Anjali: బెడ్ రూమ్ సన్నివేశాల్లో నటించాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది: హీరోయిన్ అంజలి
- By Balu J Published Date - 05:39 PM, Wed - 17 January 24

Anjali: హీరోయిన్ అంజలి అనగానే ఫ్యామిలీ కథలు మాత్రమేకాదు.. మసాలా లాంటి ఐటమ్ సాంగ్స్ గుర్తుకువస్తాయి. ఒకవైపు సినిమాలు చేస్తూనే, మరోవైపు వెబ్ తెర మీద దూసుకుపోతోంది ఈ బ్యూటీ. తాజగా ఈ సుందరి బోల్డ్ కామెంట్స్ చేసి వార్తల్లోకి ఎక్కింది. సినిమాల్లో ముద్దు సన్నివేశాలు, పడకగది సన్నివేశాలు సహజంగా తీస్తారని.. కథకు అవసరమైనప్పుడు కచ్చితంగా అందులో నటించాల్సి వుంటుందని.. కాదనలేమని చెప్పుకొచ్చింది. కానీ హీరోలతో ఆ తరహా సన్నివేశాలు నటించేటప్పుడు ఎలాంటి వారికైనా కాస్త ఇబ్బందులు తప్పవు.
ఎందుకంటే అలాంటి బోల్డ్ సీన్స్ షూట్ చేసేటప్పుడు చుట్టూ జనం, టెక్నీషియన్లు మిగతా నటీనటులు కూడా వుంటారు. వారందరూ తన గురించి లోపల ఏం మాట్లాడుకుంటారని భయం వుంటుంది. ఎందుకంటే.. ఇద్దరు ప్రేమికుల మధ్య కెమిస్ట్రీ చాలా భిన్నంగా వుంటుంది. హీరోలతో కిస్సింగ్ బెడ్ రూమ్ సన్నివేశాల్లో సహజంగా నటించాలని.. అందుకే కాస్త ఇబ్బందిగానే వుటుందని తెలిపింది. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి. బాలకృష్ణ , వెంకటేష్ వంటి అగ్ర హీరోల సరసన నటించిన అంజలి మంచి మార్కులేకొట్టేసింది.
2006లో ఫొటో సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు పరిచయమైన అంజలి ఆ తర్వాత 2007లో తమిళ సినీ పరిశ్రమలో అడుగు పెట్టింది. అక్కడే వరుసగా సెటిలైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తెలుగులో మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది. కానీ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం అంత గుర్తింపు అందుకోలేకపోయింది. ఇక ప్రస్తుతం మళ్లీ పలు అవకాశాలు అందుకుంది. ఈ ముద్దుగుమ్మ కు పెళ్లి చేసుకునే మూడ్ లేదట.