గత ఎన్నికల్లో దుబ్బాకలో ఓడిపోయినప్పుడు చాలా బాధపడ్డాం. మీరు, ప్రజలు ఇప్పుడు ప్రభాకరన్నను 50 వేలకుపా మెజారిటీతో గెలిపించి వడ్డీతో సహా చెల్లించి అద్భుత విజయాన్ని సాధించారు. మంచి వ్యక్తి అయిన కొత్త ప్రభాకర్‌కు […]
Published Date - 05:31 PM, Tue - 2 January 24 -
#Speed News
Ponguleti: బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణను లూటీ చేసి అప్పుల ఊబిలోకి నెట్టింది : పొంగులేటి
Ponguleti: గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెలంగాణను లూటీ చేసి రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి మంగళవారం మండిపడ్డారు. పాలేరు నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో ప్రజాపరిపాలన కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన కొద్ది రోజుల్లోనే ఆరు హామీల అమలు దిశగా ముందుకు సాగుతున్నామన్నారు. మొదటి కేబినెట్ సమావేశంలోనే ఆరు హామీలను ఆమోదించినట్లు ఆయన గుర్తు చేశారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో ప్రజా పాలన నడుస్తోందన్నారు. తమ […]
Published Date - 04:49 PM, Tue - 2 January 24